మగవాళ్ల పెర్‌ఫ్యూమ్స్ అంటేనే ఆలియాకు ఇష్టం! | males to perfumes likes aliabaht | Sakshi
Sakshi News home page

మగవాళ్ల పెర్‌ఫ్యూమ్స్ అంటేనే ఆలియాకు ఇష్టం!

Published Fri, Jul 24 2015 11:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మగవాళ్ల పెర్‌ఫ్యూమ్స్ అంటేనే ఆలియాకు ఇష్టం! - Sakshi

మగవాళ్ల పెర్‌ఫ్యూమ్స్ అంటేనే ఆలియాకు ఇష్టం!

వెండితెరపై దూసుకొచ్చిన మెరుపు తీగ ఆలియా భట్ ఇప్పుడు బాలీవుడ్‌లో ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’. కుర్రకారుకి ఈ బ్యూటీ అంటే తెగ క్రేజ్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ద్వారా కథానాయికగా పరిచయమై, థర్టీ ప్లస్ తారల గుండెల్లో గుబులు పుట్టే స్థాయిలో ఆలియా హాట్ కేక్ అయిపోయారు. ఇక, తన వయసున్న తారలకు కూడా ఈవిడగారు గట్టి పోటీనే ఇస్తున్నారు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్న ఆలియ చేస్తున్న సినిమాల గురించి అందరికీ తెలుసు. కానీ, వ్యక్తిగతంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
 
 ***      ఆలియా ముద్దు పేరు భలే తమాషాగా ఉంటుంది. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉన్న ఆలియాని వాళ్ల అమ్మా నాన్న సోనీ, మహేశ్‌భట్ తదితరులు ముద్దుగా ‘ఆలూ’ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇంట్లో ఆ పేరుతోనే పిలుస్తుంటారు.
 ***      పెయింటింగ్ అంటే ఆలియాకి చాలా ఇష్టం. చిన్నప్పుడు చాక్‌పీస్‌లతో పలక మీద... పెన్సిళ్లు, పెన్నులతో పేపర్ల మీద బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న ఆలియా, ఇప్పటికీ ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటారు.
 ***      ఆలియా ఆల్‌టైమ్ ఫేవరెట్ షో ఏంటంటే ‘టామ్ అండ్ జెర్రీ’.
 ***      ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కి ఆలియాని కరణ్ జోహార్ కథానాయికగా ఎంపిక చేసినప్పుడు తనకు పదిహేడేళ్లు. అప్పుడు ఆలియా బరువు 67 కేజీలు. కరణ్ కోరిన మీదట పదహారు కిలోలు తగ్గారామె.
 ***      ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఆలియాకి చాలా ఇష్టం. వాటివల్ల బరువు పెరుగుతావని ఫ్రెండ్స్ అన్నప్పటికీ, ‘డోంట్ కేర్.. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని త్యాగం చేయలేను’ అంటారట. అలాగే, శీతల పానీయాలంటే ఆలియాకు మక్కువ ఎక్కువ. చాక్లెట్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం.
 ***      పెర్‌ఫ్యూమ్స్ అంటే ఆలియాకి చాలా ఇష్టం. అయితే, విచిత్రం ఏంటంటే.. మగవాళ్లు వాడేవి ఇష్టమట. అందుకని, దాదాపు మగవాళ్ల పెర్‌ఫ్యూమ్స్‌నే వాడుతుంటారు.
 ***      పార్టీలంటే తెగ ఇష్టపడే ఆలియాకి చిన్నప్పుడు మాత్రం అవి అస్సలు ఇష్టం ఉండేవి కాదు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా గడిపేదట.
 ***      ఆలియాకు ఇండియాలో నచ్చిన ప్రదేశం హిమాచల్ ప్రదేశ్.
 ***      ఆలియా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ, అది కూడా పెద్దల అనుమతితోనే.
 ***      సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే ‘వర్క్’ అని చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement