నాగార్జున ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Nagarjuna The Ghost Movie Hit In Theatres on October 5th | Sakshi
Sakshi News home page

The Ghost Release Date: నాగార్జున ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Published Tue, Sep 13 2022 8:21 PM | Last Updated on Tue, Sep 13 2022 9:00 PM

Nagarjuna The Ghost Movie Hit In Theatres on October 5th - Sakshi

‘కింగ్‌’ నాగార్జున నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఇందులో నాగ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌పై సస్పెన్స్‌ నెలకొంది. 

చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

కాగా ‘ది ఘోస్ట్‌’ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఈ సినిమాను అక్టోబర్‌ 5న థియేటర్లో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం స్పందించలేదు. దీంతో ది ఘోస్ట్‌ విడుదలపై అక్కినేని అభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో ఈ మూవీ రిలీజ్‌పై కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్‌ 5న థియేటర్లోనే రిలీజ్‌ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్‌ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. 

చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement