
కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో కింగ్ మాస్ యాక్షన్‌కు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
(చదవండి: 'నాగార‍్జున షాకింగ్ నిర్ణయం.. అప్పటివరకు సినిమాలకు బ్రేక్')
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సన్నివేశాలు సినిమాలో కీలకమైనవిగా అర్థమవుతోంది. 'డబ్బు, సక్సెస్.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది’ అన‍్న డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment