మణిరత్నం పైలట్... కార్తీ | karthi next movie with maniratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నం పైలట్... కార్తీ

Published Tue, Mar 22 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

మణిరత్నం పైలట్... కార్తీ

మణిరత్నం పైలట్... కార్తీ

మొట్టమొదటిసారిగా ‘ఊపిరి’తో నేరు తెలుగు సినిమాలో నటించిన తమిళ నటుడు కార్తీ. ఆ సినిమా ప్రచారం హడావిడిలో ఉన్న ఈ యువనటుడు ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ తమిళ సినిమాలో నటించనున్నారు. ఈ కొత్త సినిమా గురించి కొన్ని కబుర్లు బయటకొచ్చాయి. ఈ చిత్రంలో హీరో కార్తీ పైలట్‌గా పనిచేసే ప్రవాస భారతీయుడిగా కనిపిస్తారు. ఆ మధ్య మలయాళ సూపర్‌హిట్ ‘ప్రేమమ్’ ద్వారా తెరంగేట్రం చేసి, అందరి మనసూ దోచుకున్న తమిళ - తెలుగు అమ్మాయి సాయి పల్లవి కథానాయిక.

నిజజీవితంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఆమె ఈ సినిమాలో కూడా డాక్టర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ‘కాష్మోరా’ అనే మరో చిత్రం పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు కార్తీ. ఈ ‘కాష్మోరా’ కోసం ఆయన గుండు చేయించుకున్నారు కూడా! మళ్ళీ జుట్టు పెరగడానికి మూడు నెలలు పడుతుంది. అలా ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదకు వెళుతుందని బోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement