స్త్రీ రేపిన కల్లోలం! | Shilpa Shukla and Shadab Kamal at B A Pass | Sakshi
Sakshi News home page

స్త్రీ రేపిన కల్లోలం!

Published Thu, Jul 9 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

స్త్రీ రేపిన కల్లోలం!

స్త్రీ రేపిన కల్లోలం!

 విధి ఆడిన వింత నాటకంలో ఓ డిగ్రీ చదివే కుర్రాడు  ఏకాకిగా మారాడు. అతని జీవితంలోకి ఓ  స్త్రీ ప్రవేశించింది. అంతే... అల్లకల్లోలం రేగింది. ఆ తర్వాత ఆ కుర్రాడు ఏమయ్యాడనే కథాంశంతో ‘ది రైల్వే ఆంటీ’ నవల ఆధారంగా హిందీలో  తెరకెక్కిన చిత్రం ‘బీఏ పాస్’. ఎం.అచ్చిబాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. శిల్పా శుక్లా, షాదాబ్ కమల్ ముఖ్యతారలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘పోస్టర్స్, ట్రైలర్స్ చూడటానికి బోల్డ్‌గా ఉన్నా, మంచి కథాబలం ఉన్న సినిమా ఇది’’ అని నిర్మాత చెప్పారు. స్ట్రయిట్ తెలుగు చిత్రం అనిపించేలా ఈ చిత్రానికి సంభాషణలను రాశానని నవలా రచయిత వి.ఎస్.పి తెన్నేటి అన్నారు. నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్నకుమార్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement