సెప్టెంబర్‌లో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ | Bhaskar Oru Rascal is getting ready for release in September. | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

Published Sat, Jul 15 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

సెప్టెంబర్‌లో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

సెప్టెంబర్‌లో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌

తమిళసినిమా:  సెప్టెంబర్‌ నెలలో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాలీవుడ్‌లో నయనతార, మమ్ముట్టి జంటగా నటించిన చిత్రం భాస్కర్‌ ది రాస్కెల్‌. సిద్ధిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.

అయితే ఆయన 2.ఓ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల భాస్కర్‌ ది రాస్కెల్‌ చేయలేకపోయారన్న ప్రచారం జరిగింది. మొత్తం మీద ఆ పాత్రలో నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు.ఆయనకు జంట గా నటి అమలాపాల్‌ నటిస్తున్నారు. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్‌ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వార బాల నటిగా రంగప్రవేశం చేసిన నటి మీనా కూతురు నైనిక కీలక పాత్రను, బాలీవుడ్‌ నటుడు అఫ్తాబ్‌శివ్‌దసాని ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

మలయాళం చిత్రాన్ని తెరకెక్కించిన సిద్ధిక్‌నే తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో విజయ్,సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్, విజయకాంత్, ప్రభుదేవా నటించిన ఎంగళ్‌ అన్నా, విజయ్, అసిన్‌ జంటగా నటించిన కావలన్‌ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ సిద్ధిక్‌ దర్శకత్వం వహిస్తున్న నాలుగవ తమిళ చిత్రం అవుతుంది.  ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయ్‌ఉళగనాథన్‌ చాయాగ్రహణం, అమ్రేశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement