Sivakarthikeyan: ‘హూ యామ్‌ ఐ..’ | Sivakarthikeyan Prince song launch | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: ‘హూ యామ్‌ ఐ..’

Published Sat, Oct 15 2022 12:43 AM | Last Updated on Sat, Oct 15 2022 12:45 AM

Sivakarthikeyan Prince song launch - Sakshi

శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్‌’. అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్‌. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, డి. సురేష్‌ బాబు, పుస్కుర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.

తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్‌ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్‌ కల్వల పాడారు. ‘‘కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్‌ పరమహంస, సహనిర్మాత: అరుణ్‌ విశ్వ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement