
'ఆప్'లో చేరిన మాజీ బ్యూటీ క్వీన్
ముంబై: బాలీవుడ్ నటి, మోడల్, మాజీ బ్యూటీ క్వీన్ గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె చండీగఢ్ లోక్సభ సాన్థం నుంచి పోటీ చేయనున్నారు. చండీగఢ్ సీటు ముందుగా దివంగత నటుడు, వ్యంగ్యకారుడు జస్పాల్ భట్టి భార్య సవిత భట్టి(53)కు కేటాయించారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వారం రోజుల తర్వాత ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. స్థానిక ఆప్ నాయకులు సహకరించడం లేదంటూ పోటీలో నిలిచేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు.
దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసుందుకు గుల్ పనాగ్కు మార్గం సుగమైంది. గుల్ పనాగ్ తండ్రి మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు. చండీగఢ్లో జన్మించిన గుల్ పనాగ్ 1999లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. మూడేళ్ల క్రితం చండీగఢ్ గురుద్వారాలో ఆమె వివాహం చేసుకున్నారు.