టార్గెట్‌ 10 | aravind swamy diet plan for next movie | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 10

Published Sat, Oct 6 2018 5:47 AM | Last Updated on Sat, Oct 6 2018 5:47 AM

aravind swamy diet plan for next movie - Sakshi

అరవింద స్వామి

డైట్‌ ప్లాన్‌ని చేంజ్‌ చేశారు హీరో అరవింద స్వామి. మరింత స్లిమ్‌ కావడం కోసం కాదు. బరువు పెరగడానికి. ఎందుకంటే ఆయన తాజా చిత్రం ‘కల్లాపార్ట్‌’ కోసం. రాజపాండి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో కథానాయికగా రెజీనా నటించనున్నారు. ‘‘ఒక కారణం కోసం బరుపు పెరగడం భలేగా ఉంటుంది. నా నెక్ట్స్‌ చిత్రం కోసం పది కేజీలు బరువు పెరుగుతున్నాను’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి.

థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాలో రెజీనా డ్యాన్సర్‌గా కనిపిస్తారు. ‘‘నా క్యారెక్టర్‌ కోసం ప్రస్తుతం డ్యాన్స్‌ క్లాసులకు వెళ్తున్నాను. ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్లు ఉంటాయి. ఓ చైల్డ్‌ యాక్టర్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. రాజపాండి మంచి టెక్నికల్‌ క్వాలిటీ ఉన్న దర్శకుడు. ఆయన స్టోరీ చెప్పిన విధానం నాకు నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు రెజీనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement