సినీతారలకు నేర్పేది వీరే.. | Special Story On Director Dar Gai, Shilpa Shukla, Astha Khanna | Sakshi
Sakshi News home page

సినీతారలకు నేర్పేది వీరే..

Published Tue, Feb 18 2025 2:32 PM | Last Updated on Thu, Feb 20 2025 10:39 AM

Special Story On Director Dar Gai, Shilpa Shukla, Astha Khanna

శిల్పా శుక్లా, ఆస్తా ఖన్నా, దార్‌

ఇప్పుడు ఇండియన్‌ సినిమాల్లో ఇంటిమేట్‌ విప్లవం నడుస్తోందని చెప్పొచ్చు. నిన్నా మొన్నటి దాకా శృంగార సన్నివేశాలను చూపించాల్సి వచ్చినప్పడు పూవులూ తుమ్మెదలతోనో, తామరాకులూ నీటిబొట్లతోనో సింబాలిక్‌గా మాత్రమే చూపిస్తూ దాపరికం ప్రదర్శించిన చిత్రసీమ ఒక్కసారిగా తెర తీసేసింది. హద్దే లేకుండా చెలరేగిపోతోంది. ఇప్పుడు శృంగార సన్నివేశాలు లేని సినిమాలు, వెబ్‌సిరీస్‌.. చూడాలంటే భూతద్ధంతో వెదుక్కోవాల్సిందే.

అయితే ఆ తరహా శృంగార సన్నివేశాల్లో నటించడం అంత వీజీ కాదు. తెర ముద్దుల్లో పండిపోయిన ఇమ్రాన్‌ హష్మి లాంటివారు మాత్రమే కాదు హీరోయిన్‌ను ముట్టుకోవాలంటే ఇబ్బంది పడే కొత్త నటులు ప్రతీక్‌ గాంధీ లాంటివారూ అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నారు.  ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కొత్త ప్రొఫెషనల్స్‌ సృష్టికి నాంది పలికాయి. నిజానికి హాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఉన్న   ఇంటిమసీ కో ఆర్డినేటర్లు, ఇంటిమసీ డైరెక్టర్లుగా బాలీవుడ్‌ తెరవెనుకకు వచ్చారు.

‘నేను హాలీవుడ్‌ ఇంటిమసీ కోఆర్డినేటర్‌ అమండా బ్లూమెంటల్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా. సిధ్ధాంత్, దీపికాపదుకునే నటించిన గెహ్రైయాన్‌ చిత్రంలో పుష్కలంగా శృంగార సన్నివేశాలున్నాయి.  ఆ సినిమాలో ఇంటిమేట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నాకు ఆ శిక్షణ సహాయపడింది. అలాగే సాస్, బహు ఔర్‌ ఫ్లెమింగో, క్లాస్‌  ఔర్‌ ఫోర్‌ షాట్స్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలో  కూడా  వర్క్‌ చేశా. అనుభవజ్ఞులైన నటులకైతే సన్నివేశంలోని గాఢతను అర్థం చేసుకోవడానికి కేవలం ఒక సంభాషణ సరిపోతుంది. కొత్తవాళ్లకు మాత్రం కొంత టైమ్‌ పడుతుంది అంటున్నారు మన దేశపు ప్రప్రధమ ఇంటిమసీ కో ఆర్డినేటర్‌ ఆస్తా ఖన్నా(Astha Khanna)

ఇటీవల విడుదలైన షాహిద్‌ కపూర్‌–కృతిసనన్‌ నటించిన తేరీ బాటన్‌ మే ఐసా ఉల్జా జియాలో పలు ఇంటిమేట్‌ సన్నివేశాలు ఉన్నాయి,  ఆ చిత్ర దర్శకుడు అమిత్‌ జోషి మాట్లాడుతూ‘‘చిత్రీకరణకు ముందు నటీనటుల అభ్యంతరాలు  తెలియజేయడానికి  సన్నివేశాలు ముందుగానే చర్చకు వస్తాయి.  దర్శకులుగా మా నటీనటులు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మా బాధ్యత.  నటులు కూడా  సన్నివేశాన్ని అందంగా చిత్రీకరించినంత కాలం  దర్శకుడిని విశ్వసిస్తారు. రొమాంటిక్‌ సీన్స్‌  వల్ల ఎదురయే సవాళ్లను  అధిగమించేందుకు  ఇంటిమసీ కో ఆర్డినేటర్లు ఉంటారు’’ అని చెప్పారు.

(చదవండి: 'పుష్ప2' ఫైనల్‌ కలెక్షన్స్‌.. ప్రకటించిన మేకర్స్‌)

ఇంటిమసీ డైరెక్టర్‌ని కలిగి ఉండటం అంటే యాక్షన్‌ డైరెక్టర్‌ లేదా డ్యాన్సర్‌ కొరియోగ్రాఫర్‌ని కలిగి ఉన్నట్లే, నటీనటులు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా  సురక్షితంగా ఉండేందుకు వారితో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు  కోఆర్డినేటర్‌లకు దర్శకులు తాము ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారో వివరిస్తారు.  ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు తన చేతులను ఎక్కడ ఉంచాలి వంటివి తెలిపిన తర్వాత సన్నివేశం ఖరారు అవుతుంది.  రొమాంటిక్‌ సన్నివేశాలను , స్క్రిప్ట్‌ని తెలుసుకోవడం  వర్క్‌షాప్‌లు నిర్వహించడం: స్క్రిప్ట్‌కు ఎలాంటి సన్నివేశాలు అవసరమో అర్థం చేసుకోవడం ఇంటిమసీ కోఆర్డినేటర్‌  ప్రధాన బాధ్యత.

(చదవండి: పాఠ్య పుస్తకాల్లో శంభాజీ చరిత్ర ఎందుకు లేదు?: మాజీ క్రికెటర్‌)

‘గెహ్రైయాన్‌లో శృంగారాన్ని విభిన్నంగా చూపించాలనుకున్నా.  హీరో హరోయిన్లతో మాట్లాడా. సిద్ధాంత్‌ అప్పుడే బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు.  దీపిక చాలా కాలంగా ఉంది. ఆ వ్యత్యాసం తెలీకుండా ఆన్‌–స్క్రీన్‌ కెమిస్ట్రీ చూపించే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండాలని  కోరుకున్నాను’ అని ఇంటిమసీ దర్శకుడు దార్‌(Dar Gai) చెప్పారు.

‘‘ఖామోష్‌ పానీ  బిఎ పాస్‌ వంటి నా మొదటి కొన్ని చిత్రాల సమయంలో  ఇంటిమేట్‌ సీన్స్‌ చేసేటప్పుడు కొంత స్ట్రెస్‌ కు గురైంది నిజం. ఆ సమయంలో హద్దులు దాటకుండా సరైన భావోద్వేగాలను ప్రదర్శించాలి. కో ఆర్డినేటర్ల కారణంగా   ఇబ్బంది తొలిగింది. ఆ తర్వాత ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ లో లెస్బియన్‌ క్యారెక్టర్‌ కూడా చేయగలిగాను. ఇంటిమేట్‌ సన్నివేశాల కోసం రిహార్సల్స్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉద్విగ్న వాతావరణాన్ని తేలికగా  ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి’’ అంటూ చెప్పారు బోల్డ్‌ నటనకు పేరొందిన శిల్పా శుక్లా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement