శింబుతో స్టెప్పులేయను | nayanatara told i am not dance with simbu | Sakshi
Sakshi News home page

శింబుతో స్టెప్పులేయను

Published Tue, Sep 1 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

శింబుతో స్టెప్పులేయను

శింబుతో స్టెప్పులేయను

నటుడు శింబుతో సాంగ్‌లో నటించేది లేదు అని ఖరాఖండీగా చెప్పేశారు నటి నయనతార. సాంగ్ ఏమిటి? చెయ్యననడం ఏమిటి? మళ్లీ ఈ గొడవేమిటనేగా మీ కుతూహలం. మాజీ ప్రియుడు శింబుతో కలిసి నటి నయనతార ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో మాజీ ప్రియురాలు హన్సిక వాలు చిత్రానికి పెట్టి మడత పేచీనే ఇదు నమ్మ ఆళు చిత్రానికి నయనతార పెట్టారు. అర్థం కాలేదూ... వాలు చిత్రం షూటింగ్ సమయంలోనే శింబు, హన్సిక మధ్య ప్రేమ తొలకరించడం, అది పెళ్లికి దారి తీయడం ఆ తర్వాత కథ కంచికి చేరడం జరిగిపోయిన విషయం విదితమే. అప్పటికి వాలు చిత్రంలో ఇక పాట చిత్రీకరణ బాలెన్స్ ఉండడం అది చెయ్యడానికి హన్సిక ససేమిరా అనడం తెలిసిందే.

ఆ తరువాత ఫిర్యాదులు, చర్చలు, సర్దుబాటు అనంతరం ఎట్టకేలకు శింబుతో ఆ పాటలో నటించి వాలు చిత్ర విడుదలకు హన్సిక కారణం అయ్యారు. ఇప్పుడు ఇదు నమ్మ ఆళు చిత్రానికి నయనతార పరంగా పునరావృతమైంది. ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని శింబు ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సరసన ఆయన మాజీ ప్రియురాలు నయనతార నటించడానికి అంగీకరించడంతో ఈ చిత్రం సంచలనాలకు కేంద్రంగా మారింది. అయితే ఊహించని విధంగా చిత్ర షూటింగ్‌లో జాప్యం జరిగింది. విశేష మేమిటంటే వాలు చిత్రం తరహాలోనే ఇదు నమ్మ ఆళు చిత్రానికి ఒక్క సాంగ్ చిత్రీకరణ చెయ్యాల్సింది. ఎన్నో సమస్యలను ఎదురీది వాలు చిత్రాన్ని విడుదల చేసిన టి.రాజేందర్‌కు ఇదు నమ్మ ఆళు చిత్ర రూపంలో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఇదు నమ్మ ఆళు చిత్రం కోసం మిగిలిన పాటను చిత్రీకరించడానికి సిద్ధం అవ్వగా తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను ఉపయోగించుకోలేదు. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నాను. చిత్రంలో మిగిలిన పాటను చెయ్యను అని నయనతార చెప్పడంతో సమస్య నడిగర్ సంఘం వరకూ వెళ్లింది. సంఘం నిర్వాహకులు నయనతారతో చర్చించినా ఫలితం లేకపోయిందని సమాచారం. శింబుతో ఆ సాంగ్‌లో నటించేది లేదని నయనతార ఖరాఖండీగా చెప్పారట. గట్టిగా చెప్పాలంటే ఆ చిత్రానికి పారితోషికం బాకీ ఉంది. ముందు దాన్ని చెల్లించమని చెప్పండని నయనతార నడిగర్ సంఘం నిర్వాహకులకు చెప్పారట. ఇందులో నటించడానికి నయనతారకు రెండు కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఆమెకింకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement