అర్థం కాని అందం | rezina romance with aravind swamy | Sakshi
Sakshi News home page

అర్థం కాని అందం

Published Sat, Aug 25 2018 5:13 AM | Last Updated on Sat, Aug 25 2018 5:13 AM

rezina romance with aravind swamy - Sakshi

రెజీనా

చూడచక్కగా ఉంటారీ బ్యూటీ. కేవలం బ్యూటీ అని పొరబడితే మేకప్‌ కిట్టులో కాలేసినట్టే. బ్యూటీ విత్‌ బ్రెయిన్‌. వేసే ప్రతీ అడుగు చాలా తెలివిగా వేస్తారట. అసలు అర్థం కాని ఒక వెరైటీ క్యారెక్టర్‌. ఇలాంటి డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టరే పోషిస్తున్నారు రెజీనా. తమిళంలో రెజీనా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ కోసమే ఈ డిఫరెంట్‌ రోల్‌. అరవింద స్వామితో దర్శకుడు రాజా పాండీ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్‌ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్నారు రెజీనా.

కేవలం పాటల్లో వచ్చి కాలు కదిపే విధంగా కాకుండా కథను మలుపు తిప్పేలా రెజీనా పాత్రను దర్శకుడు రూపొందించారట. నటనకు ఎక్కువ స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో రెజీనా వెంటనే ఈ పాత్రను ఒప్పుకున్నారట. ఈ చిత్రంలో రెజీనా రోల్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అరవింద స్వామి పక్కన కొత్త జోడీ ఉండాలనుకున్నాం. ఫిట్‌గా కూడా ఉండాలనుకున్నాం. రెజీనా పర్ఫెక్ట్‌ అని ఫిక్స్‌ అయ్యాం. 70 శాతం షూటింగ్‌ చెన్నైలో జరపనున్నాం’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement