Maria
-
గ్రాండ్ ఓల్డ్ లేడీ ఇక లేదు
మాడ్రిడ్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న 117 ఏళ్ల బామ్మ ఇకలేరు. అమెరికాలో జన్మించిన, స్పెయిన్ దేశస్తురాలు మరియా బ్రన్యాస్ కన్నుమూశారని ఆమె కుటుంబసభ్యులు మంగళవారం ప్రకటించారు. బ్రన్యాస్ ‘ఎక్స్’పేజీలో వారు..‘మరియా బ్రన్యాస్ మనల్ని విడిచి వెళ్లిపోయారు. కోరుకున్న విధంగానే నిద్రలోనే, ప్రశాంతంగా, ఎలాంటి బాధా లేకుండా తుదిశ్వాస విడిచారు’అని పేర్కొన్నారు. 110, అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్.. ఫ్రాన్సుకు చెందిన లుసిలె రాండన్ అనే నన్ గతేడాది మరణించాక, మనకు తెలిసినంత వరకు అత్యంత వృద్ధ మహిళ బ్రన్యాస్ అని ప్రకటించింది. బ్రన్యాస్ మరణంతో ఆ స్థానం 116 ఏళ్ల జపనీయురాలు తొమికొ ఇకూటాకు దక్కుతుందని తాజాగా ఆ గ్రూప్ తెలిపింది. 1907 మార్చి 4వ తేదీన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రన్యాస్ జని్మంచారు. ఆమె కుటుంబం కొన్నాళ్లపాటు న్యూఆర్లియన్స్లోనూ ఉంది. ఆమె తండ్రి స్పెయిన్‌లో ఓ మ్యాగజీన్‌ను ప్రారంభించడంతో, కుటుంబంతోపాటు ఆమె కూడా ఇక్కడికే వచ్చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అట్లాంటిక్ సముద్రం మీదుగా స్పెయిన్‌కు జరిగిన అప్పటి ప్రయాణం తనకు గుర్తుందని చెప్పేవారు బ్రన్యాస్. ‘ఎక్స్’లోని సూపర్ కాటలాన్ గ్రాండ్మా అనే పేజీలో బ్రన్యాస్..‘నేను వృద్ధురాలిని. అత్యంత వృద్ధురాలిని. మూర్ఖురాలిని మాత్రం కాదు’అని పెట్టుకున్నారు. 113 ఏళ్ల వయస్సులో తక్కువ తీవ్రతతో సోకిన కోవిడ్ నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కాటలాన్ ప్రాంతంలోని ఒలోట్ పట్టణంలోని ఓ నర్సింగ్ హోంలో ఆమె కన్నుమూశారు. ‘ఎప్పుడో తెలియదు కానీ, ఈ సుదీర్ఘ ప్రయాణం త్వరలోనే ముగుస్తుంది. ఇంత దీర్ఘకాలం జీవించి శిథిలమైన స్థితిలో ఉన్న నన్ను మరణం ఆవహిస్తుంది. నవ్వుతూ మరణాన్ని ఆహ్వానిస్తాను. స్వేచ్ఛగా, సంతృప్తికరంగా జీవితం ముగించాలనుకుంటున్నాను’అని కొన్ని రోజుల క్రితం బ్రన్యాస్ తమతో అన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
Wimbledon 2022: 35వ ప్రయత్నంలో క్వార్టర్స్‌కు
లండన్: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి తాత్యానా మరియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల తాత్యానా మరియా 5–7, 7–5, 7–5తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మరియా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 4–5 స్కోరు వద్ద తన సర్వీస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన మరియా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటిదాకా 34 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పోటీపడిన మరియా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జూల్ నిమియర్ (జర్మనీ) 6–2, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొంది తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. నాదల్ పదోసారి... పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పదోసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–2, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచాడు. ఐదో సీడ్ అల్కరాజ్ ఓటమి మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 4–6, 7–6 (10/8), 3–6తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–4, 7–5, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలుపొందాడు. -
Russia-Ukraine war: పుతిన్ కుమార్తెలపై ఈయూ ఆంక్షలు
బ్రసెల్స్: పుతిన్ కుమార్తెలిద్దరిపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించింది. రష్యాను నిలవరించేందుకు పలు కంపెనీలపై, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ఈయూ తాజాగా మరి కొందరితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో పుతిన్ కుమార్తెలు మారియా, కేటరీనా ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరి ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు వీరి ప్రయాణాలపై నిషేధాన్ని విధించారని ఈయూ అధికారులు తెలిపారు. ఇప్పటికే పుతిన్ కూతుర్లపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఉక్రెయిన్‌లో రష్యా క్రూర చర్యలకు పాల్పడిందన్న వార్తలకు సాక్ష్యాలున్నాయంటూ ఈయూ తాజా ఆం క్షల జాబితాను విడుదల చేసింది. రష్యాలో రిజిస్టరైన నౌకల ను ఈయూ రేవుల్లోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కోల్ బ్యాన్ రష్యా బొగ్గు దిగుమతులను నిషేధించాలని కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో తొలిసారి రష్యా ఇంధన ఉత్పత్తులు ఆంక్షల జాబితాలోకి చేరినట్లయింది. ఆగస్టు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే చమురు, సహజవాయు దిగుమతులపై మాత్రం సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఏటా దాదాపు 440 కోట్ల డాలర్ల బొగ్గును రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకుంటోంది. యూఎస్ తదితర దేశాల నుంచి బొగ్గు దిగుమతులు పెంచుకోవడం ద్వారా రష్యా దిగుమతుల నిషేధ లోటును ఎదుర్కోవాలని ఈయూ నిర్ణయించింది. రష్యా బొగ్గుదిగుమతులపై నిషేధంతో ఈయూలోని కొన్ని దేశాల్లో కరెంటు చార్జీలు విపరీతంగా పెరగనున్నాయని రైస్టాడ్ ఎనర్జీ అంచనా వేసింది. చమురు, సహజవాయువుల విషయంలో మాత్రం ఈయూలోని చాలా దేశాలు అత్యధికంగా రష్యాపై ఆధారపడినందున నిషేధంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒకవేళ వీటిపై నిషేధం విధించినా రష్యాకు పెద్దగా సమస్య ఉండదని, తక్కువ ధరకు ఇండియా, చైనాకు రష్యా అమ్ముకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు భారీ రేట్లకు ఈయూ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాయని, దీనివల్ల ఆయా దేశాలపై పెను భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
బియాంక ఓటమి... మాజీ విజేతలెవరూ ఇక మిగల్లేదు!
న్యూయార్క్: ఈ ఏడాది యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. 2019 చాంపియన్ బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగడంతో మాజీ విజేతలెవరూ బరిలోకి మిగల్లేదు. 3 గంటల 29 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో 17వ సీడ్ మరియా సాకరి (గ్రీస్) 6–7 (2/7), 7–6 (8/6), 6–3తో ఆరో సీడ్ బియాంకాపై విజయం సాధించింది. రెండో సెట్ టైబ్రేక్‌లో సాకరి మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. మరోవైపు సంచలనాలతో దూసుకొచ్చిన క్వాలిఫయర్, 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను (బ్రిటన్) తన దూకుడు కొనసాగిస్తూ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రాడుకాను 6–2, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)ను 56 నిమిషాల్లో చిత్తు చేసింది. మూడో రౌండ్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీని ఓడించిన షెల్బీ ఈ మ్యాచ్‌లో బ్రిటన్ టీనేజర్ ధాటికి ఎదురునిలువలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) 7–6 (14/12), 6–3తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను, నాలుగో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో 14వ సీడ్ పావ్లుచెంకోవా (రష్యా)ను ఓడించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో టోక్యో ఒలింపిక్ చాంపియన్ బెన్‌చిచ్‌తో రాడుకాను; ప్లిస్కోవాతో సాకరి; స్వితోలినా (ఉక్రెయిన్)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా); సబలెంకా (బెలారస్) తో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. చదవండి: Us Open 2021: క్వార్టర్ ఫైనల్లోకి వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ -
పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి..
ఆమె ఓ క్రీడాకారిణి.. కష్టపడి ఒలింపిక్స్‌లో పతకం సాధించి సత్తా చాటింది. పతకంతో ఇంటికి వెళ్లిన ఆమె సంబరాల్లో మునిగింది. ఈ సమయంలో ఓ పసిపాపకు ఆరోగ్యం బాగాలేదు.. పసికందు చికిత్సకు భారీగా ఖర్చవుతోందని తెలుసుకుని ఆమె తల్లడిల్లింది. దీంతో ఎంతో శ్రమకోర్చి సాధించిన తన ఒలింపిక్ పతకాన్ని వేలానికి పెట్టింది. ఆమె మానవత్వాన్ని మెచ్చి వేలం దక్కించుకున్న సంస్థ ఆమె మెడల్‌ను తిరిగి ఇచ్చేసింది. దీంతోపాటు పాప చికిత్సకు అయ్యే ఖర్చుకు డబ్బును కూడా సమకూర్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ( చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు) పోలాండ్‌కు చెందిన మరియా అండ్రెజెక్ జావెలిన్ త్రోయర్ క్రీడాకారిణి. ఆమె తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. మన హీరో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించిన క్రీడ జావెలిన్ త్రో మహిళల విభాగంలో 64.61 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మరియా రెండో స్థానంలో నిలిచింది. రజత పతకం సొంతం చేసుకుంది. అయితే ఆమెకు ఇటీవల 8 నెలల వయసున్న మలీసా అనే పాప అరుదైన వ్యాధి (గుండె సంబంధిత)తో బాధపడుతోందని తెలుసుకుని ఆవేదనకు లోనైంది. ఆ పాప చికిత్సకు అవసరమైన ఖర్చును తాను పెట్టలేని స్థితిలో ఉండడంతో తన రజత పతకాన్ని వేలం పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె చర్యను అందరూ అభినందించారు. కొందరు వేలం వద్దు.. మేం కొంత ఇస్తాం అని కామెంట్ చేశారు. అయితే ఆమె ప్రకటనతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఏకంగా 1.25 లక్షల డాలర్ల వరకు విరాళాలు సమకూరాయి. ఇక పతకం వేలంలో పోలాండ్‌కు చెందిన సూపర్‌మార్కెట్ చెయిన్ సంస్థ జాబ్కా పోటీ పడింది. చివరకు వేలంలో ఆ సంస్థ మెడల్‌ను దక్కించుకుంది. అయితే ఆ సంస్థ మాత్రం మెడల్ తీసుకునేందుకు నిరాకరించింది. పాప చికిత్సకు అయ్యే డబ్బు ఇవ్వడంతో పాటు మరియా దక్కించుకున్న పతకాన్ని కూడా తిరిగి ఇచ్చేయాలని జాబ్క సంస్థ తెలిపింది. మానవత్వం చాటుకున్న మరియా ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌ను జయించింది. 2018లో బోన్ క్యాన్సర్‌తో బాధపడింది. క్యాన్సర్‌ను జయించడంతో ఇప్పుడు పోలాండ్ దేశానికి ఒలింపిక్స్‌లో కాంస్య పతకం తీసుకువచ్చింది. రియో ఒలింపిక్స్‌లో మరియాకు త్రుటిలో పతకం చేజారింది. 2 సెంటీ మీటర్ల దూరంలో మెడల్ ఆగిపోయింది. View this post on Instagram A post shared by Maria M. Andrejczyk (@m.andrejczyk) -
విధి ద్రోణాచార్యుడే! ఆమె ఏకలవ్య కాదు!!
