సాహసయాత్రలంటే ఇష్టం
సాహసయాత్రలంటే ఇష్టం
Published Sat, Jan 11 2014 11:16 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: ‘నాకు సాహసయాత్రలంటే ఇష్టం.. నా ప్రతి టూర్ ను భిన్నంగా జరుపుకునేందుకే ప్రాధాన్యమిస్తా..’ అని మాజీ అందాల సుందరి, నటి గుల్ పనగ్ పేర్కొన్నారు. ఇటీవల ఆమె సాహసయాత్రలో పాల్గొని తిరిగి వచ్చారు. దాని గురిం చి వివరిస్తూ.. ‘ ఇది చాలా సాహసోపేత ప్రయాణం. చాలా ఎంజాయ్ చేశాను..’ అని చెప్పారు. ఈ యాత్రలో ఆమెతోపాటు ఆమె భర్త రిషి అట్టారీ, మరికొందరు స్నేహితులు పాల్గొన్నారు. ‘ మేం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్ లోయకు సాహసయాత్ర చేశాం. ఆరుగురం మూడు వాహనాలపై ఐదు రోజుల పాటు ప్రయాణించాం. చాలా ఆనందించాం..’ అని ఆమె తెలిపారు. సాహసయాత్రలకు సరిపడా కారు గాని, ఇతర ఏ వాహనం కాని దొరక్కపోవడంతో కొన్ని నెలల కిందట తన మహీంద్ర స్కార్పియోను ఇటువంటి అవసరాలకు సరిపడే విధంగా మార్పు లు చేయించుకున్నట్లు
ఆమె తెలిపారు.‘సాహసయాత్రలు చేయడం అలవాటుగా మారిన తరుణంలో ఏ ఒక్క వాహనం నా అవసరాలకు సరిపడా కనిపించలేదు. అందుకే నా ప్రయాణాలకు అనుగుణంగా ఒక వాహనాన్ని రూపొందించుకున్నాను..’ అని ఆమె వివరించారు. అయితే అది అంత సుల భంగా జరగలేదని ఆమె చెప్పా రు. ‘యాత్రల కోసం రూఫ్ టాప్ టెంట్, ఎలక్ట్రిక్ వించ్, అధునాతనమైన జాక్, అదనపు లైట్లు, డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ తదితర అదనపు హంగులను నా వాహనానికి అమర్చుకోవడానికి కారు ఖరీదులో సగం సొమ్ము వెచ్చించాల్సి వచ్చింది..’ అని గుల్ తెలిపారు. కాగా నటిగా, సాహసయాత్రికురాలిగా బిజీగా ఉంటున్న గిల్ సామాజిక బాధ్యతలోనూ పాలుపంచుకోవడం విశేషం. ఆమె బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన పెంచే పింకథాన్‌లోనూ, పొగాకు వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొంటోంది.
Advertisement