1. కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటి ఎవరు?
ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) రాధ డి) రాధిక
2. ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరో తెలుసా?
ఎ) మహేశ్ బాబు బి) రామ్ చరణ్ సి) ఎన్టీఆర్ డి) అల్లు అర్జున్
3. మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ‘బిందాస్’. ఈ చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో నవ్వులు పండించిన హాస్య నటుడెవరు?
ఎ) బ్రహ్మానందం బి) శ్రీనివాసరెడ్డి సి) యం.యస్. నారాయణ డి) ‘వెన్నెల’ కిశోర్
4.‘స్నేహగీతం’ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఓ హీరోగా నటించిన నటుడు ఇప్పుడు దర్శకుడు. ఎవరా దర్శకుడు?
ఎ) సందీప్ కిషన్ బి) వెంకీ అట్లూరి సి) రాహుల్ రవీంద్రన్ డి) వరుణ్ సందేశ్
5. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో దుల్కర్ సరసన నటించిన ఆ బంగారం ఎవరు?
ఎ) అదితీరావు బి) తులసీ నాయర్ సి) నిత్యామీనన్ డి) కార్తీకా నాయర్
6. రామ్ హీరోగా నటించి విజయం సాధించిన ‘నేను ౖÔð లజ’ చిత్రంలో శైలజ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి?
ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) కీర్తీ సురేశ్ డి) రాశీ ఖన్నా
7. మొదటి సినిమాతోనే పాటల రచయితగా నంది అవార్డు అందుకున్న రచయిత ఎవరో కనుక్కోండి?
ఎ) రామజోగయ్య శాస్త్రి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) శ్రీమణి డి) చంద్రబోస్
8. శర్వానంద్, ‘అల్లరి’ నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గమ్యం’. ఆ చిత్రదర్శకుడెవరు?
ఎ) క్రిష్ జాగర్లమూడి బి) భాస్కర్ సి) జి. నాగేశ్వర్ రెడ్డి డి) పరశురామ్
9. ‘ముద్దబంతి పూవులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు...’ ‘అల్లుడుగారు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త ఎవరో తెలుసా?
ఎ) ఇళయరాజా బి) కోటి సి) కేవీ మహ దేవన్ డి) మణిశర్మ
10. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్న హీరో పేరు ధ్రువ్. ఆయన ఏ ప్రముఖ నటుని కుమారుడో తెలుసా?
ఎ) కార్తీక్ బి) విక్రమ్ సి) మురళీ డి) ప్రభు
11. తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఏ చిత్రంలో హీరోయిన్ సదా నటించారో చూడండి?
ఎ) శివాజీ బి) బాయ్స్ సి) అపరిచితుడు డి) రోబో
12.‘నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ అవార్డును సాధించిన నటునికి భారత ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంతో తెలుసా?
ఎ) 50000 బి) 100000 సి) 25000 డి) 75000
13. రీమా లంబా ఈ నటి అసలు పేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ స్క్రీన్ పేరేంటి?
ఎ) పూజాభట్ బి) రవీనా టాండన్ సి) సోనాలీ బింద్రే డి) మల్లికా శెరావత్
14. సుధీర్‌బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శ్రుతి’. ఆ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక ఎవరు?
ఎ) ప్రణీత బి) రెజీనా సి) క్యాథరిన్ థెరిస్సా డి) లావణ్యా త్రిపాఠి
15. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారవుతున్న నూతన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నితిన్ డి) నాని
16. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌కు ఓనర్స్‌లో ఒకరు సునీల్ గవాస్కర్. మరో ఓనర్ ఈ ప్రముఖ హీరో. ఎవరతను?
ఎ) వెంకటేశ్ బి) రానా సి) చిరంజీవి డి) నాగార్జున
17.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘గ్రహణం’. ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన నటి
ఎవరు?
ఎ) ప్రగతి బి) రేవతి సి) లక్ష్మీ డి) జయలలిత
18.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) ఈషా రెబ్బా బి) నివేథా థామస్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్
19.ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి?
ఎ) కీర్తి చావ్లా బి) గజాలా సి) జెనీలియా డి) అంకిత
20. కింది ఫొటోలోని చిన్నారి ఎవరు? చిన్న క్లూ: తను మలయాళ హీరోయిన్
ఎ) నిత్యామీనన్ బి) సాయి పల్లవి సి) అనుపమ డి) నజ్రియా నజీమ్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు:
1) ఎ 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) సి
12) ఎ 13) డి 14) బి 15) బి 16) డి 17) డి 18) ఎ 19) ఎ 20) డి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment