
తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కొంత సమయం క్రితం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయం దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. దీంతో దిల్ రాజుకు పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment