Kirron Kher
-
ఎవరూ నమ్మలేరు ఈ హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే
బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఖేర్ ‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్‌లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు శ్వేతా తివారీ బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది. అమృత అరోరా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్‌తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శిల్పా శుక్లా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్‌తో కలిసి నటించింది. బాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. -
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా?
పూలదండల చాటున ఉన్న ఈ వధూవరులెవరో గుర్తుపట్టారా? ఈ నటుడు ఈ మధ్య వరుస విజయాలు అందుకోవడంతో ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. అతడు మరెవరో కాదు అనుపమ్ ఖేర్. ఈరోజు ఆయన పెళ్లిరోజు! బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఫుల్ జోష్ మీదున్నాడు. తాను నటించిన రెండు సినిమాలు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. శుక్రవారం(ఆగస్టు 26) అనుపమ్- కిరణ్ ఖేర్‌ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటో షేర్ చేశాడు. 'హ్యాపీ యానివర్సరీ కిరణ్. ఇటీవల నేను సిమ్లా వెళ్లినప్పుడు మా నాన్నగారి ట్రంకు పెట్టెలో నుంచి 37 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫొటోను బయటకు తీశాను. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలో బంగారు రంగు చీరను ధరించిన కిరణ్ ఒంటి నిండా నగలతో ధగధగా మెరిసిపోతుంది. అనుపమ్ సింపుల్‌గా ఓ ధోతీ ధరించాడు. వీరిద్దరి మెడలోనూ పూలమాలలు ఉన్నాయి. కాగా అనుపమ్, కిరణ్‌లు 1985లో పెళ్లి చేసుకున్నారు. ఇది కిరణ్ ఖేర్‌కు రెండో వివాహం. ఇదిలా ఉంటే అనుపమ్ ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్నాడు. రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అతడు ఐబీ 71, ఊంచై సినిమాలు చేస్తున్నాడు. Happy anniversary dearest #Kirron. Dug out this pic of our wedding 37years ago from the Treasure Trunk of my father during my recent visit to Shimla!😍! May God give you all the happiness, long and healthy life. सालगिरह मुबारक! 😍🌺😍 #MarriageAnniversary @KirronKherBJP #37Years pic.twitter.com/EEiSDcZrfB — Anupam Kher (@AnupamPKher) August 26, 2022 చదవండి: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు! బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు -
ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్..
ముంబై : బీజేపీ చండీగఢ్ ఎంపీ, సీనియర్ నటి కిరణ్ ఖేర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ రకమైన బ్లడ్ క్యాన్సర్‌కు గురైన కిరణ్ ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ. .కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీగఢ్‌లోని తన ఇంట్లో పడిపోవడం వల్ల ఎడమ చేయి విరిగిందని, దీంతో చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం ఈ వ్యాధి ఆమె ఎడమ చేతి నుంచి కుడి భుజానికి వ్యాపించిందని, వైద్యం కోసం డిసెంబర్ 4న ముంబైలోని ఆసుపత్రిలో చేరిందని పేర్కొన్నారు. నాలుగు నెలల చికిత్స పొందుతున్న కిరణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమెను ఇకపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనవసరం లేదన్నారు. కేవలం సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుందని అరుణ్ సూద్ తెలిపారు. కాగా కిరణ్ బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ భార్య అన్న విషయం తెలిసిందే. అనుపమ్ కూడా తన ఆరోగ్యంపై స్పందిచారు. కిరణ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘కిరణ్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. అందుకే ఆమెను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు. మీ హృదయంలో ఆమె కోలుకోవాలని ప్రార్థించండి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు- అనుపమ్, సికందర్’.. అని ట్వీట్ చేశారు. కాగా కిరణ్ ఖేర్ 2014లో బీజేపీ పార్టీ తరపున చండీగఢ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019లోనూ గెలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు. చదవండి: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు ‘పెళ్లైన ఆ స్టార్ హీరోతో నయనతార సహజీవనం’ 🙏 pic.twitter.com/3C0dcWwch4 — Anupam Kher (@AnupamPKher) April 1, 2021 -
‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’
‘ప్రియమైన కిరణ్!!! 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!! జీవితంలోని అత్యధిక సమయం ఇద్దరం కలిసి గడిపాము. అప్పుడే 34 ఏళ్లు గడిచాయా. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తున్న ప్రతీ క్షణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తా’ అంటూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా అనుమప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తమ పెళ్లినాటి ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఖేర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్‌లో థియేటర్స్ కోర్సు చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుమప్- కిరణ్ 1985లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అంతకుముందే గౌతం బెర్రీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కిరణ్‌కు సిఖిందర్ అనే కుమారుడు ఉన్నాడు. సిఖిందర్ ప్రస్తుతం అనుమప్-కిరణ్ ఖేర్లతోనే జీవిస్తున్నాడు. ఇక థియేటర్స్‌లో అనుభవం గడించిన అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టిన కిరణ్ ఖేర్ 1996లో ‘సర్దారీ బేగమ్’ అనే సినిమాతో తొలి విజయాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత బరీవాలీ, దేవ్‌దాస్, వీర్‌జరా, హమ్‌తుమ్, దోస్తానా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. సంప్రదాయ పంజాబీ కుటుంబానికి చెందిన కిరణ్ ఖేర్ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలుగా పంజాబ్ రాజధాని చండీగఢ్ ఎంపీ(లోక్‌సభ)గా ఆమె ఎన్నికయ్యారు. కాగా 1984లోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనుమప్ ఇటీవల ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రేక్షకులను పలకరించాడు. View this post on Instagram Dearest Kirron!!! Happy 34th wedding anniversary!! Bahut lamba waqt zindagi ka saath mei tay kiya hai humne. 34 saal guzar gaye lekin lagta hai Jaise kal ki he baat hai. I have loved the lived quality of our lives together. सालगिरह मुबारक।😍 @kirronkhermp #Pushkar #Dulari #Raju A post shared by Anupam Kher (@anupampkher) on Aug 25, 2019 at 7:58pm PDT -
కిరణ్‌ఖేర్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు
చండీగఢ్ : పిల్లలను ప్రచారంలో భాగస్వామ్యం చేశారన్న కారణంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ ఖేర్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ నటి, చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పిల్లలతో ఆమె మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ కిరణ్ ఖేర్‌కు ఓటు వేయండి. మరోసారి మోదీ సర్కారు’ అంటూ పిల్లలు నినాదాలు చేస్తున్నట్లు ఉండటం పట్ల జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ కిరణ్ ఖేర్‌కు శనివారం నోటీసులు జారీ చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 19న చండీగఢ్‌లో ఎన్నికలు జరుగునున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకుంటున్నారంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌కు మద్దతు తెలుపుతూ.. మోదీ గురించి పిల్లలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఈ వీడియోలో ప్రియాంక గాంధీ నవ్వుతూ కనిపించారంటూ బీజేపీ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆమెకు నోటీసులు జారీ కాగా.. ‘ పిల్లలు తమంతట తాము ఆడుకుంటున్నారు. నేను వారిని కలవడానికి దగ్గరికి వెళ్లగానే నినాదాలు చేశారు. కొన్ని తప్పుడు నినాదాలు ఇవ్వగానే అలా మాట్లాడవద్దని చెప్పాను’ ఆమె వివరణ ఇచ్చారు. కాగా బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిల్లలను ఎన్నికల ప్రచారంలో వాడుకోకూడదు. -
‘ఆమెను కలవడం కుదరడం లేదు’
న్యూఢిల్లీ: తన భార్య కిరణ్ ఖేర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తామిద్దరం తరచుగా కలుసుకోవడం కుదరడం లేదని సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ వెల్లడించారు. ఏకాంతంగా గడిపే సమయం చిక్కడం లేదని అన్నారు. ‘నా భార్య ఎంపీగా గెలిచినప్పటి నుంచి మేమిద్దరం కలిసి గడిపేందుకు టైమ్ దొరకడం లేదు. తన నియోజకవర్గ పనుల్లో కిరణ్ తీరిక లేకుండా గడుపుతోంది. చండీగఢ్ నియోజకవర్గానికి ఆమె ఎక్కువ సమయం కేటాయించి, ప్రజల కోసం పనిచేస్తోంద’ని అనుమప్ ఖేర్ అన్నారు. వీరిద్దరి వివాహ బంధానికి మూడు దశాబ్దాలు దాటింది. 1985లో వీరు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. అనుమప్ ఖేర్ సినిమాల్లో నటిస్తుండగా, కిరణ్ ఖేర్ చండీగఢ్ ఎంపీగా సేవలందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన 62 ఏళ్ల అనుమప్ 500పైగా సినిమాల్లో నటించారు. చండీగఢ్, ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రమే తామిద్దరం కలుసుకునేందుకు వీలవుతుందని అనుమప్ తెలిపారు. ‘ఈ రోజు ఢిల్లీలో ఉన్నాను. నా భార్యతో కలిసి కాఫీ తాగేందుకు అవకాశం చిక్కింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న కిరణ్ ఢిల్లీలో ఉంది. ఈ రోజు రాత్రే నేను ఢిల్లీ నుంచి వెళ్లాల్సివుంది. కాబట్టి కాఫీకి మాత్రమే అవకాశముంది. పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామ’ని అనుపమ్ ఖేర్ వివరించారు. -
పార్లమెంట్ లో నోరు విప్పని రేఖ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరులో బాలీవుడ్ సీనియర్ సినీ నటి రేఖ అందరికంటే ముందు నిలిచారు. ఆమె హాజరు శాతం 5 శాతం మాత్రమేనని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. 2012, ఏప్రిల్ లో రాజ్యసభకు నామినేటయిన రేఖ ఇప్పటివరకు ఒక్క ప్రశ్న అడగలేదు. ఒక్క చర్చలోనూ ఆమె పాల్గొనలేదు. రేఖ తర్వాతి స్థానంలో మిథున్ చక్రవర్తి నిలిచారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన హాజరు శాతం పది శాతం మాత్రమే. చండీగఢ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిరణ్ ఖేర్ సినిమా నటుల్లో ఎక్కువసార్లు పార్లమెంట్ సమావేశాలకు హాజరయారు. ఆమె హాజరు శాతం 85గా ఉంది. 76 శాతంతో తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ ఈస్ట్ బీజేపీ ఎంపీ పరేశ్ రావల్, టీఎంసీ ఎంపీ శతాబ్దిరాయ్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి నిలిచారు. లోక్‌సభలో సగటు హాజరు 82 శాతం కాగా, రాజ్యసభలో 79 శాతంగా నమోదైంది. హేమమాలిని హాజరు 37 శాతంగా ఉంది. ఆమె 10 చర్చల్లో పాల్గొన్నారు. 113 ప్రశ్నలు అడిగారు. 68 శాతం హాజరు నమోదు చేసుకున్న షాట్ గన్ శత్రుఘ్నసిన్హా ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు, ఏ చర్చలోనూ పాల్గొనలేదు. -
‘ఇండియా గాట్ టాలెంట్’ను వదులుకోను
న్యూఢిల్లీ: బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టాలెంట్ షోగా ప్రసారమవుతున్న ‘ఇండియా గాట్ టాలెంట్’ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న కిరణ్ ఖేర్ ఇకపై కూడా ఆ స్థానంలో కొనసాగుతానని చెబుతున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చండీగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీగా బాధ్యతలు పెరగడంతో ఇకపై టాలెంట్ షోలో పాల్గొంటారా? లేదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘కార్యక్రమాన్ని చూస్తూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నేనూ అంతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై కూడా న్యాయనిర్ణేతగానే కొనసాగుతాను. మిగతా సమయాన్నంతా చండీగఢ్ ప్రజల సమస్యల పరిష్కారానికి కేటాయిస్తాను. ఎన్నికల ప్రచార సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాను. నా ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ప్రచారం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రోజుకు కేవలం ఐదుగంటలు మాత్రమే నిద్రపోయాను. మిగతా సమయాన్ని ప్రచారం కోసం కేటాయించాను. అందుకే కార్యక్రమాన్ని కొన్నిరోజుల కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఇకపై న్యాయనిర్ణేతగా కొనసాగాలని అనుకుంటున్నాను. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీదే. పార్టీ అధిష్టానం నాపై మరిన్ని బాధ్యతలు మోపితే వాటిని కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం కష్టం కావొచ్చు. కేవలం ఎంపీగా బాధ్యలు మాత్రమే నాపై ఉంటే అటు ప్రజలకు సేవ చేయడంతోపాటు న్యాయనిర్ణేతగా కొనసాగడం కష్టమేమీ కాదనుకుంటున్నా. అయితే దీనిపై స్పష్టత మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశముంద’న్నారు. -
"రాజకీయాల్లో కొనసాగుతాను.. అసంతృప్తి లేదు'
ముంబై: రాజకీయాల్లో కొనసాగుతానని, కేవలం లోకసభ ఎన్నికలకే పరిమితం కానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, బాలీవుడ్ తార గుల్ పనాగ్ అన్నారు. ఓటమి వల్ల నిరుత్సాహానికి గురికావడం లేదని.. అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పనిచేస్తామని ఆమె అన్నారు. చంఢీగఢ్ స్తానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటి చేసిన గుల్ పనాగ్.. బీజేపీ అభ్యర్ధి, బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రజల తీర్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని, తనకు మద్దతు తెలిపిన చంఢీఘడ్ ప్రజలకు కృతజ్క్షతలు అని పనాగ్ మీడియాతో అన్నారు. తొలిసారి పోటి చేసిన తనకు భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయన్నారు. -
గ్లామర్ పెరిగిన సభాపర్వం
సినీ తారలకూ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉన్న దేశం మనది. తాజా సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ సంగతిని మరోసారి స్పష్టం చేశాయి. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన గుజరాత్ దాకా, ఉత్తరాన పంజాబ్, ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణాన కేరళ దాకా అనేక రాష్ట్రాల్లో సినీ తారలు బాక్సాఫీస్ దగ్గర కాక, బ్యాలెట్ పెట్టెల వద్ద పోటీ పడ్డారు. లోక్‌సభతో పాటు మన రాష్ర్ట శాసనసభ బరిలోనూ తారలు సందడి చేశారు. మనవాళ్ళ సంగతి కాస్త పక్కనపెట్టి, ఇతర రాష్ట్రాల సంగతి గమనిస్తే, ఈ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద హిట్టయినవాళ్ళూ, ఫ్లాపైనవాళ్ళూ చాలామందే! సినీతారలుగా సుప్రసిద్ధులైన హేమమాలిని, మున్ మున్ సేన్, కిరణ్ ఖేర్, పరేశ్ రావల్, మలయాళ నటుడు ఇన్నోసెంట్ లాంటి వారు ఎన్నికలలో గెలిచి, పార్లమెంట్ సభ్యులయ్యారు. అదే సమయంలో జయప్రద, నగ్మా, గుల్‌పనగ్, నటుడు రాజ్‌బబ్బర్, అమేథీలో రాహుల్ గాంధీతో పోటీపడ్డ నటి స్మృతీ ఇరానీ తదితరులు ఈ ఎన్నికల పోరులో మట్టికరిచారు. హిందీ చిత్రసీమలో ‘డ్రీమ్‌గర్ల్’గా పేరొందిన రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని ఈ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మథుర లోక్‌సభా స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీచేశారు. యు.పి.లో వీచిన మోడీ ప్రభంజనంలో ఆమె అక్కడ ఇటీవలి వరకు లోక్‌సభ సభ్యులైన రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించారు. ప్రముఖ సినీ, రంగస్థల నటి కిరణ్ ఖేర్ ఎన్నికల యుద్ధంలోకి దిగిన తొలిసారే విజయ ఢంకా మోగించారు. నటుడు అనుపమ్‌ఖేర్ సతీమణి అయిన ఆమె పంజాబ్‌లోని చండీగఢ్ నుంచి బి.జె.పి. పక్షాన పోటీ చేసి, రైల్వేశాఖ మాజీ మంత్రి అయిన పవన్ కుమార్ బన్సల్‌ను భారీ తేడాతో ఓడించడం విశేషం. అదే స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగిన నటి గుల్ పనగ్ మూడో స్థానంలో నిలిచారు. నటీమణులే కాక, నటులు కూడా ఈసారి లోక్‌సభకు బాగానే సినీ గ్లామర్ తెస్తున్నారు. ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పరేశ్ రావల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ తూర్పు స్థానంలో బరిలోకి దిగి, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిని ఓడించారు. చాలా కాలంగా బి.జె.పి.ని నమ్ముకున్న నటుడు వినోద్ ఖన్నా గడచిన 2009 ఎన్నికల్లో ఓటమి పాలైనా, ఈసారి గురుదాస్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. ఇక, మరో సీనియర్ హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా పాట్నా సాహిబ్ స్థానం నుంచి నాలుగోసారి గెలిచారు. బి.జె.పి. పక్షాన బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రాంతీయ భాషా నటుడు కునాల్ సింగ్‌తో ఢీ కొనడం విశేషం. ఈ ఇద్దరు నటుల పోరులో, సహజంగానే సీనియర్ అయిన శత్రుఘ్న సిన్హా గెలిచారు. ప్రేక్షకుల ముందు ప్రత్యక్ష ప్రదర్శనల్లో తన హాస్య విన్యాసాల ద్వారా ఆకట్టుకొనే పాపులర్ కమెడియన్ భగవంత్ మాన్... పంజాబ్‌లోని సంగ్రూర్ నుంచి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి అయిన శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాను ఓడించారు. సుప్రసిద్ధ భోజ్‌పురీ గాయకుడు - నటుడు మనోజ్ తివారీ బి.జె.పి. పక్షాన నిలిచి, ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి గెలిచారు. బాలీవుడ్ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్ నుంచి గెలిస్తే, తెలుగు వారికీ సుపరిచితుడైన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి బి.జె.పి. తరఫున దిగినా విజయం వరించలేదు. అదే రాష్ట్రంలోని శ్రీరామ్‌పూర్ నుంచి రేసులో మూడో ప్లేసుకే ఆయన పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి సినీ తారల ఎన్ని కల సందడి ఎక్కువగా ఉంది. బంకురా నియోజక వర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ప్రముఖ నటి మున్ మున్ సేన్ (తెలుగులో కె.విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ చిత్రంలో నటించారు) అక్కడ తలలు పండిన రాజకీయవేత్తను ఢీకొని, గెలవడం విశేషం. బీర్భూమ్ నుంచి శతాబ్ది రాయ్, మిడ్నాపూర్ నుంచి సంధ్యా రాయ్, కృష్ణానగర్ నుంచి తపస్ పాల్, ఘటల్ నుంచి దేవ్‌గా ప్రాచుర్యం పొందిన దీపక్ అధికారి విజేతలుగా నిలిచారు. ఈసారి కేరళలోని చేలక్కుడి స్థానం నుంచి ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్ వామపక్షాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, గెలిచారు. క్యాన్సర్‌తో బాధపడుతూ, ఇటీవలే కోలుకున్న ఆయన విజయం సాధించారు. రాజకీయ దిగ్గజాలను ఢీ కొనేందుకు సినీ గ్లామర్‌ను వాడుకొనేందుకు ఈసారి దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ప్రయత్నించాయి. అయితే, అన్నిచోట్లా అది పనిచేయలేదు. లక్నో స్థానంలో బి.జె.పి. జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో ‘ఆప్’ పక్షాన నటుడు జావేద్ జాఫ్రీ పోటీ పడినప్పటికీ, రాజకీయ చైతన్యం ముందు సినిమా ఇమేజ్ పని చేయలేదు. ఇక, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన అమేథీ స్థానంలో బి.జె.పి. పక్షాన పోటీపడిన టి.వి. నటి స్మృతీ ఇరానీ ఆఖరుకు ఓటమి పాలైనా, మొదట్లో మంచి పోటీ ఇచ్చి, వార్తల్లో నిలిచారు. ఓటములూ ఎక్కువే! ఓటర్ల రాజకీయ చైతన్యం ముందు కొందరు సుప్రసిద్ధ తారల ఆకర్షణ మంత్రం పప్పులుడకలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన హిందీ నటుడు రాజ్ బబ్బర్ (ఘాజియాబాద్ స్థానం), ఇటీవల అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ చిత్రంలో విలన్‌గా పాపులరైన భోజ్‌పురి సూపర్‌స్టార్ రవి కిషన్ (ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి డివిజన్‌కు చెందిన జౌన్పూర్ స్థానం), తెలుగులోనూ పేరున్న హిందీ నటి నగ్మా (మీరట్ స్థానం) కౌంటింగ్ కేంద్రాల్లో చతికిలబడ్డారు. చిత్రం ఏమిటంటే, భోజ్‌పురీ చిత్రాలకు అపర అమితాబ్ బచ్చన్‌గా పేరున్న రవి కిషన్ అయిదో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. నగ్మా నాలుగో స్థానానికీ నెట్టివేయబడ్డారు. కర్నాటకలోని మండ్యా నుంచి జనతాదళ్ (ఎస్) అభ్యర్థిగా గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన యువ కన్నడ నటి రమ్య తాజా ఎన్నికల్లో తన స్టార్ ఎట్రాక్షన్‌ను చూపించలేకపోయారు. ఈ సారి ఓటమి పాలైన వారిలో ‘ఆరక్షణ్’, ‘సత్యాగ్రహ్’ లాంటి తాజా రాజకీయ చైతన్య చిత్రాల దర్శకుడైన ప్రకాశ్ ఝా (బీహార్‌లోని పశ్చిమ చంపారణ్), మరో దర్శక - నటుడు మహేశ్ మంజ్రేకర్ (ముంబయ్ వాయవ్యం), రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరిట బరిలోకి దిగిన నటి రాఖీ సావంత్, కొన్నేళ్ళుగా ఉత్తరాదిన రాజకీయాలకు గ్లామర్ పెంచిన తెలుగు నటి జయప్రద (ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నౌర్) ఉన్నారు. ఏమైనా, ఈ సారి మునుపటి కన్నా ఎక్కువ గ్లామరే ఎన్నికలకు వచ్చింది. విజేతలతో అది తాజా లోక్‌సభకూ విస్తరించనుంది. -
బాలీవుడ్ భామల చేతిలో పవన్ భన్సల్ భవితవ్యం!
లోకసభ ఎన్నికల్లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్బూసియర్ రూపొందించిన చంఢీఘడ్ నగరంలో ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. చంఢీఘడ్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు గెలుపొందిన పవన్ కుమార్ భన్సల్, బాలీవుడ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నటి గుల్ పనాగ్, బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ లు పోటి చేయడమే అందుకు కారణం. ఇదే నియోజకవర్గంలో బీఎస్పీ తరపున జన్నత్ జహన్ అనే మహిళ కూడా పోటిలో ఉన్నారు. రైల్వేశాఖలో ఉద్యోగ కుంభకోణంలో మేనల్లుడు అరెస్ట్ కావడంతో పవన్ కుమార్ భన్సల్ పై కూడా ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం నుండి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే చంఢీఘడ్ నియోజకవర్గంలో మంచి పలుకుబడి, గట్టి పట్టున్న భన్సల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న గుల్ పనాగ్ ఓటర్లను ఆకర్షించేందుకు బుల్లెట్ పై ప్రచారం చేయడం, ఉదయమే పార్కుల్లో తిరగడం, వీధుల్లో తిరుగుతూ సమస్యలను సావధానంగా వినడం లాంటి అంశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కేజ్రీవాల్ రోడ్ షోకు మంచి స్పందన రావడంతో గెలుపుపై గుల్ పనాగ్ లో విశ్వాసం పెరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి, అనుపమ్ ఖేర్ సతీమణి, కిరణ్ ఖేర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కుంభకోణాలు బీజేపీకి విజయాన్ని అందిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అవినీతితో దేశాన్ని భ్రష్టుపట్టించిందని.. ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడాలంటే మోడీ సేవలు ఎంతో అవసరం ఉందని.. అందుకే ఈసారి కమలానికి ఓటు వేయాల్సిందేనని ఓటర్లకు విజ్క్షప్తి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో 50 శాతానికి పైగా 45 ఏళ్ల వయస్సు లోపువారే ఉండటంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు యువ ఓటర్లపై కన్నేశారు. చంఢీఘడ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 23 వేల పైగానే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా, యువ ఓటర్లతోపాటు, తొలిసారి ఓటు వినియోగించుకునే వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, ముగ్గురు మహిళా అభ్యర్థులతో సీనియర్ నేత భన్సల్ పోటి పడుతున్నారు. 45 శాతానికి పైగా చంఢీఘడ్ నియోజకవర్గంలో మహిళలుండటం గుల్ పనాగ్, కిరణ్ ఖేర్, జన్నత్ జహన్ లు తమ విజయంపై ఆశలు పెంచుకున్నారు. మహిళా అభ్యర్థులను ఓడించి భన్సాల్ ఐదోసారి విజయం సాధిస్తారా అనేది ఏప్రిల్ 10 తేదిన జరిగే ఎన్నికల్లో స్పష్టమవుతుంది. -
భార్య కోసం షూటింగులన్నీ రద్దు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న తన భార్య కిరణ్ ఖేర్ తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మొత్తం షూటింగులన్నింటికీ తాత్కాలికంగా విరామం పలికారు. చండీగఢ్ నుంచి కిరణ్ పోటీచేస్తున్నారు. ఆమెకోసం ఏప్రిల్ నెలలో తనకున్న షూటింగులన్నింటినీ అనుపమ్ ఖేర్ రద్దుచేసుకున్నారు. ఈనెల ఆరంభంలో కిరణ్ తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు ఆమె వెంట అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. కిరణ్ ఖేర్‌కు చండీగఢ్‌లో పరిస్థితి చాలా బాగుందని, ఆమెకు సాయం చేయడానికి అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుపమ్ చెప్పారు. ఆమెకు కొంతకాలం పాటు సాయం ఉంటానని, ఇదంతా తన సంతృప్తి కోసమే తప్ప ఆమెకు నిజానికి తన అవసరం ప్రస్తుతానికి లేదని తెలిపారు. కిరణ్ వయస్సు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గుల్ పనగ్ చేసిన వ్యాఖ్యలపై అనుపమ్ మండిపడ్డారు. రాజకీయాల్లో ఒత్తిడి తట్టుకోడానికి కిరణ్ వయసు సహకరించదని చెప్పేవాళ్లు ఆమె ప్రచార ఉధృతిని చూడాలని అన్నారు. ''మా తాతగారు ఒకటే చెప్పేవారు. అప్పటికే తడిసి ఉన్నప్పుడు మళ్లీ వర్షం గురించి భయపడటం అనవసరమన్నారు. కిరణ్, నేను ఇద్దరమూ యోధులమే. దేనికీ భయపడేది లేదు" అని ఆయన చెప్పారు. -
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న బాలీవుడ్ నటుడు!
చండీఘడ్ లోకసభ స్థానంలో బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ కు గెలుపు సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ కు చండీఘడ్ టికెట్ కేటాయించడాన్ని స్థానిక నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ హర్ మోహన్ ధావన్ మొదటి నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టాన్ని ప్రభావం చేసుకుని టికెట్ సాధించడంలో కిరణ్ ఖేర్ బలమైన పావుల్ని కదిపి సఫలమయ్యారు. అయితే లోకసభ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే స్థానికంగా బీజేపీ నేతలే ఖేర్ కు ప్రమాదకరంగా మారినట్టు పలు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. కాని బీజేపీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపడానికి ఖేర్ దంపతులు శ్రమిస్తున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి పార్టీలో, కుటుంబంలో విభేదాలు సహజమే. ఎలాంటి విభేదాలున్నా సులభంగా పరిష్కరించుకుంటాం అని కిరణ్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అయితే శుక్రవారం జరిగిన కిరణ్ ఖేర్ నామినేషన్ కార్యక్రమానికి ధావన్ గైర్హాజరు కావడం అనేక సందేహాల్ని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ ఖేర్ కు స్వంత పార్టీ నేతలు ధావన్, సత్యపాల్ జైన్ ల నుంచి సహాయ నిరాకరణ ఎదురువుతోంది. చంఢీఘడ్ బరిలో కిరణ్ ఖేర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సాల్ గట్టి పోటి ఇవ్వనున్నారు. -
చంఢీఘడ్ బరిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్!
చండీఘడ్ లోకసభ ఎన్నికల బరిలో ఈ సారి ఆసక్తికరమైన పోరు నెలకొంది. త్వరలోనే జరుగనున్న లోకసభ ఎన్నికల్లో చండీఘడ్ లోకసభ నియోజకవర్గంలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్ బరిలోకి దిగారు. బాలీవుడ్ తారలు గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీకి సిద్ధమవ్వగా, అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ లను ఎదుర్కోనేందుకు ఈ స్థానం నుంచే నాలుగు సార్లు ఎంపికైన కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్ కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచారు. రైల్వేశాఖలో ఉద్యోగాల కుంభకోణంలో 90 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తన మేనల్లుడు పట్టుపడటంతో అప్పడు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ భన్సాల్ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పవన్ కుమార్ భన్సాల్ కు గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. అయితే ఈ స్థానం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక మున్సిపల్ మహిళా కౌన్సిలర్ జన్నత్ జహన్ బరిలోకి దిగడం విశేషం. 1991, 1999, 2004, 2009 లోకసభలకు చండీఘడ్ లోకసభ స్థానం నుంచి గెలిచిన పవన్ కుమార్ భన్సాల్ ఈసారి ముగ్గురు మహిళల నుంచి గట్టిపోటి ఎదుర్కొంటున్నారు. -
విద్యతో ఆలోచనల్లో మార్పు
విద్యతోనే మనుషుల ఆలోచనా విధానంలో మార్పు సంభవమని నటి కిరణ్ ఖేర్ అన్నారు. ఆమె గురువారం పంచాయత్ ఆజ్ తక్ నిర్వహించిన ‘ఓట్ లో.. సురక్షా దో..’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను నిరోధించాలంటే ముందు స్త్రీ,పురుషుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. చదువుకున్న వారి ఆలోచనలు సరైన రీతిలో ఉంటాయి. అదే విపరీత మానసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తుల మెదడు సక్రమ మార్గంలో ఆలోచించలేదు.. అలాంటి వారిని విద్యావంతులను చేస్తే సరైన మార్గంలో నడిచే అవకాశముంది..’ అని ఆమె సూచించారు. ‘భారతదేశం చాలా సువిశాలమైంది.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రేమికుల రోజును జరుపుకోవడాన్ని స్వాగతిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూస్తారు.. అది ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది.. విద్యతో అటువంటి వారి ఆలోచనాసరళిని మార్చవచ్చు’నని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై హింసను అరికట్టాలంటే చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలని, దానికి చాలా బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ నేత అయిన ఈ 58 ఏళ్ల బాలీవుడ్ సినీనటి స్పష్టం చేశారు.