ఆమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగువెలిగింది.
ఆమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగువెలిగింది. పలు హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి అక్కడా తనదైన ముద్రవేసింది. ఇప్పుడు గగనతలంలో రెక్కలు చాచి విహరిస్తోంది. ఆమెనే గుల్ పనాగ్. నటిగా పరిచయమై.. రాజకీయాల్లోకి అడుగిడి.. ఇప్పుడు ఏకంగా పైలట్‌గా రూపాంతరం చెందింది గుల్.
ఆమెకు ఇటీవలే పైలట్‌గా లైసెన్స్ లభించింది. దీంతో పైలట్‌గా యూనిఫామ్ ధరించి.. తన కెప్టెన్‌తో ఫొటోలు దిగి.. ఆ ఆనందాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకుంది. ఎక్కడా ఆగకుండా ముందుకు దూసుకుపోతున్న ఆమెకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.