భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న బాలీవుడ్ నటుడు!
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న బాలీవుడ్ నటుడు!
Published Fri, Mar 21 2014 6:28 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
చండీఘడ్ లోకసభ స్థానంలో బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ కు గెలుపు సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ కు చండీఘడ్ టికెట్ కేటాయించడాన్ని స్థానిక నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ హర్ మోహన్ ధావన్ మొదటి నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టాన్ని ప్రభావం చేసుకుని టికెట్ సాధించడంలో కిరణ్ ఖేర్ బలమైన పావుల్ని కదిపి సఫలమయ్యారు. అయితే లోకసభ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే స్థానికంగా బీజేపీ నేతలే ఖేర్ కు ప్రమాదకరంగా మారినట్టు పలు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు.
కాని బీజేపీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపడానికి ఖేర్ దంపతులు శ్రమిస్తున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి పార్టీలో, కుటుంబంలో విభేదాలు సహజమే. ఎలాంటి విభేదాలున్నా సులభంగా పరిష్కరించుకుంటాం అని కిరణ్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అయితే శుక్రవారం జరిగిన కిరణ్ ఖేర్ నామినేషన్ కార్యక్రమానికి ధావన్ గైర్హాజరు కావడం అనేక సందేహాల్ని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ ఖేర్ కు స్వంత పార్టీ నేతలు ధావన్, సత్యపాల్ జైన్ ల నుంచి సహాయ నిరాకరణ ఎదురువుతోంది.
చంఢీఘడ్ బరిలో కిరణ్ ఖేర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సాల్ గట్టి పోటి ఇవ్వనున్నారు.
Advertisement
Advertisement