మేరియా ముందు లేడిపిల్ల దిగదుడుపు. ఎం.బి.బి.ఎస్ జాయిన్ అయితే కాలేజీ అంతా తూనీగ ఎగిరినట్టే. ఫస్ట్ ఇయర్ అయ్యింది. హాస్టల్లో బట్టలు ఆరేస్తూ సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడింది. విధి వచ్చి నీ మొత్తం శరీరాన్ని చలన రహితం చేస్తాను అంది. ఆమె అంగీకరించిందా? తల వొంచితే ఈ కథే ఉంటుందా? మొన్నటి అంటే 2021 ఫిబ్రవరి 1న కేరళలోని తొడుపూజ మెడికల్ కాలేజీలో 25 ఏళ్ల మేరియా బిజు హౌస్ సర్జన్‌గా చేరింది. ఆమె ఆ కాలేజీ విద్యార్థినే. ఇప్పుడే అదే కాలేజీలో హౌస్ సర్జన్. అయితే ఈ రెంటికీ నడుమ ఒక పెద్ద పోరాటం ఉంది. సంఘర్షణ ఉంది. గెలుపూ ఉంది. ఎందుకంటే 2015లో అదే కాలేజీలో మెడిసిన్ స్టూడెంట్‌గా చేరిన మేరియా వేరు. మొన్న హౌస్ సర్జన్‌గా డ్యూటీ తీసుకున్న మేరియా వేరు. నాటి మేరియా మోటర్ సైకిల్ మీద తుర్రున దూసుకెళ్లే మేరియా. నేటి మేరియా వీల్‌చైర్‌లో స్థయిర్యంగా చిరునవ్వు నవ్వే మేరియా. ప్రమాదాన్ని ఎదుర్కొని... మేరియాకు డాక్టర్ కావాలని కోరిక. ఇంకా చెప్పాలంటే మంచి సర్జన్ కావాలని కోరిక. అందుకే మెడిసిన్‌లో చేరింది. కొట్టాయంకు దగ్గరగా ఉండే తొడుపూజ మెడికల్ కాలేజీలో ఎన్నో కలలతో అడుగుపెట్టింది. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యింది. రెండో సంవత్సరంలో ఉండగా 2016లో జూన్ 5న ఆమెకు ప్రమాదం జరిగింది. హాస్టల్లో బట్టలు ఆరేస్తుండగా కాలు జారి రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయింది. ‘నా మెడ, తొడ ఎముక విరిగి పోయాయి’ అని చెబుతుంది మేరియా. వెంటనే ఆమెను దగ్గరిలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. స్థానికంగా ఒక సర్జరీ అయ్యాక వెల్లూరు సి.ఎం.సిలో ఆమె నెలల తరబడి ఉండాల్సి వచ్చింది. ‘నా మెడ కింది భాగమంతా చచ్చుబడింది’ అని చెబుతుంది మేరియా. ఆ సమయంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద మద్దతుగా నిలిచారు. కాలేజీ యాజమాన్యం కూడా ధైర్యం చెప్పింది. ‘మెడికల్ సీటు అలాగే ఉంటుందని... ఎప్పుడు కోలుకుంటే అప్పుడు తిరిగి వచ్చి చదువుకోవచ్చని’. స్నేహితులే తోడుగా ప్రమాదం జరిగిన కొన్ని నెలల తర్వాత మేరియా కాలేజీకి వీల్‌చైర్ మీద తిరిగి వచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్న స్నేహితులకు ధైర్యం చెప్పింది. తాను ధైర్యం తెచ్చుకుంది. ‘అయితే నేను ఎగ్జామ్స్ రాయడమే పెద్ద సమస్య అయ్యింది. నా వేళ్ల మీద కూడా నాకు పట్టు లేదు’ అని చెప్పిందామె. ‘ఎగ్జామ్స్ రాయడానికి లేఖకుణ్ణి పెట్టుకోవచ్చని కాలేజీ వారు చెప్పారు. అయితే మెడికల్ విషయాలుండే పేపర్లు రాయాలంటే సాధారణ వ్యక్తులు సరిపోరు. మరో మెడికోనే తీసుకోవాలి. అందుకు నిబంధనలు ఒప్పుకోవు. కనుక నా వేళ్లను కదిలించి నేనే ఎగ్జామ్ రాయాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది మేరియా. అయితే అది అంత సులువు కాలేదు. ఎంతో శ్రమ పడి, ఫిజియో థెరపీ తీసుకుని ఆమె తను కుడిచేతి వేళ్లను కదిలించగలింది. ‘పెన్ను పట్టుకోగలిగితే చాలు అనుకున్నాను’ అంటుంది మేరియా. 64 శాతం మార్కులతో పాసయ్యి... మేరియా చక్రాల కుర్చీలో కూచునే క్లాసులకు అటెండ్ అయ్యి 64 శాతం మార్కులతో పాస్ అయ్యింది. ఇది ఘన విజయం కింద లెక్క. ఇప్పుడు చదివిన కాలేజీలోనే హౌస్ సర్జన్ చేస్తోంది. ‘నాకు గొప్ప సర్జన్ కావాలని కోరిక ఉండేది. అయితే సర్జరీలు చేయాలంటే వేళ్ల కదలికల మీద మంచి పట్టు ఉండాలి. అది నాకు లేదు. అంతే! ఎం.డి చేద్దామనుకుంటున్నాను’ అంటుంది మేరియా. ఆమె మంచి బొమ్మలు వేస్తుంది. వాటిని కొనేవారు కూడా ఉన్నారు. ‘నాకు ఒక్కదాన్నే కొత్త ప్రదేశాలు తిరగాలని ఉంది. అయితే వీల్‌చైర్ ఫ్రెండ్లీగా మన ప్రదేశాలు ఉండవు’ అంటుందామె. కేరళ ఆర్టిసి వారిని బస్టాండ్లలో వీల్‌చైర్ ర్యాంప్‌ల ఏర్పాటు కోసం కోరింది మేరియా. ఆ సంస్థ అందుకు స్పందించింది. జీవాన్ని, ఆశను కాపాడుకోవడమే మనిషి పని అని మేరియా సందేశం. – సాక్షి ఫ్యామిలీ -
భార్యను చంపి.. శవాన్ని బెడ్ బాక్స్‌లో..
న్యూఢిల్లీ : భార్యను అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో దాచిన కసాయి భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వేరొక యువతిని పెళ్లి చేసుకున్న సురేష్.. మొదటి భార్య మరియా(30)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 18 రోజుల విచారణ అనంతరం మరియా మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో గుర్తించినట్లు చెప్పారు. మరియా ఆచూకీ కనిపించడం లేదని సురేష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో సురేష్ మరో మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిసిందని, దీనిపై అతన్ని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడని వివరించారు. -
ఈ వారం యుట్యూబ్ హిట్
మారియా కేరీ: ఫీచరింగ్ వైజి నిడివి : 4 ని. 16 సె., హిట్స్ : 30,87,100 మారియా ప్రామిస్ నిలబెట్టుకున్నారు. చెప్పినట్టే తన కొత్త సింగిల్ ట్రాక్ ‘ఐ డోన్ట్’ను వైజితో కలిసి రిలీజ్ చేశారు. వైజి 26 ఏళ్ల అమెరికన్ హిప్ హాప్ రికార్డింగ్ ఆర్టిస్ట్. ఇక మారియా! ‘విజన్ ఆఫ్ లవ్’తో ఫేమ్‌లోకి వచ్చిన అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, నటి. ఆ కుర్రాడు, ఈ 47 ఏళ్ల ప్రౌఢ కలిసి తాజాగా ‘ఐ డోన్ట్’ను వీనులలోకి, వినువీధులలోకి వదిలారు. ‘ఐ డోన్ట్’ అనేది బ్రేకప్ సాంగ్. ఒకప్పటి తన బాయ్‌ఫ్రెండ్ జేమ్స్ ప్యాకర్‌కు ఒక ప్రేమానంతర సందేశంలా ఈ గీతాన్ని ఆలపించారు మారియా. పాట వైజీతో స్టార్ అవుతుంది. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ నన్ను నమ్మవు. నన్ను అర్థం చేసుకోవు’ అంటాడు వైజీ. తర్వాత చరణాలన్నీ మారియా కేరీవి. మొదటి చరణం ఒక్కటి చాలు ప్రేమలో అబ్బాయిల కారణంగా అమ్మాయిలు ఎంత ఆవేదనకు గురవుతారో! మారియా అంటుంది.. ‘వేరే జన్మల్లో ఎక్కడి నుంచో మన కోసం కొన్ని క్షణాలను దొంగిలించుకు వచ్చాం. నీకు కావలసినదంతా ఇచ్చాను. మళ్లీ మళ్లీ ఇవ్వడానికి వచ్చాను. నువ్వెప్పటికీ నా వాడివే అని చెప్పావు! కానీ వట్టి అబద్ధాలను తప్ప నువ్వు నాకేమీ ఇవ్వలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. కన్నీళ్లేం మిగల్లేదు’ అని మారియా పాడుతుంటే మన హృదయమూ మూగబోతుంది. చివరి చరణంలో మారియా ఒక సందేశం కూడా ఇస్తుంది. ‘నువ్వొకర్ని ప్రేమించినంత మాత్రాన వారిని తక్కువగా చూడకు’ అంటుంది. కరెక్ట్‌గా రైట్ టైమ్‌లో రిలీజ్ అయిన వీడియో సాంగ్ ఇది. వాలెంటైన్స్ డే వస్తోంది కదా! -
చికిత్స పొందుతూ యువతి మృతి
కరీంనగర్: కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ సంఘటన సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాండ్ర మరియ(30) గతనెల 13వ తేదీన ఇంట్లో వంటచేస్తుండగా శరీరంపై ఉన్న దుస్తులు కాలడంతో మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటనలో 40 శాతం శరీరం కాలిపోయింది. తండ్రి జీవరత్నం, కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి చెప్పారు. తండ్రి జీవరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
మంచి కాఫీ లాంటి చిత్రం
కాఫీ బట్టలమీద ఒలికితే కంగారుపడిపోతాం.. మచ్చ పడిపోయిందే అని బాధపడిపోతాం. బ్రిటన్‌కు చెందిన మారియా మాత్రం అలా బాధపడిపోదు.. కాఫీ మచ్చలు పడిన బట్టలనే కాన్వాసుగా మార్చేస్తుంది. ఇలా అద్భుతమైన చిత్రరాజాలుగా తీర్చిదిద్దుతుంది. ఇది ముందునుంచీ కావాలని నేర్చుకున్న కళ కాదు. ఓ రోజు ఏదో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా కాఫీ పడిపోయిందట. అయితే, ఆ సమయంలో దాన్ని వెంటనే తుడిచేయకుండా అలాఅలా ఓ బొమ్మలా తీర్చిదిద్దిందట. అప్పట్నుంచీ మొదలయ్యాయి ఈ మంచి కాఫీ లాంటి చిత్రాలు. బాగున్నాయి కదూ.. -
చెస్ విశ్వవిజేత మరియా
సోచి (రష్యా) : ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) విజేతగా నిలిచింది. నటాలియా పోగోనినా (రష్యా)తో జరిగిన ఫైనల్లో మరియా 2.5-1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు గేమ్‌ల ఈ ఫైనల్లో మరియా ఒక గేమ్‌లో నెగ్గి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన పోగోనినాకు రజతం దక్కగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ద్రోణవల్లి హారిక (భారత్), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లకు కాంస్య పతకాలు లభించాయి. -
అతడి ప్రేమ..ఆమెకు ప్రాణం పోసింది!
పెళ్లయిన నెలరోజులు కూడా కాకముందే గిల్లి కజ్జాలతో విడిపోవాలని చూసేవారికి, చిన్నచిన్న కారణాలకే వైవాహిక బంధాన్ని తెంచేసుకోవాలనుకునేవారికి ఆ ఇద్దరి ప్రేమ ఓ గుణపాఠం. బ్రిటన్ కు చెందిన మారియా(48)కి ఇటీవలే గుండెనొప్పి వచ్చింది.ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. బహుశా ఇక బ్రతకకపోవచ్చనే సందేహాన్ని కూడా వైద్యులు వ్యక్త పరిచారు. ఆ మాట ఆమె భర్త నీల్ ను కలవరపెట్టింది. అతడు విపరీతంగా ఏడ్చాడు. తిండీ నిద్ర మానేసి వారం రోజులపాటు ఆమె మంచం ప్రక్కనే గడిపాడు. రాను రాను మారియా ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు కూడా తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు. ఏ క్షణాన్నయినా ప్రాణాలు పోవచ్చని నిర్ధారించేశారు. నీల్ తట్టుకోలేకపోయాడు.తన కోసం లేవమంటూ భార్యను బతిమాలాడు.ఆమె నుంచి స్పందన లేకపోయినా భార్యతో మాట్లాడసాగాడు.ఏడుస్తూ తన ప్రేమనంతా తెలియజేశాడు.కానీ ఫలితం లేకపోయింది.దాంతో చివరి ప్రయత్నంగా.. సెల్ ఫోన్లో తన పెళ్లి పాటను ప్లే చేశాడు. అంతే.. ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది.మారియా కుడి చేతిని కదిలించింది. తరువాత ఎడమ చేతిని..ఆపైన కాళ్లను..చివరకు మెల్లగా కళ్లు తెరిచింది.నీల్ ఆనందంతో ఎగిరి గంతులేశాడు.పిల్లలు తన తల్లిని వాటేశుకుని బావురుమన్నారు.వైద్యులు ఆశ్చర్యపోయారు. నీల్ ప్రేమే ఆమెకు ప్రాణం పోసిందని అన్నారు.నిజమే. ప్రేమకు ప్రాణం పోసే శక్తి ఉంది.అదే మారియాను మళ్లీ రంగంలోకి తీసుకొచ్చింది!