చికిత్స పొందుతూ యువతి మృతి | un married girl dies after burnt injuries in karimnagar district | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువతి మృతి

Published Sat, Aug 15 2015 8:30 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

un married girl dies after burnt injuries in karimnagar district

కరీంనగర్:  కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ సంఘటన సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాండ్ర మరియ(30)  గతనెల 13వ తేదీన ఇంట్లో వంటచేస్తుండగా శరీరంపై ఉన్న దుస్తులు కాలడంతో మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటనలో 40 శాతం శరీరం కాలిపోయింది. తండ్రి జీవరత్నం, కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

అయితే  చికిత్స పొందుతూ శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి చెప్పారు. తండ్రి జీవరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement