శింబుతో కౌగిలికి నో | No Hug for Simbu, nayanatara Condition | Sakshi
Sakshi News home page

శింబుతో కౌగిలికి నో

Published Tue, Dec 3 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

శింబుతో కౌగిలికి నో

శింబుతో కౌగిలికి నో

సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏడడుగులు నడవాల్సిన జంట శింబు, నయనతార. ఆ బంధం బెడిసి కొట్టడంతో ఆ తరువాత ఒకరినొకరు ఎదురుపడినా మాట్లాడుకోలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. పాండిరాజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ నెల 5న శింబు, నయనతార మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో నటి నయనతార కొన్ని షరతులను విధించిందట.
 
అవేంటంటే శింబుతో ప్రేమ సన్నివేశాల్లో, కౌగిలింతలు లాంటి మూమెంట్స్ ఉండరాదు అంటూ తన షరతుల పట్టికను దర్శకుడి ముందుంచిందట. ఇందుకు కారణం ఆమె ఇంతకు ముందు శింబు సరసన వల్లవన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో శింబుతో లిప్‌లాక్ సన్నివేశాల్లో ఇద్దరు జీవించారు. అయితే ఆ దృశ్యాలను ప్రచారానికి వాడుకోవడంతో కలకలం రేగింది. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే నయనతార తాజా చిత్రానికి ఇలాంటి నిబంధనలు విధించిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement