Gul Panag
-
The Ghost: ఎమోషన్.. యాక్షన్
పవర్ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, నాగార్జున–సోనాల్ల కొత్త పోస్టర్ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఇప్పటివరకు విడుదల చేసిన రెండు ప్రోమోలు ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని అబ్బురపరిచాయి. దాంతో ట్రైలర్‌పై అంచనాలు పెరి గాయి. ట్రైలర్లో మరింత ఎగ్జయిటింగ్ యాక్షన్‌ని చూపించనున్నాం. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. ∙నాగార్జున, సోనాల్ చౌహాన్ -
కనడం మన చాయిస్
హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘పిల్లల విషయంలో నా గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. యాక్టింగ్ కెరీర్ కోసం నేను పిల్లల్ని కనడం లేదని, నా అందం పాడైపోతుందని పిల్లల్ని వద్దనుకుంటున్నానని ఇలా నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిల్లల్ని కనడం కోసమే నేను ఈ భూమ్మీదికి రాలేదు. అంతకుమించిన లక్ష్యాలుంటాయి. వాటి కోసం వచ్చాను. నాకే కాదు, ఏ స్త్రీ జీవిత పరమార్థం కూడా పిల్లల్ని కనడమే కాదు. కాబట్టి పిల్లల్లేని ఆడవాళ్లను పనికిరాని వస్తువులుగా చూడకండి’’ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. ఇప్పుడు బాలీవుడ్ నటి, కమర్షియల్ పైలట్ గుల్ పనాగ్.. పిల్లల విషయంలో స్త్రీలకు మరో విధంగా సలహా ఇచ్చింది. ‘‘పిల్లల్ని పెంచడానికి మానసికంగా సంసిద్ధమైనప్పుడే కనండి. అంతే తప్ప సమాజం కోసమో, బయోలాజికల్ సైకిల్ గురించి ఆలోచించో.. భయపడో కనొద్దు’’ అని. ముప్పైతొమ్మిదేళ్ల గుల్‌పనాగ్ ఆర్నెల్ల కిందట మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఆమె భర్త రిషి అత్తారి జెట్ ఎయిర్వేస్ కెప్టెన్. ‘వియ్ ఆర్ ప్రెగ్నెంట్’ ‘‘పిల్లల కోసం మేము తొందరపడలేదు. ఆర్థికంగానే కాదు.. మానసికంగా కూడా ఓకే అనుకున్నప్పుడు.. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచగలం అని అనుకున్నప్పుడే నేను పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాను. అప్పటికి నాకు 39 ఏళ్లు. అయినా అన్నాళ్లు నేను నా దేహధర్మాల గురించి దిగులుపడలేదు. పిల్లలను కనడం, పెంచడం విషయంలో భార్యాభర్తలు ఇద్దరికీ అవగాహన ఉండాలి. బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. భార్య మాత్రమే ప్రెగ్నెంట్ అని అనుకోవద్దు.. వియ్ఆర్ ప్రెగ్నెంట్ అని భర్త అనుకోవాలి. నిహాల్ (కొడుకు) ప్రిమెచ్చూర్ బేబీ. అయినా వాడిని పెంచే విషయంలో నేనేం భయపడలేదు. డాక్టర్ల సలహాతో నేను, రిషి ఇద్దరం పూర్తి సమయాన్ని వాడికే కేటాయించాం. ఉద్యోగాలు చేసే భార్య, భర్త కూడా పిల్లల పెంపకం విషయంలో సమానబాధ్యతలు తీసుకోవాలి. తల్లి అయిన భార్య మానసిక స్థితిని భర్త అర్థం చేసుకోవాలి. అటెన్షన్ ఇవ్వాలి. సో... పిల్లలు లేరని సమాజం ఏదో అంటుందని తొందరపడి పిల్లలను కనొద్దు. వాళ్ల ఆలనాపాలనాలో ఉన్న ఆనందాన్ని మిస్ చేసుకోవద్దు’’ అని తన అభిప్రాయాన్ని చెప్పారు గుల్‌పనాగ్. -
తల్లయిన నటి.. ఆరు నెలల తర్వాత వెల్లడి!
మాజీ మిస్ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్‌గా.. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన గుల్ పనాగ్ ప్రస్తుతం తల్లిగా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదేంటి ఆమె ఎప్పుడు తల్లయ్యారు అనుకుంటున్నారా.. ఆరు నెలల క్రితమేనటండీ. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాననే శుభవార్తను ఆమే స్వయంగా తెలియజేశారు. అయితే ఇన్నాళ్లుగా ఆ విషయం ఎలా దాయగలిగారని ప్రశ్నించగా.. ‘రిషి(గుల్ పనాగ్ భర్త), నేను ప్రతీ విషయంలో ప్రైవసీని కోరుకుంటాం. తల్లిదండ్రులుగా మారటం అనేది ఒక గొప్ప అనుభూతి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రతీ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పాల్సిన పనిలేదు. మా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మాత్రమే నిహాల్ గురించి తెలుసంటూ’ సమాధానమిచ్చారు. కుమారుడి పేరు గురించి ప్రస్తావిస్తూ.. ‘నిహాల్ అంటే ఆనందం, విజయం అని అర్థం. వాడి రాకతో ఆ రెండు మా జీవితాల్లోకి వచ్చేశాయి. అందుకే మా గారాల పట్టికి ఆ పేరు పెట్టామని’ చెప్పుకొచ్చారు. నిహాల్ రాకతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చానని, ప్రస్తుతం వాడి అల్లరితోనే సమయం గడుస్తోందని.. త్వరలోనే కెరీర్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. వయసు మీద పడుతోంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి, త్వరగా పిల్లల్ని కనేయాలనే నిబంధనలు పెట్టుకునే బాపతు తాను కాదని చెప్పుకొచ్చారీ ఈ 39 ఏళ్ల బ్యూటీ. -
షీఈజ్... స్పెషల్
ఆమె దృష్టిలో అపజయానికి, లక్ష్యానికి, ఆలోచనా దృక్పథానికి అర్థాలు వేరు..అందుకే అందరిలా ఆమె ఆలోచించదు. అలాంటి దృక్పథమే ఆమెను విభిన్న రంగాల్లో రాణించేలా చేసింది. ఎంచుకున్న రంగంలో తనకున్న లక్ష్యాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంది..తాను నమ్మే సిద్ధాంతంతో సక్సెస్ మంత్ర సాధిస్తున్నది. క్రీడలు, మోడలింగ్, సినీ, రాజకీయ రంగం, వ్యాపారం ఇలా వివిధ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న గుల్ పనాగ్ సోమవారం ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ‘డీకోడింగ్ ది సక్సెస్ మంత్ర’ పేరిట నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. తన మనసులోని మాటలను ఇలా పంచుకున్నారు... ఆమె అందరిలా ఆలోచించదు. జయమా.. అపజయమా? అస్సలుపట్టించుకోదు. లక్ష్యమే శ్వాసగా ముందుకెళ్తుంది. ఫలితమేదైనాస్వీకరిస్తుంది. అదే ఆమె సక్సెస్ సీక్రెట్.. ఆమే గుల్ పనాగ్. ఈమె మాజీ మిస్ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్. ఇలా విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన పనాగ్... ఫిక్కీ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో సోమవారం నిర్వహించిన ‘డీకోడింగ్ ది సక్సెస్ మంత్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగాముచ్చటించారు. ఆ విశేషాలుఆమె మాటల్లోనే... బంజారాహిల్స్: మా స్వస్థలం చండీగఢ్. నాన్న లెఫ్టినెంట్ జనరల్ కావడంతో వివిధ ప్రాంతాల్లో నా చదువు కొనసాగింది. పంజాబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ మ్యాథమేటిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి. స్విమ్మింగ్, బంగీ జంప్, స్క్వాష్‌లో ప్రమేయం ఉంది. గ్రూప్ డిస్కషన్లో జాతీయ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. అంతే కాకుండా ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా పొందాను. దీన్ని చాలామంది ఏదో పెద్దగా చూస్తున్నారు. నిజానికి ఇది చాలా చిన్న విషయం. అమెరికాలో పదో తరగతి పూర్తి చేసినవారు సైతం ఇలాంటి లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి మహిళకు అవకాశాలు ఉంటాయి. వాటిని మనమే ఎంచుకోవాలి. దేనికీ ప్రత్యేకంగా పరిమితులనేవి ఏమీ ఉండవని అందరూ గుర్తించుకోవాలి. మోడలింగ్ టు సినిమా... ఓ రోజు టీవీలో నఫీసా జోసెఫ్ షో చూశాను. అప్పు డే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. 1999లో మిస్ ఇండియా టైటిల్ సాధించాను. అందులో ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ సొంతం చేసుకున్నాను. అయితే ఈ రంగంలో జయాపజయాలను సమానంగా స్వీకరించాను. అదే నన్ను విభిన్న వేదికల్లో పాల్గొనేలా చేసింది. మోడలింగ్‌లోకి ప్రవేశంతో సినిమా అవకాశా లు తలుపు తట్టాయి. 2003లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు 15 సినిమాల్లో నటించాను. నేను నటించే సినిమాలు ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. రాజకీయ పరంగాఎంతో నేర్చుకున్నా... మోడలింగ్, సినీ రంగంలో కొనసాగుతున్న నా జీవితం అనుకోకుండా రాజకీయంగా మలుపు తిరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చండీగఢ్‌లో పోటీ చేశాను. అయితే విజయం పక్కనపెడితే రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాను. నామినేషన్ మొదలు పోల్ మేనేజ్మెంట్, బూత్ కమిటీ, ఓట్ మేనేజ్మెంట్... ఇలా అన్నీ తెలుసుకునే అవకాశం దక్కింది. ఎన్నికల సమయంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారం చేసేదాన్ని. దాదాపు మూడుసార్లు ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగాను. నేను ఫిట్‌గా ఉండడంతోనే ఇది సాధ్యమైంది. మరో విషయం ఏమిటంటే.. ప్రచారం సందర్భంగా గేర్లున్న బైక్‌నే వాడాను. అప్పటి వరకు చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలకు గేర్ల బైక్ నడపడంలో ఇబ్బందులు ఉంటాయని వారించేవారు. అయితే నా ప్రచార శైలి చూసి తల్లిదండ్రుల్లో మార్పొచ్చింది. అదేముసుగొద్దు.. రాజకీయంగా గానీ మరేదైనా రంగంలో గానీ.. ఓటమి పాలైతే అదే ముసుగులో ఉండడం మంచిది కాదు. నేను ఎన్నికల్లో ఓడిన తర్వాత అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పరుగు పెట్టాను తప్ప.. అపజయం వెనక పరుగు పెట్టలేదు. మనకు లభించే అవకాశాల్లో లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా వాటిని మలచుకోవాలి. అందుకే జయాపజయాలు ఏవైనా స్వీకరించి, మన జీవితంలో భాగంగా వాటిని గుర్తించాలి. మన జీవితం మనం ఆలోచించే తీరులో ఉంటుందని గుర్తించాలి. అందుకే.. నా జీవితం నాకు ఇష్టమైన, అందమైన రూపంలో నడుస్తోంది. -
మొన్న నటి, నిన్న లీడర్, నేడు..!
ఆమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగువెలిగింది. పలు హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి అక్కడా తనదైన ముద్రవేసింది. ఇప్పుడు గగనతలంలో రెక్కలు చాచి విహరిస్తోంది. ఆమెనే గుల్ పనాగ్. నటిగా పరిచయమై.. రాజకీయాల్లోకి అడుగిడి.. ఇప్పుడు ఏకంగా పైలట్‌గా రూపాంతరం చెందింది గుల్. ఆమెకు ఇటీవలే పైలట్‌గా లైసెన్స్ లభించింది. దీంతో పైలట్‌గా యూనిఫామ్ ధరించి.. తన కెప్టెన్‌తో ఫొటోలు దిగి.. ఆ ఆనందాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంది. ఎక్కడా ఆగకుండా ముందుకు దూసుకుపోతున్న ఆమెకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
హమ్మయ్య.. ఆమె భర్త వచ్చేశాడు
ముంబయి: బాలీవుడ్ నటి గుల్ పనాగ్ భర్త, పైలెట్ జీఎస్ అట్టారీ సురక్షితంగా తిరిగొచ్చాడు. బ్రస్సెల్స్‌లో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆయన క్షేమంగా ఇంటికి చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జీఎస్ అటారీ జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమాన పైలెట్‌గా పనిచేస్తున్నారు. బ్రస్సెల్స్ లోని మెట్రో స్టేషన్ వద్ద బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ఇండియాకు చెందిన రెండు విమానాలను అదే ఎయిర్ పోర్ట్‌లో దింపారు. ఆ తర్వాత బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో ఆయన అక్కడే స్ట్రక్ అయిపోయారు. దీంతో గుల్ పనాగ్ ఆమె స్నేహితులు తెగ ఆందోళన పడిపోయారు. దీంతో ఆయన సురక్షితంగా తిరిగొచ్చారంటూ ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని అన్నారు. -
బ్రస్సెల్స్ లో మా ఆయన క్షేమం: హీరోయిన్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ విమానం కెప్టెన్ అయిన తన భర్త బ్రస్సెల్స్ లో క్షేమంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ విమానం బెల్జియం రాజధాని బ్రసెల్స్ విమానాశ్రయంలో ల్యాండైన కొద్దిసేపటికే ఆత్మాహుతి దాడులు కుదిపేశాయి. విమానాశ్రయంలో హాహాకారాలు, ఆర్తనాదాలతో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బ్రసెల్స్ లో దిగిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని గుల్ పనాగ్ ట్విట్టర్ లో తెలిపింది. తన భర్త, జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ జీఎస్ అట్టారీ విమానంలో ఉన్నారని ఆమె వెల్లడించింది. 'బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్నది. భద్రతా సిబ్బంది ఇప్పటికీ బాంబులను కనుగొంటున్నారు. మా ఆయన, విమాన సిబ్బంది, ప్రయాణికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. అక్కడి వివరాలను ఎప్పటికప్పుడు మా ఆయన ద్వారా తెలుసుకొని ట్విట్టర్ లో షేర్ చేస్తున్నాను. దీనివల్ల విమానం సిబ్బంది, ప్రయాణికుల కుటుంబసభ్యులకు తమ వారి భద్రత గురించి తెలుసుకుంటారు' అని ఆమె మీడియాతో పేర్కొంది. 'ప్రయాణికులు, సిబ్బంది అంతా విమానంలోనే ఉన్నారు. వారి విమానం సురక్షిత ప్రదేశంలో ఉంది. ప్రతి గంటకు మా ఆయన తాజా సమాచారం అందిస్తున్నారు' అని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి బ్రస్సెల్స్ వెళ్లిన జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని, ప్రయాణికులను విమానం నుంచి ప్రస్తుతం దింపి.. పంపించివేశారని మరో ట్వీట్ లో వెల్లడించారు. -
"రాజకీయాల్లో కొనసాగుతాను.. అసంతృప్తి లేదు'
ముంబై: రాజకీయాల్లో కొనసాగుతానని, కేవలం లోకసభ ఎన్నికలకే పరిమితం కానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, బాలీవుడ్ తార గుల్ పనాగ్ అన్నారు. ఓటమి వల్ల నిరుత్సాహానికి గురికావడం లేదని.. అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేస్తామని ఆమె అన్నారు. చంఢీగఢ్ స్తానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటి చేసిన గుల్ పనాగ్.. బీజేపీ అభ్యర్ధి, బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రజల తీర్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని, తనకు మద్దతు తెలిపిన చంఢీఘడ్ ప్రజలకు కృతజ్క్షతలు అని పనాగ్ మీడియాతో అన్నారు. తొలిసారి పోటి చేసిన తనకు భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయన్నారు. -
గుల్ పనాగ్పై దాడి
వారణాసి: నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో బీజేపీ ఆగడాలు మితిమీరుతున్నాయి. వారణాసిలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు ప్రత్యర్ధులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకురాలు, బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తో పాటు వీజే రఘురామ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ(బీహెచ్‌యూ ఐఐటీ)లో బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని గుల్ పనాగ్, రఘురామ్ ఆరోపించారు. బీహెచ్‌యూ ప్రధాన ద్వారం వద్ద నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంద్రా తివారిని బీజేపీ కార్యక్తలు అడ్డుకున్నారు. చండీఘడ్ లోకసభ నియోజకవర్గం నుంచి ఆమ్ అభ్యర్థిగా గుల్ పనాగ్ పోటీ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున వారణాసిలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. -
బాలీవుడ్ భామల చేతిలో పవన్ భన్సల్ భవితవ్యం!
లోకసభ ఎన్నికల్లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్బూసియర్ రూపొందించిన చంఢీఘడ్ నగరంలో ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. చంఢీఘడ్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు గెలుపొందిన పవన్ కుమార్ భన్సల్, బాలీవుడ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నటి గుల్ పనాగ్, బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ లు పోటి చేయడమే అందుకు కారణం. ఇదే నియోజకవర్గంలో బీఎస్పీ తరపున జన్నత్ జహన్ అనే మహిళ కూడా పోటిలో ఉన్నారు. రైల్వేశాఖలో ఉద్యోగ కుంభకోణంలో మేనల్లుడు అరెస్ట్ కావడంతో పవన్ కుమార్ భన్సల్ పై కూడా ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం నుండి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే చంఢీఘడ్ నియోజకవర్గంలో మంచి పలుకుబడి, గట్టి పట్టున్న భన్సల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న గుల్ పనాగ్ ఓటర్లను ఆకర్షించేందుకు బుల్లెట్ పై ప్రచారం చేయడం, ఉదయమే పార్కుల్లో తిరగడం, వీధుల్లో తిరుగుతూ సమస్యలను సావధానంగా వినడం లాంటి అంశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కేజ్రీవాల్ రోడ్ షోకు మంచి స్పందన రావడంతో గెలుపుపై గుల్ పనాగ్ లో విశ్వాసం పెరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి, అనుపమ్ ఖేర్ సతీమణి, కిరణ్ ఖేర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కుంభకోణాలు బీజేపీకి విజయాన్ని అందిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అవినీతితో దేశాన్ని భ్రష్టుపట్టించిందని.. ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడాలంటే మోడీ సేవలు ఎంతో అవసరం ఉందని.. అందుకే ఈసారి కమలానికి ఓటు వేయాల్సిందేనని ఓటర్లకు విజ్క్షప్తి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో 50 శాతానికి పైగా 45 ఏళ్ల వయస్సు లోపువారే ఉండటంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు యువ ఓటర్లపై కన్నేశారు. చంఢీఘడ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 23 వేల పైగానే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా, యువ ఓటర్లతోపాటు, తొలిసారి ఓటు వినియోగించుకునే వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, ముగ్గురు మహిళా అభ్యర్థులతో సీనియర్ నేత భన్సల్ పోటి పడుతున్నారు. 45 శాతానికి పైగా చంఢీఘడ్ నియోజకవర్గంలో మహిళలుండటం గుల్ పనాగ్, కిరణ్ ఖేర్, జన్నత్ జహన్ లు తమ విజయంపై ఆశలు పెంచుకున్నారు. మహిళా అభ్యర్థులను ఓడించి భన్సాల్ ఐదోసారి విజయం సాధిస్తారా అనేది ఏప్రిల్ 10 తేదిన జరిగే ఎన్నికల్లో స్పష్టమవుతుంది. -
'ఆప్' గుర్రాలపై బుకీల బెట్టింగ్ జోరు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని బుకీలు హాట్ ఫేవరేట్ గా భావిస్తున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల 'జాదూ'ను ఆప్ రిపీట్ చేయవచ్చనే అంచనాతో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని పార్లమెంట్ స్థానాలపై అధిక ఆసక్తిని బుకీలు చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఇంకా బెట్టింగ్ ప్రారంభం కానప్పటికి.. బుకీలు ఎక్కువగా ఆమ్ ఆద్మీపార్టీపైనే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 7 నుంచి మే 12 తేది వరకు జరిగే సాధారణ ఎన్నికల్లో దేశమంతటా ఎక్కువ సంఖ్యలోనే ఆమ్ ఆద్మీ పార్టీ స్థానాలు గెలిచే అవకాశముందని బుకీలు అంచనా వేస్తున్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ, కేజ్రివాల్ ల మధ్య భీకర పోరు సాగే అవకాశం ఉండటంతో బుకీలు పుణ్యక్షేత్రంపై దృష్టిని కేంద్రికరిస్తున్నారు. ఇంకా చంఢీఘడ్ లోకసభ స్థానంలో ఆప్ అభ్యర్థి గుల్ పనాగ్, బీజేపీ నుంచి కిరణ్ ఖేర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పవన్ కుమార్ భన్సాల్ ల మధ్య త్రిముఖ పోటి రసవత్తరంగా మారడంతో ఆస్థానంపై బుకీలు కన్నేస్తున్నారు. ఇంకా నందన్ నీలెకని పోటీ చేసే బెంగళూరులోనూ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని స్థానాల్లోను బెట్టింగ్ భారీగా జరిగే అవకాశముందంటున్నారు. బుకీలో దృష్టిలోఉన్న స్థానాల్లో అజయ్ మాకెన్ పోటి చేస్తున్న న్యూఢిల్లీ, అమేథి, న్యూఢిల్లీ, చాందీని చౌక్, ఘజియాబాద్ స్థానాలపై బెట్టింగ్ జోరు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫేవరెట్ స్థానం అంటే ఎలాంటి సందేహాం లేకుండా గెలిచే స్థానంపై బుకీలు తక్కువ మొత్తాన్ని ఇచ్చే విధంగా నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగతుందనే అంచనాతో ఆపార్టీపై 2.25 పైసలు, కాంగ్రెస్ పై 2.40 పైసలు, ఆమ్ ఆద్మీ పార్టీపై 3.40 పైసలు బెట్టింగ్ జరిగింది. ఒకవేళ పంటర్ 1 లక్ష రూపాయలు బీజేపీపై పెట్టుబడి పెడితే 2.25 లక్షలు, ఆమ్ ఆద్మీ పార్టీపై పెడితే 3.40 లక్షలు సొంత చేసుకుంటారన్న మాట. రానున్న ఎన్నికల్లో బెట్టింగ్ విలువను ఇంకా నిర్ఱారించలేదని పేరు తెలుపడానికి ఇష్టపడని బుకీ ఒకరు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బెట్టింగ్ జోరు కొనసాగవచ్చనే వార్తలతో పోలీసు యంత్రాంగం బెట్టింగ్ వీరులను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలను ప్రారంభించింది. బెట్టింగ్ పాల్పడితే ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం శిక్షార్హులని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసుతో ఏడు ఏళ్ల వరకు శిక్ష పడవచ్చని పోలీసులు తెలిపారు. -
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న బాలీవుడ్ నటుడు!
చండీఘడ్ లోకసభ స్థానంలో బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ కు గెలుపు సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ కు చండీఘడ్ టికెట్ కేటాయించడాన్ని స్థానిక నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ హర్ మోహన్ ధావన్ మొదటి నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టాన్ని ప్రభావం చేసుకుని టికెట్ సాధించడంలో కిరణ్ ఖేర్ బలమైన పావుల్ని కదిపి సఫలమయ్యారు. అయితే లోకసభ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే స్థానికంగా బీజేపీ నేతలే ఖేర్ కు ప్రమాదకరంగా మారినట్టు పలు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. కాని బీజేపీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపడానికి ఖేర్ దంపతులు శ్రమిస్తున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి పార్టీలో, కుటుంబంలో విభేదాలు సహజమే. ఎలాంటి విభేదాలున్నా సులభంగా పరిష్కరించుకుంటాం అని కిరణ్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అయితే శుక్రవారం జరిగిన కిరణ్ ఖేర్ నామినేషన్ కార్యక్రమానికి ధావన్ గైర్హాజరు కావడం అనేక సందేహాల్ని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ ఖేర్ కు స్వంత పార్టీ నేతలు ధావన్, సత్యపాల్ జైన్ ల నుంచి సహాయ నిరాకరణ ఎదురువుతోంది. చంఢీఘడ్ బరిలో కిరణ్ ఖేర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సాల్ గట్టి పోటి ఇవ్వనున్నారు. -
చండీగఢ్‌లో మెరిసే 'తార' ఎవరో ?
-
హోళీకి దూరమైన రాజకీయ నేతలు!
దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోళీ రంగుల్లో మునిగి తేలుతుంటే ముగ్గురు నేతల మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి దిగుమతైన గుల్ పనాగ్, మరో నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు వివిధ కారణాలతో హోళీ వేడుకలకు దూరంగా ఉన్నారు. నీటి కొరత కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చంఢీఘడ్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న గుల్ పనాగ్ ఇష్టమైన హోళీ పండగకు దూరంగా ఉన్నాను అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సహజసిద్దమైన రంగులతో హోళీని ఎంజాయ్ చేయండి.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని విజ్క్షప్తి చేస్తూ.. హోళీ శుభాకాంక్షలు తెలిపింది. సాంప్రదాయ పద్దతిలో బీహార్ లో లక్షలాది మంది హోళీ వేడుకల్లో మునిగి తేలారు. అయితే సరన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఓ స్కూల్ లో మధ్యాహ్న భోజన తిని 23 మంది పిల్లలు చనిపోయిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోళీ పండగకు దూరంగా ఉన్నారు. ఇప్పడు బట్టలు చింపుకునేలా ప్రతి ఏటా హోళీ ఆడే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా ఈ సారి హోళీ పండగకు దూరంగా ఉన్నారు. -
చంఢీఘడ్ బరిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్!
చండీఘడ్ లోకసభ ఎన్నికల బరిలో ఈ సారి ఆసక్తికరమైన పోరు నెలకొంది. త్వరలోనే జరుగనున్న లోకసభ ఎన్నికల్లో చండీఘడ్ లోకసభ నియోజకవర్గంలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్ బరిలోకి దిగారు. బాలీవుడ్ తారలు గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీకి సిద్ధమవ్వగా, అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ లను ఎదుర్కోనేందుకు ఈ స్థానం నుంచే నాలుగు సార్లు ఎంపికైన కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్ కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచారు. రైల్వేశాఖలో ఉద్యోగాల కుంభకోణంలో 90 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తన మేనల్లుడు పట్టుపడటంతో అప్పడు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ భన్సాల్ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పవన్ కుమార్ భన్సాల్ కు గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. అయితే ఈ స్థానం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక మున్సిపల్ మహిళా కౌన్సిలర్ జన్నత్ జహన్ బరిలోకి దిగడం విశేషం. 1991, 1999, 2004, 2009 లోకసభలకు చండీఘడ్ లోకసభ స్థానం నుంచి గెలిచిన పవన్ కుమార్ భన్సాల్ ఈసారి ముగ్గురు మహిళల నుంచి గట్టిపోటి ఎదుర్కొంటున్నారు. -
'ఆప్'లో చేరిన మాజీ బ్యూటీ క్వీన్
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్, మాజీ బ్యూటీ క్వీన్ గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె చండీగఢ్ లోక్‌సభ సాన్థం నుంచి పోటీ చేయనున్నారు. చండీగఢ్ సీటు ముందుగా దివంగత నటుడు, వ్యంగ్యకారుడు జస్పాల్ భట్టి భార్య సవిత భట్టి(53)కు కేటాయించారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వారం రోజుల తర్వాత ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. స్థానిక ఆప్ నాయకులు సహకరించడం లేదంటూ పోటీలో నిలిచేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసుందుకు గుల్ పనాగ్‌కు మార్గం సుగమైంది. గుల్ పనాగ్ తండ్రి మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు. చండీగఢ్‌లో జన్మించిన గుల్ పనాగ్ 1999లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. మూడేళ్ల క్రితం చండీగఢ్ గురుద్వారాలో ఆమె వివాహం చేసుకున్నారు. -
సాహసయాత్రలంటే ఇష్టం
న్యూఢిల్లీ: ‘నాకు సాహసయాత్రలంటే ఇష్టం.. నా ప్రతి టూర్ ను భిన్నంగా జరుపుకునేందుకే ప్రాధాన్యమిస్తా..’ అని మాజీ అందాల సుందరి, నటి గుల్ పనగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆమె సాహసయాత్రలో పాల్గొని తిరిగి వచ్చారు. దాని గురిం చి వివరిస్తూ.. ‘ ఇది చాలా సాహసోపేత ప్రయాణం. చాలా ఎంజాయ్ చేశాను..’ అని చెప్పారు. ఈ యాత్రలో ఆమెతోపాటు ఆమె భర్త రిషి అట్టారీ, మరికొందరు స్నేహితులు పాల్గొన్నారు. ‘ మేం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్ లోయకు సాహసయాత్ర చేశాం. ఆరుగురం మూడు వాహనాలపై ఐదు రోజుల పాటు ప్రయాణించాం. చాలా ఆనందించాం..’ అని ఆమె తెలిపారు. సాహసయాత్రలకు సరిపడా కారు గాని, ఇతర ఏ వాహనం కాని దొరక్కపోవడంతో కొన్ని నెలల కిందట తన మహీంద్ర స్కార్పియోను ఇటువంటి అవసరాలకు సరిపడే విధంగా మార్పు లు చేయించుకున్నట్లు ఆమె తెలిపారు.‘సాహసయాత్రలు చేయడం అలవాటుగా మారిన తరుణంలో ఏ ఒక్క వాహనం నా అవసరాలకు సరిపడా కనిపించలేదు. అందుకే నా ప్రయాణాలకు అనుగుణంగా ఒక వాహనాన్ని రూపొందించుకున్నాను..’ అని ఆమె వివరించారు. అయితే అది అంత సుల భంగా జరగలేదని ఆమె చెప్పా రు. ‘యాత్రల కోసం రూఫ్ టాప్ టెంట్, ఎలక్ట్రిక్ వించ్, అధునాతనమైన జాక్, అదనపు లైట్లు, డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ తదితర అదనపు హంగులను నా వాహనానికి అమర్చుకోవడానికి కారు ఖరీదులో సగం సొమ్ము వెచ్చించాల్సి వచ్చింది..’ అని గుల్ తెలిపారు. కాగా నటిగా, సాహసయాత్రికురాలిగా బిజీగా ఉంటున్న గిల్ సామాజిక బాధ్యతలోనూ పాలుపంచుకోవడం విశేషం. ఆమె బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన పెంచే పింకథాన్లోనూ, పొగాకు వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొంటోంది.