Narayan Das K Narang Death: Chiranjeevi And Mahesh Babu Express Deep Condolences - Sakshi
Sakshi News home page

Narayan Das K Narang Death: చిరంజీవి, మహేశ్‌ బాబు ఎమోషనల్‌ ట్వీట్స్‌

Published Tue, Apr 19 2022 12:35 PM | Last Updated on Tue, Apr 19 2022 2:00 PM

Chiranjeevi And Mahesh Babu Express Deep Condolences On Narayan Das K Narang Demise - Sakshi

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్(76) మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు,సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

అలాగే సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కూడా నారాయణ్‌ దాస్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘నారాయణ్‌ దాస్‌ ఇకలేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులను సానుభూతి తెలియజేస్తున్నాను. నారయణ్‌ దాస్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుధీర్‌బాబు, సుషాంత్‌, శివకార్తికేయతో పాటు పలువురు సినీ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement