Aravindaswamy
-
టార్గెట్ 10
డైట్ ప్లాన్‌ని చేంజ్ చేశారు హీరో అరవింద స్వామి. మరింత స్లిమ్ కావడం కోసం కాదు. బరువు పెరగడానికి. ఎందుకంటే ఆయన తాజా చిత్రం ‘కల్లాపార్ట్’ కోసం. రాజపాండి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించనున్నారు. ‘‘ఒక కారణం కోసం బరుపు పెరగడం భలేగా ఉంటుంది. నా నెక్ట్స్ చిత్రం కోసం పది కేజీలు బరువు పెరుగుతున్నాను’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమాలో రెజీనా డ్యాన్సర్‌గా కనిపిస్తారు. ‘‘నా క్యారెక్టర్ కోసం ప్రస్తుతం డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నాను. ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉంటాయి. ఓ చైల్డ్ యాక్టర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. రాజపాండి మంచి టెక్నికల్ క్వాలిటీ ఉన్న దర్శకుడు. ఆయన స్టోరీ చెప్పిన విధానం నాకు నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు రెజీనా. -
నా అందానికి అదే కారణం
నా అందానికి కారణం అదేనంటోంది నటి శ్రియ. కథానాయకిగా 15 వసంతాలను టచ్ చేసిన ఈ ఉత్తరాది బ్యూటీ ఇప్పటికీ తన స్థానాన్ని పదిలం పరుచుకుంటూ వస్తోంది. ఇటీవలే రష్యాకు చెందిన తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ ఆండ్రును నిడారంబరంగా పెళ్లి చేసుకున్న శ్రియ నటనను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ అమ్మడు అరవిందస్వామితో కలిసి నటించిన నరకాసురన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శ్రియతో చిన్న భేటీ. ప్ర: నరకాసురన్ ఏ తరహా చిత్రం? అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? జ: నిజం చెప్పాలంటే ఇది దర్శకుడి చిత్రం. నాకు చిత్రం చూపించారు. చూశాక ఆశ్చర్యపోయాను. ఒక పజిల్‌ను ముక్కలు ముక్కలుగా పడేసి వాటిని మళ్లీ కరెక్ట్‌గా పేరుస్తారు. అలాంటి ఒక పజిల్ లాంటిదే ఈ చిత్ర కథ. పజిల్‌ను కరెక్ట్‌గా పెట్టకుంటే పరిపూర్ణ చిత్రం కాలేదు. అలానే ఇందులోని ప్రతి పాత్ర ఉంటుంది. నరకాసురన్ అనే పజిల్ ఆటలో నా పాత్రనే కాదు ఏ పాత్రను విడదీసి చెప్పలేం. అంత చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన చిత్రం ఇది. చిత్ర కథ మధ్య నుంచి మొదలైనా తొలి ఐదు నిమిషాల చిత్రాన్ని చూడడం మిస్ అయినా చిత్రం అర్థం కాదు. అంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను దర్శకుడు నరేన్ రాసుకున్నారు. నా పాత్రతోనే కథ ముఖ్య మలుపు తిరుగుతుంది. అరవిందస్వామి ధృవ అనే పాత్రలో నటించారు. నేను ఆయన భార్యగా సీత అనే పాత్రలో నటించాను. చాలా అమాయకపు అమ్మాయిగా, ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని వినోదభరిత పాత్రలో నటించాను. అండర్‌ప్లే చేసి నటించే అవకాశం నాకీ చిత్రంలో లభించింది. తెలుగు చిత్రం మనం తరువాత అంతగా ప్రేమించి నటించిన చిత్రం నరకాసురన్. ప్ర: చిత్ర కథ గురించి? జ: కథ గురించి చెప్పడం కుదరదు గానీ, కాన్సెప్ట్ చెబుతాను. నరకాసురన్ ఊరు పేరు పేరు కాదు. ఊర్లో పలు ప్రాంతాలు ఉంటాయి. అందులో ఒక ప్రాంతం గురించి ప్రజల్లో ఉండే నమ్మకం. అది మత పరంగా చూసే వారు కావచ్చు, మర్మంతో కూడిన ప్రాంతంగా మరికొందరు చూడవచ్చు. అలాంటి పలువురు దృష్టి కోణాలను చిత్రాన్ని దర్శకుడు చక్కగా బ్యాలెన్స్ చేశారు. ప్ర: అరవిందస్వామితో కలిసి నటించిన అనుభవం గురించి? జ: ఆయనతో నటించడం చాలా సులభం అనిపించింది. అరవిందస్వామి నటించిన పలు చిత్రాలను నేను చూశాను. ఈ చిత్రంలోని కథా పాత్రకు నేను నప్పుతానని భావించింది అరవిందస్వామినే. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేయడానికి ఈ చిత్రం కోసం శ్రమించి నటించాను. ఆయనతో కలిసి నటించిన సన్నివేశాల్లో నేను ఇంకాస్త అందంగా కనిపించాననే భావన చిత్రం చూసిన వారికి కలుగుతుంది. ప్ర: గత 15 ఏళ్లుగా అదే రూపం.అదే అందం. ఇది శ్రియకు మాత్రమే ఏలా సాధ్యం? జ: ఎప్పుడూ నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటాను. నిత్యం శారీరక వ్యాయామాలు తప్పనిసరి. ఇక డాన్స్‌పై నాకున్న అమిత ప్రేమ నా అందానికి ప్రధాన కారణం అనుకుంటాను. మంచి కథక్ డాన్సర్ అని నన్ను నేను గౌరవించుకుంటాను. నిత్యం చేసే ధ్యానం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వీటిలో పాటు ఎక్కువగా పయనం చేస్తాను. పయనంలో కొత్త కొత్త వ్యక్తులను కలుసుకుంటాను. వారితో మాట్లాడతాను. ఇది మనసును, ఆలోచనలను ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. -
అర్థం కాని అందం
చూడచక్కగా ఉంటారీ బ్యూటీ. కేవలం బ్యూటీ అని పొరబడితే మేకప్ కిట్టులో కాలేసినట్టే. బ్యూటీ విత్ బ్రెయిన్. వేసే ప్రతీ అడుగు చాలా తెలివిగా వేస్తారట. అసలు అర్థం కాని ఒక వెరైటీ క్యారెక్టర్. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే పోషిస్తున్నారు రెజీనా. తమిళంలో రెజీనా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసమే ఈ డిఫరెంట్ రోల్. అరవింద స్వామితో దర్శకుడు రాజా పాండీ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రెజీనా. కేవలం పాటల్లో వచ్చి కాలు కదిపే విధంగా కాకుండా కథను మలుపు తిప్పేలా రెజీనా పాత్రను దర్శకుడు రూపొందించారట. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రెజీనా వెంటనే ఈ పాత్రను ఒప్పుకున్నారట. ఈ చిత్రంలో రెజీనా రోల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అరవింద స్వామి పక్కన కొత్త జోడీ ఉండాలనుకున్నాం. ఫిట్‌గా కూడా ఉండాలనుకున్నాం. రెజీనా పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. 70 శాతం షూటింగ్ చెన్నైలో జరపనున్నాం’’ అని పేర్కొన్నారు. -
నరకాసురన్‌లో ఆద్మిక
తమిళసినిమా: అరవిందస్వామి చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయ్యి విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. తనీఒరువన్ చిత్రంలో ఆయన స్టైలిష్ విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. కాగా తాజాగా మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అప్పటికే చతురంగవేట్టై–2 చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదే విధంగా నరకాసురన్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీన్ని ఇంతకు ముందు దృవంగళ్ 16 చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అరవిందస్వామితో పాటు నటి శ్రియ, సందీప్‌కిషన్ నటించడానికి ఎంపికయ్యారు. తాజాగా యువ నటి ఆద్మికను ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్ నరేన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆద్మిక వీసైమురుక్కు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి అన్నది తెలిసిందే. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ అమ్మడికిప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయట. అందులో ఒకటి నరకాసురన్. ఈ చిత్ర ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయట. సెప్టెంబర్ 16న చిత్ర షూటింగ్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు, అక్కడే 40 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
