నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రష్మిక ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. తన క్యూట్‌లుక్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తున్న రష్మిక అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ భామ అందానికి గల కారణం ఏముంటుంది? రోజూ రష్మిక అసలు ఏం తింటుంది అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు.
అలాంటి వారికోసమే రష్మిక స్వయంగా తన డైట్ ప్లాన్‌ను రివీల్ చేసింది. షూటింగ్‌లో ఉన్నప్పుడు నేను ఏం తింటానంటే.. అంటూ వీడియోను షేర్‌చేసింది. ఈ వీడియోలో షూటింగ్ సెట్స్‌లో ఉన్నట్లు కనిపించిన రష్మిక మొదట కోల్డ్ కాఫీ, సెలరీ జ్యూస్‌ని తాగింది. తర్వాత భోజనం బాదం వెన్నతో కూడిన ఓట్స్, సాయంత్రం టీని ఆస్వాదించింది. చికెన్, బంగాళదుంపలను రాత్రి భోజనంలో తీసుకుంది.
The happiest when I get my food! 😋🍲🤍
— Rashmika Mandanna (@iamRashmika) April 29, 2022
Check out what I eat on a shoot day on my YT now! https://t.co/wNYel27T6l
Comments
Please login to add a commentAdd a comment