Shilpa Shukla
-
సినీతారలకు నేర్పేది వీరే..
ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ఇంటిమేట్ విప్లవం నడుస్తోందని చెప్పొచ్చు. నిన్నా మొన్నటి దాకా శృంగార సన్నివేశాలను చూపించాల్సి వచ్చినప్పడు పూవులూ తుమ్మెదలతోనో, తామరాకులూ నీటిబొట్లతోనో సింబాలిక్‌గా మాత్రమే చూపిస్తూ దాపరికం ప్రదర్శించిన చిత్రసీమ ఒక్కసారిగా తెర తీసేసింది. హద్దే లేకుండా చెలరేగిపోతోంది. ఇప్పుడు శృంగార సన్నివేశాలు లేని సినిమాలు, వెబ్‌సిరీస్.. చూడాలంటే భూతద్ధంతో వెదుక్కోవాల్సిందే.అయితే ఆ తరహా శృంగార సన్నివేశాల్లో నటించడం అంత వీజీ కాదు. తెర ముద్దుల్లో పండిపోయిన ఇమ్రాన్ హష్మి లాంటివారు మాత్రమే కాదు హీరోయిన్ను ముట్టుకోవాలంటే ఇబ్బంది పడే కొత్త నటులు ప్రతీక్ గాంధీ లాంటివారూ అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కొత్త ప్రొఫెషనల్స్ సృష్టికి నాంది పలికాయి. నిజానికి హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఇంటిమసీ కో ఆర్డినేటర్లు, ఇంటిమసీ డైరెక్టర్లుగా బాలీవుడ్ తెరవెనుకకు వచ్చారు.‘నేను హాలీవుడ్ ఇంటిమసీ కోఆర్డినేటర్ అమండా బ్లూమెంటల్ దగ్గర శిక్షణ తీసుకున్నా. సిధ్ధాంత్, దీపికాపదుకునే నటించిన గెహ్రైయాన్ చిత్రంలో పుష్కలంగా శృంగార సన్నివేశాలున్నాయి. ఆ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నాకు ఆ శిక్షణ సహాయపడింది. అలాగే సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, క్లాస్ ఔర్ ఫోర్ షాట్స్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా వర్క్ చేశా. అనుభవజ్ఞులైన నటులకైతే సన్నివేశంలోని గాఢతను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక సంభాషణ సరిపోతుంది. కొత్తవాళ్లకు మాత్రం కొంత టైమ్ పడుతుంది అంటున్నారు మన దేశపు ప్రప్రధమ ఇంటిమసీ కో ఆర్డినేటర్ ఆస్తా ఖన్నా(Astha Khanna)ఇటీవల విడుదలైన షాహిద్ కపూర్–కృతిసనన్ నటించిన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియాలో పలు ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి, ఆ చిత్ర దర్శకుడు అమిత్ జోషి మాట్లాడుతూ‘‘చిత్రీకరణకు ముందు నటీనటుల అభ్యంతరాలు తెలియజేయడానికి సన్నివేశాలు ముందుగానే చర్చకు వస్తాయి. దర్శకులుగా మా నటీనటులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత. నటులు కూడా సన్నివేశాన్ని అందంగా చిత్రీకరించినంత కాలం దర్శకుడిని విశ్వసిస్తారు. రొమాంటిక్ సీన్స్ వల్ల ఎదురయే సవాళ్లను అధిగమించేందుకు ఇంటిమసీ కో ఆర్డినేటర్లు ఉంటారు’’ అని చెప్పారు.(చదవండి: 'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్)ఇంటిమసీ డైరెక్టర్ని కలిగి ఉండటం అంటే యాక్షన్ డైరెక్టర్ లేదా డ్యాన్సర్ కొరియోగ్రాఫర్‌ని కలిగి ఉన్నట్లే, నటీనటులు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా సురక్షితంగా ఉండేందుకు వారితో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు కోఆర్డినేటర్లకు దర్శకులు తాము ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారో వివరిస్తారు. ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు తన చేతులను ఎక్కడ ఉంచాలి వంటివి తెలిపిన తర్వాత సన్నివేశం ఖరారు అవుతుంది. రొమాంటిక్ సన్నివేశాలను , స్క్రిప్ట్‌ని తెలుసుకోవడం వర్క్‌షాప్‌లు నిర్వహించడం: స్క్రిప్ట్‌కు ఎలాంటి సన్నివేశాలు అవసరమో అర్థం చేసుకోవడం ఇంటిమసీ కోఆర్డినేటర్ ప్రధాన బాధ్యత.(చదవండి: పాఠ్య పుస్తకాల్లో శంభాజీ చరిత్ర ఎందుకు లేదు?: మాజీ క్రికెటర్)‘గెహ్రైయాన్లో శృంగారాన్ని విభిన్నంగా చూపించాలనుకున్నా. హీరో హరోయిన్లతో మాట్లాడా. సిద్ధాంత్ అప్పుడే బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. దీపిక చాలా కాలంగా ఉంది. ఆ వ్యత్యాసం తెలీకుండా ఆన్–స్క్రీన్ కెమిస్ట్రీ చూపించే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండాలని కోరుకున్నాను’ అని ఇంటిమసీ దర్శకుడు దార్(Dar Gai) చెప్పారు.‘‘ఖామోష్ పానీ బిఎ పాస్ వంటి నా మొదటి కొన్ని చిత్రాల సమయంలో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు కొంత స్ట్రెస్ కు గురైంది నిజం. ఆ సమయంలో హద్దులు దాటకుండా సరైన భావోద్వేగాలను ప్రదర్శించాలి. కో ఆర్డినేటర్ల కారణంగా ఇబ్బంది తొలిగింది. ఆ తర్వాత ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ లో లెస్బియన్ క్యారెక్టర్ కూడా చేయగలిగాను. ఇంటిమేట్ సన్నివేశాల కోసం రిహార్సల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉద్విగ్న వాతావరణాన్ని తేలికగా ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి’’ అంటూ చెప్పారు బోల్డ్ నటనకు పేరొందిన శిల్పా శుక్లా చెప్పారు. -
ఎవరూ నమ్మలేరు ఈ హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే
బాలీవుడ్ సెలబ్రిటీలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా మంచి అభిమానులను కలిగి ఉన్నారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు, చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ చిత్రాలలో పనిచేశారని చాలా కొద్ది మందికి తెలుసు. మరోవైపు, పాకిస్థానీ నటలు కూడా బాలీవుడ్లో పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. పాకిస్థాన్ సూపర్ హిట్ చిత్రాలలో పనిచేసిన కొంతమంది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో మీరు తెలుసుకోండి. నేహా ధూపియా బాలీవుడ్ నటి నేహా ధూపియా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. 2002లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. తెలుగులో విలన్, పరమవీర చక్ర సినిమాల్లో కనిపించింది. ఇండియాలో ఆమెకున్న పాపులారిటీ వల్ల పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. పాకిస్థానీ చిత్రం 'కభీ ప్యార్ నా కర్ణా'లో ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించింది. ఈ చిత్రంలో పాకిస్థానీ నటీనటులు వీణా మాలిక్, మోఅమర్ రాణాతో పాటు జారా షేక్ ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఖేర్ ‘కిరణ్ ఖేర్’ అనే పేరు అందరికీ సుపరిచితమే. ఆమె 1985లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ పార్టీ నుంచి చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. 2003లో పాకిస్థాన్‌లో విడుదలైన చిత్రం 'ఖామోష్ పానీ'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటితో సహా ఈ చిత్రానికి కిరణ్ ఖేర్ అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు శ్వేతా తివారీ బాలీవుడ్ 'బిగ్ బాస్ 4' విజేత, ప్రసిద్ధ టీవీ షో 'కసౌతి జిందగీ కి' స్టార్ అయిన శ్వేతా తివారీ 2014లో విడుదలైన పాకిస్థానీ యాక్షన్ రొమాన్స్ చిత్రం 'సుల్తానాత్'లో పనిచేసింది ఈ హాట్ బ్యూటీ. ఇది పాకిస్థానీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికీ చెప్పబడుతోంది. రూ. 22 కోట్ల బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమాను నిర్మించారు. గతేడాది శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తాను నటిస్తున్న ఓ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడిస్తూ తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ ఓ వ్యాఖ్య చేశారు. శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె క్షమాపణులు కూడా కోరింది. అమృత అరోరా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా సోదరినే అమృతా అరోరా బాలీవుడ్లో నటిగా రాణించలేకపోయింది, అందుకే ఆమె హిందీ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే అమృత ఓ పాకిస్థానీ సినిమాలో పని చేసిందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అమృతా అరోరా 'గాడ్‌ఫాదర్: ది లెజెండ్ కంటిన్యూస్' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లండన్‌లో పుట్టి పెరిగిన పాకిస్తానీ ఉస్మాన్ అఫ్జల్ అనే క్రికెటర్‌తో డేటింగ్ చేసి 2009లో షకీల్ లడక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శిల్పా శుక్లా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'చక్ దే ఇండియా' సినిమాతో తనకు భారీగా గుర్తింపు దక్కింది. అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించిన శిల్పా శుక్లా పాకిస్థానీ సినిమాలో కూడా నటించింది. ఆమె పాకిస్థానీ చిత్రం 'ఖామోష్ పానీ'లో కిరోన్ ఖేర్‌తో కలిసి నటించింది. బాలీవుడ్లో చేసిన సినిమాలు తక్కువే అయినా 2014లో వచ్చిన B.A PASS సినిమాకు నేషనల్ అవార్డ్‌ను అందుకుంది. ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. -
స్త్రీ రేపిన కల్లోలం!
విధి ఆడిన వింత నాటకంలో ఓ డిగ్రీ చదివే కుర్రాడు ఏకాకిగా మారాడు. అతని జీవితంలోకి ఓ స్త్రీ ప్రవేశించింది. అంతే... అల్లకల్లోలం రేగింది. ఆ తర్వాత ఆ కుర్రాడు ఏమయ్యాడనే కథాంశంతో ‘ది రైల్వే ఆంటీ’ నవల ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘బీఏ పాస్’. ఎం.అచ్చిబాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. శిల్పా శుక్లా, షాదాబ్ కమల్ ముఖ్యతారలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘పోస్టర్స్, ట్రైలర్స్ చూడటానికి బోల్డ్‌గా ఉన్నా, మంచి కథాబలం ఉన్న సినిమా ఇది’’ అని నిర్మాత చెప్పారు. స్ట్రయిట్ తెలుగు చిత్రం అనిపించేలా ఈ చిత్రానికి సంభాషణలను రాశానని నవలా రచయిత వి.ఎస్.పి తెన్నేటి అన్నారు. నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్నకుమార్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హిందీ నుంచి తెలుగులోకి...
శిల్ప శుక్లా, షాదాబ్ కమల్, దివ్యేంద్ర భట్టాచార్య, రాజేశ్ శర్మ ప్రధాన పాత్రధారులుగా... అజయ్ చెహల్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన సినిమా ‘బి.ఏ. పాస్’. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు ఎం. అచ్చిబాబు. హైదరాబాద్‌లో అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. నిర్మాతకు అభినందనలందించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వీఎస్పీ తెన్నేటి, సంగీతం: అలోక్నంద్దాస్ గుప్తా, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్. -
బి.ఎ.పాస్ మూవీ స్టిల్స్
-
అలసిపోయా.. అందుకే చెయ్యట్లేదు: శిల్పా
అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడి నుంచి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఓ నటి మాత్రం తాను నటించలేను.. వద్దనేసింది. చక్ దే ఇండియా, ఖామోష్ పానీ లాంటి చిత్రాల్లో నటించి.. మంచి పేరు సంపాదించుకున్న శిల్పా శుక్లా కేవలం విశ్రాంతి కోసం 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సినిమాలో నటించనని తెగేసి చెప్పింది. తాను బాగా అలసిపోయానని, బెనారస్‌కు వెళ్లి అక్కడ కొంతకాలం పాటు ఉన్నానని, కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాలనే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తాను ఒప్పుకొన్న 'కఫిన్ మేకర్' చిత్రాన్ని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానని శిల్పా (32) చెప్పింది. వరుసపెట్టి సీరియస్ పాత్రలు చేసిన తర్వాత.. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తోంది. ఇప్పుడు తాను వరుసగా రెండు కామెడీ చిత్రాల్లో నటిస్తున్నానని, దాంతో ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ మారుతుందని అంటోంది. మరోవైపు లడఖ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని కూడా ఆమె ఆస్వాదించింది. అక్కడ ప్రదర్శించే ఇరానీ చిత్రాలను చూడాలని భావిస్తున్నట్లు తెలిపింది.