‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’ | Anupam Kher Anniversary Wishes For Kirron Kher With Adorable Pic | Sakshi
Sakshi News home page

నీతో ఉన్న ప్రతీ క్షణాన్ని ప్రేమిస్తూనే ఉంటా: అనుపమ్‌

Published Mon, Aug 26 2019 12:46 PM | Last Updated on Mon, Aug 26 2019 1:52 PM

Anupam Kher Anniversary Wishes For Kirron Kher With Adorable Pic - Sakshi

‘ప్రియమైన కిరణ్‌!!! 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!! జీవితంలోని అత్యధిక సమయం ఇద్దరం కలిసి గడిపాము. అప్పుడే 34 ఏళ్లు గడిచాయా. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తున్న ప్రతీ క్షణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తా’ అంటూ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌కు విషెస్‌ చెప్పారు. ఈ సందర్భంగా అనుమప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన తమ పెళ్లినాటి ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఖేర్‌ దంపతులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్‌లో థియేటర్స్‌ కోర్సు చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుమప్‌- కిరణ్‌ 1985లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అంతకుముందే గౌతం బెర్రీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కిరణ్‌కు సిఖిందర్‌ అనే కుమారుడు ఉన్నాడు. సిఖిందర్‌ ప్రస్తుతం అనుమప్‌-కిరణ్‌ ఖేర్‌లతోనే జీవిస్తున్నాడు.

ఇక థియేటర్స్‌లో అనుభవం గడించిన అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కిరణ్‌ ఖేర్‌ 1996లో ‘సర్దారీ బేగమ్‌’ అనే సినిమాతో తొలి విజయాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత బరీవాలీ, దేవ్‌దాస్‌, వీర్‌జరా, హమ్‌తుమ్‌, దోస్తానా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. సంప్రదాయ పంజాబీ కుటుంబానికి చెందిన కిరణ్‌ ఖేర్‌ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలుగా పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌ ఎంపీ(లోక్‌సభ)గా ఆమె ఎన్నికయ్యారు. కాగా 1984లోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనుమప్‌ ఇటీవల ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రేక్షకులను పలకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement