
క్రాష్ కోర్సు చేస్తున్న హీరో
చెన్నై: విలక్షణ దర్శకుడు మణిరత్నం సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న హీరో కార్తి తన పాత్రలో ఒదిగిపోయేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఇంకా పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో అతడు పైలట్ పాత్రలో నటించనున్నాడు. ఇందుకోసం పైలట్ క్రాష్ కోర్సులో చేరి శిక్షణ పొందుతున్నాడు.
'ఫ్లైయింగ్ లో కార్తి శిక్షణ తీసుకుంటున్నాడు. పైలట్ స్థానంలో ఎలా కూర్చోవాలి, విమానం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు. రెండు మూడు వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఇది పూర్తైన తర్వాత షూటింగ్ లో పాల్గొంటార'ని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
రొమాంటిక్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్నారైగా కార్తి కనిపించనున్నాడు. స్వదేశానికి వచ్చినప్పుడు లేడీ డాక్టర్ ను ప్రేమిస్తాడు. హీరోయిన్ గా అదితిరావు ఎంపికైంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.