Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్‌ తాగుతా' | Tamannah Bhatia Revealed She Is Suffering With Health Issues | Sakshi
Sakshi News home page

Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్‌ తాగుతా'

Published Tue, Sep 21 2021 4:25 PM | Last Updated on Tue, Sep 21 2021 6:23 PM

Tamannah Bhatia Revealed She Is Suffering With Health Issues - Sakshi

Tamannaah Reveals About Her Health Issue: 'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. విభిన్న పాత్రలతో ఎంటర్‌టైన్‌ చేస్తున్న తమన్నా ఇటీవలె మాస్ట్రో సినిమాలో విలన్‌ రోల్‌తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా..'కొన్నాళ్లుగా తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది.

'నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్‌ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నాను.దాన్నుంచి బయటపడేందుకు నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నా. ఫ్రై ఫుడ్‌ ఐటమ్స్‌ పూర్తిగా మానేశా. ప్రస్తుతం సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నా. అంతేకాకుండా క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలం(Noni juice)ను తీసుకుంటా. ఈ జ్యూస్‌ నాకున్న సమస్య నుంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపింది.


అంతేకాకుండా ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు,పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్‌లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది. ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్‌ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం తమన్నా బయటపెట్టలేదు. 

చదవండి: మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్‌ గాంధీ కూతురు
Bigg Boss Telugu 5: 'అర్థపావు భాగ్యం'.. ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement