Pandi Raja
-
అర్థం కాని అందం
చూడచక్కగా ఉంటారీ బ్యూటీ. కేవలం బ్యూటీ అని పొరబడితే మేకప్ కిట్టులో కాలేసినట్టే. బ్యూటీ విత్ బ్రెయిన్. వేసే ప్రతీ అడుగు చాలా తెలివిగా వేస్తారట. అసలు అర్థం కాని ఒక వెరైటీ క్యారెక్టర్. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే పోషిస్తున్నారు రెజీనా. తమిళంలో రెజీనా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసమే ఈ డిఫరెంట్ రోల్. అరవింద స్వామితో దర్శకుడు రాజా పాండీ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రెజీనా. కేవలం పాటల్లో వచ్చి కాలు కదిపే విధంగా కాకుండా కథను మలుపు తిప్పేలా రెజీనా పాత్రను దర్శకుడు రూపొందించారట. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రెజీనా వెంటనే ఈ పాత్రను ఒప్పుకున్నారట. ఈ చిత్రంలో రెజీనా రోల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అరవింద స్వామి పక్కన కొత్త జోడీ ఉండాలనుకున్నాం. ఫిట్‌గా కూడా ఉండాలనుకున్నాం. రెజీనా పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. 70 శాతం షూటింగ్ చెన్నైలో జరపనున్నాం’’ అని పేర్కొన్నారు. -
శింబుతో కౌగిలికి నో
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏడడుగులు నడవాల్సిన జంట శింబు, నయనతార. ఆ బంధం బెడిసి కొట్టడంతో ఆ తరువాత ఒకరినొకరు ఎదురుపడినా మాట్లాడుకోలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. పాండిరాజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ నెల 5న శింబు, నయనతార మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో నటి నయనతార కొన్ని షరతులను విధించిందట. అవేంటంటే శింబుతో ప్రేమ సన్నివేశాల్లో, కౌగిలింతలు లాంటి మూమెంట్స్ ఉండరాదు అంటూ తన షరతుల పట్టికను దర్శకుడి ముందుంచిందట. ఇందుకు కారణం ఆమె ఇంతకు ముందు శింబు సరసన వల్లవన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో శింబుతో లిప్‌లాక్ సన్నివేశాల్లో ఇద్దరు జీవించారు. అయితే ఆ దృశ్యాలను ప్రచారానికి వాడుకోవడంతో కలకలం రేగింది. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నయనతార తాజా చిత్రానికి ఇలాంటి నిబంధనలు విధించిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.