Nagarjuna Ghost Movie: Car Flew At A Height Of 150 Feet In Shooting Spot, Viral - Sakshi
Sakshi News home page

Nagarjuna-Ghost: సీన్‌ అదుర్స్‌.. 150 అడుగుల ఎత్తులో ఎగిరిపడిన కారు, ఏం జరిగింది?

Published Tue, Apr 5 2022 1:57 PM | Last Updated on Tue, Apr 5 2022 4:54 PM

Ghost Movie: Car Flew At A Height Of 150 Feet In Shooting Spot - Sakshi

తమిళనాడులోని కూనూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తుటుర్మట్టం ప్రాంతంలో ఓ కారు 150 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. భారీ శబ్దంతో దొర్లుకుంటూ పక్కనున్న తేయాకు తోటలో పడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న కూలీలు హడలిపోయారు. భయంతో పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా అసలు విషయం తెలుసుకొని షాక్‌కు గురయ్యారు.

అసలు ఏం జరిగిదంటే.. కింగ్‌ నాగార్జున హీరోగా ‘ఘోస్ట్‌’అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ తమిళనాడులోని కూనూర్‌లో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్‌ సీన్‌కి సంబంధించి షూటింగ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కారుని గాల్లోకి లేపారు. అది 150 ఎత్తుకు లేచి పక్కనే ఉన్న తేయాకు తోటలో పడిపోయింది. ఇది నిజమైన ప్రమాదమే అనుకొని అక్కడున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. అంతేకాదు వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. పోలీసులు విచారణ చేయగా.. అసలు విషయం భయటపడింది. దీంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఘోస్ట్‌ సినిమా విషయానికొస్తే.. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ,  నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇటీవల  దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ సినిమాలో హైలైట్‌గా ఉండనున్నాయట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement