
టాలీవుడ్ హీరో అర్జున్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయనున్నారు. సీతా పయనం పేరుతో మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ చివరిసారిగా ప్రేమ బరహా అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కాగా.. యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో నటించారు. కన్నడకు చెందిన అర్జున్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో దర్శకత్వం వహించిన సేవాగన్ (1992), జై హింద్ (1994),తాయిన్ మణికోడి (1998) లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. హీరోగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment