
పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, నాగార్జున–సోనాల్‌ల కొత్త పోస్టర్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం.
‘‘ఇప్పటివరకు విడుదల చేసిన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. దాంతో ట్రైలర్‌పై అంచనాలు పెరి గాయి. ట్రైలర్‌లో మరింత ఎగ్జయిటింగ్ యాక్షన్‌ని చూపించనున్నాం. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.
∙నాగార్జున, సోనాల్ చౌహాన్
Comments
Please login to add a commentAdd a comment