ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడం తొందరపాటుతనమేనని ఆ పార్టీ నేత షాజియా ఇల్మి అన్నారు.
ఇండోర్: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడం తొందరపాటుతనమేనని ఆ పార్టీ నేత షాజియా ఇల్మి అన్నారు. అలా రాజీనామా చేస్తాడని తాను అనుకోలేదని తెలిపారు. ఆయన అధికారంలో ఉండి జన్‌లోక్‌పాల్ బిల్లుపై చర్చపెట్టలేకపోయారని, కేజ్రీవాల్ అధికారదాహంతో ఉన్నారని విమర్శించారు. రాజీనామా అనంతరం కేజ్రీవాలో సమస్యలనుంచి, క్షేత్ర ంనుంచి పారిపోయారన్నారు. జన్‌లోక్‌పాల్ అంశమై రాజీనామా చేసినా, తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనేవిషయాన్ని ప్రజలకు చెప్పి ఒప్పించలేకపోయారని ఆమె విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఇండోర్ అభ్యర్తి అనిల్ త్రివేదికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాజియా ప్రజలు అధికారం, నీళ్లు, రోడ్లు, విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నారని ‘హర-హర-మోడీ’ అనడం వల్ల ఏమొస్తుందని బీజేపీని ప్రశ్నించారు. భగవాన్, అల్లాలను భరించలేనివాళ్లు సామాన్యవ్యక్తులను ఎలా భరిస్తారని ఎద్దేవా చేశారు.