సోచి (రష్యా) : ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) మరియా ముజిచుక్ (ఉక్రెయిన్) విజేతగా నిలిచింది. నటాలియా పోగోనినా (రష్యా)తో జరిగిన ఫైనల్లో మరియా 2.5-1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు గేమ్‌ల ఈ ఫైనల్లో మరియా ఒక గేమ్‌లో నెగ్గి, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన పోగోనినాకు రజతం దక్కగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ద్రోణవల్లి హారిక (భారత్), పియా క్రామ్లింగ్ (స్వీడన్)లకు కాంస్య పతకాలు లభించాయి.