Ghost Movie Update: Nagarjuna As A Killing Machine, First Visual Video Released - Sakshi
Sakshi News home page

Nagarjuna The Ghost Movie: 'కిల్లింగ్‌ మేషిన్‌' పేరుతో నాగార్జున విజువల్‌ ట్రీట్‌..

Published Sat, Jul 9 2022 6:13 PM | Last Updated on Sat, Jul 9 2022 6:59 PM

Nagarjuna As A Killing Machine From The Ghost Movie - Sakshi

Nagarjuna As A Killing Machine From The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఘోస్ట్‌'. ఈ చిత్రానికి 'గరుడవేగ' ఫేమ్‌ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. నాగ్‌, సోనాల్‌ ఇద్దరూ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్స్‌ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్‌ పనాగ్‌ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ విజువల్‌ ట్రీట్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. 

'కిల్లింగ్‌ మేషిన్' పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ మూవీని నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్‌ 5న ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement