కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. తాజాగా భారత అగ్రదర్శకుడు రాజమౌళి దీనిని విడుదల చేశారు. శివన్న నటించిన ఘోస్ట్ ట్రైలర్ అద్భుతంగా ఉందని ఆయన కితాబు ఇచ్చారు.'బీర్బల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజు తన సందేశ్ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
(ఇదీ చదవండి: ఆ కారణంతో నాన్న మద్యానికి బానిసయ్యారు: స్టార్ హీరోయిన్)
హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్,మొదటి పోస్టర్‌తోనే శివన్న భారీ అంచనాలు పెంచేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆయన విధ్వంసమే క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని ఘోస్ట్ మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో శివరాజ్‌కుమార్ నటన, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇందులోని డైలాగ్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కొన్నీ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా డైరెక్టర్ క్రియేట్ చేశాడు. యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం.. ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే.. అవి చేసే నష్టాలే ఎక్కువ అనే డైలాగ్‌తో పాటు సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండవచ్చు కానీ.. విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు అంటూ.. శివరాజ్ కుమార్ చెప్పే డైలాగ్ అందరికీ బాగా రిజిస్టర్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment