నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫస్ట్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్‌గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్‌కుమార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment