‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment