అతడి ప్రేమ..ఆమెకు ప్రాణం పోసింది! | Maria Neal awakes from coma with husband's love | Sakshi
Sakshi News home page

అతడి ప్రేమ..ఆమెకు ప్రాణం పోసింది!

Published Mon, May 19 2014 10:52 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

అతడి ప్రేమ..ఆమెకు ప్రాణం పోసింది! - Sakshi

అతడి ప్రేమ..ఆమెకు ప్రాణం పోసింది!

పెళ్లయిన నెలరోజులు కూడా కాకముందే గిల్లి కజ్జాలతో విడిపోవాలని చూసేవారికి, చిన్నచిన్న కారణాలకే వైవాహిక బంధాన్ని తెంచేసుకోవాలనుకునేవారికి ఆ ఇద్దరి ప్రేమ ఓ గుణపాఠం.

బ్రిటన్ కు చెందిన మారియా(48)కి ఇటీవలే గుండెనొప్పి వచ్చింది.ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికి ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. బహుశా ఇక బ్రతకకపోవచ్చనే సందేహాన్ని కూడా వైద్యులు వ్యక్త పరిచారు. ఆ మాట ఆమె భర్త నీల్ ను కలవరపెట్టింది. అతడు విపరీతంగా ఏడ్చాడు. తిండీ నిద్ర మానేసి వారం రోజులపాటు ఆమె మంచం ప్రక్కనే గడిపాడు. రాను రాను మారియా ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు కూడా తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు. ఏ క్షణాన్నయినా ప్రాణాలు పోవచ్చని నిర్ధారించేశారు.

నీల్ తట్టుకోలేకపోయాడు.తన కోసం లేవమంటూ భార్యను బతిమాలాడు.ఆమె నుంచి స్పందన లేకపోయినా భార్యతో మాట్లాడసాగాడు.ఏడుస్తూ తన ప్రేమనంతా తెలియజేశాడు.కానీ ఫలితం లేకపోయింది.దాంతో చివరి ప్రయత్నంగా.. సెల్ ఫోన్లో తన పెళ్లి పాటను ప్లే చేశాడు. అంతే.. ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది.మారియా కుడి చేతిని కదిలించింది. తరువాత ఎడమ చేతిని..ఆపైన కాళ్లను..చివరకు మెల్లగా కళ్లు తెరిచింది.నీల్ ఆనందంతో ఎగిరి గంతులేశాడు.పిల్లలు తన తల్లిని వాటేశుకుని బావురుమన్నారు.వైద్యులు ఆశ్చర్యపోయారు.  నీల్ ప్రేమే ఆమెకు ప్రాణం పోసిందని అన్నారు.నిజమే. ప్రేమకు ప్రాణం పోసే శక్తి ఉంది.అదే మారియాను మళ్లీ రంగంలోకి తీసుకొచ్చింది!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement