బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్‌లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి.
నేహా ధూపియా
బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు.
కిరణ్ ఖేర్
‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్‌లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు
శ్వేతా తివారీ
బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది.
అమృత అరోరా
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్‌లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్‌తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
శిల్పా శుక్లా
షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్‌తో కలిసి నటించింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment