Narayan Das Narang
-
పద్దెనిమిది రోజులు ఫుడ్ తీసుకోలేదు!
‘‘సందీప్‌లో ప్రతిభ, కష్టం కనిపించాయి కానీ అదృష్టం కనిపించలేదు’ అని హీరో నాని అన్నారు. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినంత పేరు రాలేదని చాలామంది అంటుంటారు. నాని చెప్పినట్లు ‘మైఖేల్’తో నాకు అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు. ► ఇప్పుటివరకూ నేను చేయాలనుకుని చేయలేకపోయినది ఏంటి? అని ఆలోచించినప్పుడు ‘మైఖేల్’ ఐడియా వచ్చింది. నా ఆలోచన రంజిత్‌కి చెప్పాను. ఆ ఆలోచన తీసుకుని తను చెప్పిన ‘మైఖేల్’ కథ బాగా నచ్చింది. భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ వంటి నిర్మాతలు తోడవ్వడంతో ఈ సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఈ చిత్రకథకి, విజువల్ నెరేటివ్‌కి, సినిమాకి పాన్ ఇండియా స్థాయి ఉంది.. అందుకే పాన్ ఇండియా మూవీగా తీశాం. ► ‘మైఖేల్’ యూనిక్ స్టోరీ. చెడ్డవాళ్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. యాక్షన్, ఎమోషన్స్, డార్క్ కామెడీ ఉంటుంది. మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్‌స్టర్ కాకపోయినా నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. ► ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం దాదాపు 18 రోజులు పాటు ఫుడ్ తీసుకోకుండా నీళ్లు మాత్రమే తాగేవాణ్ణి. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అయినా ఒక ఫైట్ షూట్ చేసి, ప్యాకప్ చెప్పాం. తమిళ సంస్కృతి, భాష నాకు తెలుసు. అందుకే తమిళ ప్రేక్షకుల నుంచి నాకు మంచి ప్రేమ లభించింది.. అలాగే విజయ్ సేతుపతిగారు ‘మైఖేల్’లో భాగమయ్యారు. ధనుష్‌గారు ‘కెప్టెన్ మిల్లర్’లో నన్ను తీసుకున్నారు. ‘మైఖేల్’కి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ► ‘మైఖేల్’ నాకు చాలా స్పెషల్ జర్నీ. ఈ ప్రయాణంలో బరువు తగ్గాను, స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. అండర్ వాటర్‌లోనూ షూటింగ్ చేశాం. ప్రస్తుతం ‘భైరవ కోన, కెప్టన్ మిల్లర్, బడ్డీ’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ ఉంది. -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్‌గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా షురూ
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కనున్న సినిమా షురూ అయింది. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘‘తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించి, విడుదల చేస్తాం. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు మా సినిమా కోసం పని చేయనున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్. -
ప్రిన్స్ ఓ చాలెంజ్
‘‘ప్రిన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇందులోని డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ మా సినిమా నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పంచుకున్న విశేషాలు... ► నటుడిగా అన్ని భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకులని అలరించాలని ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి. నాకు కామెడీ సినిమాలు చేయడం అన్నా, చూడటం అన్నా చాలా ఇష్టం. నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్‌ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా ఎగై్జట్ చేయడంతో ‘ప్రిన్స్’ కి ఓకే చెప్పాను. ► ‘ప్రిన్స్ నా తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ఒక సవాల్‌తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో కథ రాశారు. తెలుగు స్క్రిప్ట్‌ని తమిళ్లో చేయడం ఒక సవాల్‌గా తీసుకొని పని చేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. నా పాత్రకి తెలుగులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ► ఒక ఇండియన్ అబ్బాయి బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరి మనుషుల్లో ప్రేమ, పెళ్లి విషయాల్లో మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. వారి ఆలోచనలను బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎగై్జట్ చేసింది. ► నేను కథని ఎంపిక చేసుకునేటప్పుడు గత చిత్రం రిజల్ట్ గురించి ఆలోచించను. ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ కథలో కొత్తదనం ఏంటి? విమర్శకులు దీన్ని ఎలా చూస్తారు? అని ఆలోచిస్తాను. నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. పైగా ప్రిన్స్ అన్ని భాషలకు సరిపోయే టైటిల్.. అందుకే ఆ పేరు పెట్టాం. ► నేను, హీరో నానిగారు ఒకేలా కనిపిస్తామని ప్రేక్షకులు చెబుతుంటారు. నానిగారు కూడా యాంకర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేసి, హీరోగా ఎదిగారు. నేను కూడా టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. నా పదేళ్ల నట ప్రయాణంలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. ► సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, రామ్మోహన్ రావు కాంబినేషన్లోని ‘ప్రిన్స్’ లో భాగం కావడం హ్యాపీ. తెలుగులో రాజమౌళిగారితో మూవీ చేయాలని ఉంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్గార్ల సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నా. భవిష్యత్‌లోనూ ద్విభాష(తెలుగు, తమిళ)చిత్రాలు చేయాలనే ఆలోచన నాకు ఉంది. ప్రస్తుతం విజయ్ హీరోగా వంశీ పైడిపల్లిగారు ఓ సినిమా చేస్తున్నారు. అలాగే హీరో రామ్ చరణ్– శంకర్‌గారు కలసి పని చేస్తున్నారు. తెలుగు–తమిళ పరిశ్రమల వాళ్లు కలిసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. ‘‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్, కాంతార’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. దక్షిణాది పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉండటం సంతోషం. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
ఆ హీరోతో రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది: సోనాల్ చౌహాన్
‘‘యాక్షన్ మూవీ చేయాలనే నా ఆకాంక్ష ‘ది ఘోస్ట్’తో నెరవేరింది’’ అన్నారు సోనాల్ చౌహాన్. నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ చెప్పిన విశేషాలు... ► ప్రవీణ్ సత్తారు ‘ది ఘోస్ట్’ కథ చెప్పినపుడు థ్రిల్ అయ్యాను. ఈ చిత్రంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేశాను. ఇది సవాల్‌తో కూడుకున్న పాత్ర. అందుకే శిక్షణ తీసుకున్నాను. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అయితే ట్రైనింగ్ టైమ్‌లో రెండో రోజే కాలి వేలు ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్ సలహా మేరకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని, మళ్లీ శిక్షణ తీసుకుని షూటింగ్‌కి ఎంటర్ అయ్యాను. ► ఇంటర్‌పోల్ ఆఫీసర్ని కాబట్టి కొన్ని రకాల తుపాకీలను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అయితే మా నాన్న పోలీస్ కావడంతో గన్స్ పట్టుకోవడం తెలుసు. కానీ ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్‌ని హ్యాండిల్ చేయాల్సి రావడంతో శిక్షణ తీసుకున్నాను. గ్లామరస్ క్యారెక్టర్సే కాదు.. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ సినిమా నిరూపిస్తుంది. ► నాగార్జునగారిని ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు కాస్త నెర్వస్ అయ్యాను. అయితే పది నిమిషాలు మాట్లాడాక నా భయం పోయింది. నాగార్జునగారు కింగ్ అఫ్ రొమాన్స్. ‘వేగం...’ పాటలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నాగార్జునగారితో ఓ రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది. ► మాది సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబం. మా కుటుంబంలో ఆడవాళ్లు ఇంటి నుండి బయటకు రావడమే పెద్ద విషయం. అలాంటిది నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా పరిశ్రమలో నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏ అవగాహన కూడా లేదు. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. ఎత్తుపల్లాలను ఎలా తీసుకోవాలో సినిమా పరిశ్రమే నేర్పింది. -
The Ghost: ఎమోషన్.. యాక్షన్
పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, నాగార్జున–సోనాల్ల కొత్త పోస్టర్ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఇప్పటివరకు విడుదల చేసిన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. దాంతో ట్రైలర్‌పై అంచనాలు పెరి గాయి. ట్రైలర్లో మరింత ఎగ్జయిటింగ్ యాక్షన్‌ని చూపించనున్నాం. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. ∙నాగార్జున, సోనాల్ చౌహాన్ -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కొల్లి రామకృష్ణ.. అప్పటివరకు పదవిలో..
Kolli Ramakrishna Elected To Telugu Film Chamber President: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షునిగా కొల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో ఈ నెల 19న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం జరిగిన ‘టీఎఫ్‌సీసీ’ కార్యవర్గ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్)ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఏడాది జూలై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1946 జులై 27న జన్మించిన నారాయణ దాస్ నారంగ్ (76) ఏప్రిల్ 19, 2022న మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: ఏషియన్ థియేటర్స్ అధినేత కన్నుమూత చదవండి: బర్త్‌డే గర్ల్ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్లీ వస్తువులు తెలుసా ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నారాయణ్ దాస్ మంచి సలహాలిచ్చేవారు: నిర్మాత
‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
నారాయణ దాస్ నారంగ్‌కు నివాళులర్పించిన టాలీవుడ్ ప్రముఖులు
-
నారాయణ్ దాస్ మృతి: చిరంజీవి, మహేశ్ బాబు ఎమోషనల్ ట్వీట్స్
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్(76) మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’అని చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి🙏🙏🙏 pic.twitter.com/Ujpb0LqGa5 — Acharya (@KChiruTweets) April 19, 2022 అలాగే సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా నారాయణ్ దాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘నారాయణ్ దాస్ ఇకలేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేస్తున్నాను. నారయణ్ దాస్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుధీర్‌బాబు, సుషాంత్, శివకార్తికేయతో పాటు పలువురు సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. Shocked and saddened by the demise of #NarayanDasNarang garu. A prolific figure in our film industry.. his absence will be deeply felt. A privilege to have known and worked with him. pic.twitter.com/SLe1OCCOeZ — Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2022 Deeply saddened to hear about the passing away of our beloved producer Shri #Narayandasnarang sir. My condolences to @asiansuniel sir and his family members,May his soul Rest In Peace 🙏 pic.twitter.com/64DDmkU0so — Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 19, 2022 Sad to hear about the sudden demise of #NarayanDasNarang garu. His contribution to the industry will always be remembered... My deepest condolences to the family. pic.twitter.com/UB6AVeuEsi — Sudheer Babu (@isudheerbabu) April 19, 2022 May you rest peacefully Sir 🙏🙏 Your contribution to cinema will always be remembered.. Strength to the family and loved ones🙏 Shri #NarayanDasNarang garu pic.twitter.com/EazTuawkfk — Sushanth A (@iamSushanthA) April 19, 2022 -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత
నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్‌కూడా ఆయిన ఆయన చలనచిత్రరంగంలో అజాతశత్రువుగా పేరుగాంచారు. తెలంగాణలో పంపిణీదారునిగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.