ఫ్లాప్ సినిమాల ప్రభావం లేదు
ఫ్లాప్ సినిమాల ప్రభావం లేదు
Published Thu, Oct 17 2013 1:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ : బాలీవుడ్‌లో తనంతట తానుగా ఎదిగానని, కొన్ని ఫ్లాప్ సినిమాల ప్రభావం తన కెరియర్‌పై ప్రభావం చూపలేదని కంగనా రనౌత్ చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగన ‘గ్యాంగ్‌స్టర్’, ‘ఫ్యాషన్’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’, ‘రాజ్-2’, ‘తనూ వెడ్స్ మ ను’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ ముద్దుగుమ్మ కెరియర్‌లో ‘కైట్స్, ‘నో ప్రాబ్ల మ్’, ‘డబుల్ ధమాకా’, ‘రాస్కల్స్’ వంటి ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నా యి.
తాను స్వతంత్ర మహిళనని, తన ఇంటికి తానే యజ మానురాలినని, అయినంత మాత్రాన అన్ని సమయాల్లో తాను కోరుకున్న పని దొరకాలంటే సాధ్యం కాదంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది. పనిలేకుండా ఇంట్లో కూర్చోవడం ఇందుకు పరిష్కారం కాదని పేర్కొంది. సినిమాల్లో నటించడం ద్వారా సమస్యల నుంచి బయటపడ్డానని, నిర్మాతలు కూడా తన వల్ల నష్టపోలేదని తెలిపింది. తాను నటించిన కొన్ని చిత్రాలు విజయవంతం కానంత మాత్రాన కన కెరియర్‌కు నష్టం జరగలేదని పేర్కొంది.
తాను ఆ ఫ్లాప్ చిత్రాల్లో నటించకపోయి ఉంటే ఓ ప్రాంతీయ చిత్రంలో ఐటమ్ గార్ల్‌గా మిగిలిపోవాల్సి వచ్చేదని తెలిపింది. బాలీవుడ్‌లో తాను నిలదొక్కుకున్న తరువాత తన కుటుం బం కూడా తన పనితీరుపై సంతృప్తితో ఉన్నారని చెప్పింది. సినిమాల్లో ‘రాణి’లా కనిపించడం తన చెల్లెళ్లకు ఇష్టమ ని, సైన్స్ ఫిక్షన్‌లో నటించడం తన సోదరులకు ఇష్టమని తెలి పింది. రజ్జో వంటి సంప్రదాయ పాత్రలను తన తల్లిదండ్రు లు ఇష్టపడతారని చెప్పింది. తన తదుపరి చిత్రాలైన ‘క్వీన్’, ‘రజ్జో’, ‘రివాల్వర్ రాణి’ స్త్రీ ప్రాధాన్యతగలవని తెలిపింది.
Advertisement
Advertisement