సెప్టెంబర్‌లో భాస్కర్ ఒరు రాస్కెల్
తమిళసినిమా: సెప్టెంబర్ నెలలో భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాలీవుడ్‌లో నయనతార, మమ్ముట్టి జంటగా నటించిన చిత్రం భాస్కర్ ది రాస్కెల్. సిద్ధిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఆయన 2.ఓ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల భాస్కర్ ది రాస్కెల్ చేయలేకపోయారన్న ప్రచారం జరిగింది. మొత్తం మీద ఆ పాత్రలో నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు.ఆయనకు జంట గా నటి అమలాపాల్ నటిస్తున్నారు. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ నటిస్తున్నారు. తెరి చిత్రం ద్వార బాల నటిగా రంగప్రవేశం చేసిన నటి మీనా కూతురు నైనిక కీలక పాత్రను, బాలీవుడ్ నటుడు అఫ్తాబ్శివ్దసాని ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. మలయాళం చిత్రాన్ని తెరకెక్కించిన సిద్ధిక్‌నే తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు తమిళంలో విజయ్,సూర్య కలిసి నటించిన ఫ్రెండ్స్, విజయకాంత్, ప్రభుదేవా నటించిన ఎంగళ్ అన్నా, విజయ్, అసిన్ జంటగా నటించిన కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. భాస్కర్ ఒరు రాస్కెల్ సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న నాలుగవ తమిళ చిత్రం అవుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయ్ఉళగనాథన్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కూతురు ఖుషీ.. అమ్మ బేజార్
కూతురు ఖుషీ అమ్మ బేజార్. అసలు అర్థం కాలేదు కదూ ‘అయితే రండి చూద్దాం. సంచలన నటీమణుల్లో త్రిష ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. నటిగా తెరంగేట్రం చేసి దాదాపు దశాబ్దన్నర అయ్యింది. అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.ఆమె జోరు కొరవడలేదు.ఇంకా చెప్పాలంటే మరింత మార్కెట్‌ను పెంచుకున్నారనే చెప్పాలి.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న వేళ్ల మీద లెక్కపెట్టే హీరోయిన్లలో ఈ చెన్నై చిన్నది ఒకరు. విశేషం ఏమిటంటే త్రిష ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేయడం. తాను నటిస్తున్న మోహిని, గర్జన, చతురంగవేట్టై 2 చిత్రాలను పూర్తి చేసినట్లు తనే స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వీటిలో చదరంగవేట్టై 2 చిత్రంలో అరవిందస్వామికి దీటైన పాత్రలో నటించగా గర్జన, మోహిని తన పాత్ర చుట్టూ తిరిగే కథా చిత్రాలు కావడం విశేషం. ఇకపోతే గర్జన చిత్రంలో ఫైట్స్,యాక్షన్ సన్నివేశాలు అంటూ ఇరగదీశారట.ఇందులో చాలా రిస్కీ సన్నివేశాలను చిత్ర యూనిట్ డూప్‌ను పెట్టి చెద్దామని చెప్పినా వద్దని తానే నటించారట.అలాంటి సన్నివేశాల్లో నటించిన త్రిష ఖుషీగానే ఉన్నారట. ఆమె తల్లి ఉమాకృష్ణన్ మాత్రం కూతురి డేరింగ్ చూసి బేజార్ అయ్యారట. మొత్తం మీద ఏక కాలంలో మూడు చిత్రాలను పూర్తి చేసిన త్రిష నటనకు చిన్న బ్రేక్ ఇచ్చి తల్లితో పాటు సమ్మర్ టూర్‌గా రోమ్ దేశాలు చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతికి జంటగా నటించే షూటింగ్లో పాల్గొంటారట. అయితే ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. దీంతో అర్జెంట్‌గా విజయం చాలా అవసరం.పైన చెప్పిన చిత్రాలపై త్రిష చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.