Catherine Thresa.
-
మరో ఇరవై ఏళ్లు మీ కోసం కష్టపడతా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి’’ అని నితిన్ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేపథ్య సంగీతానికి మణిశర్మగారు కింగ్ అంటారు. కానీ మా సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడిగా స్వరసాగర్ నేపథ్య సంగీతం కొట్టాడు. ఈ సినిమా మీకందరికీ ఫుల్ మీల్స్. ఈ చిత్రంతో రాజశేఖర్ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. ఆగస్టు 12న గట్టిగా కొట్టబోతున్నాం’’ అన్నారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘దిల్’ సినిమా తర్వాత నితిన్‌ని కలిసి భయం భయంగా ఓ కథ చెప్పాను. అప్పుడు తను ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ‘అతనొక్కడే’ సినిమా చేశా. అప్పటి నుంచి నితిన్‌తో సినిమా చేయాలనుకునే వాణ్ణి.. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా. ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను ఈ స్థాయికి రావడానికి పదిహేనేళ్లు పట్టింది. ఇండస్ట్రీలో ఎడిటర్‌గా బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. ఎడిటర్‌గా ఉన్న నన్ను డైరెక్టర్ని చేసిన నితిన్‌కి థ్యాంక్స్. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత హరి, దర్శకులు హను రాఘవపూడి, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ, మెహర్ రమేశ్, నటులు బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభిస్తా
‘‘నా సినిమాల ఎంపిక రాంగ్ ఛాయిస్ అని అనుకోవడం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడాదే అవుతోంది. ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా? అనే ఆసక్తితో ఉంటాను. ఇలాంటి సమయంలో నాకు షూటింగ్ లేకపోతే అది నా రాంగ్ ఛాయిస్ అవుతుంది’’ అని కృతీశెట్టి అన్నారు. నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు.. ► ‘మాచర్ల నియోజకవర్గం’ కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. ఇందులో స్వాతి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్లో విభిన్నమైన షేడ్స్ ఉన్నాయి. ఇది కమర్షియల్ మూవీయే అయినప్పటికీ నా పాత్రకు మచి ప్రాధాన్యం ఉంది. ఓ మంచి ప్యాకేజŒ తో ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ► నితిన్‌గారు తొలి చిత్రం ‘జయం’లో ఎలా ఫ్రెష్‌గా ఉన్నారో ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ అలానే ఉన్నారు. ఆయన నిజాయితీ వల్లే ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అనుకుంటున్నాను. నాకూ ఇలాంటి ప్రయాణం ఉండాలంటూ దీవించమని నితిన్గారిని అడిగాను(నవ్వుతూ). రాజశేఖర్‌గారికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించారు. ► విలక్షణ నటిగా ప్రేక్షకులు నన్ను గుర్తించాలని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. అందుకే ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’లో మోడ్రన్గాళ్గా చేశా. ‘ఉప్పెన’ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిగారితో కలిసి నటించాను. నటనలో విలక్షణ పాత్రలు చేయాలనే స్ఫూర్తి ఆయన వల్లే నాలో కలిగిందేమో!. వినోదం, వైవిధ్యం.. రెండూ బ్యాలెన్స్ చేసేలా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాను. కానీ నేను నటించిన కమర్షియల్ చిత్రాలు ఈ మధ్య వరుసగా విడుదల అయ్యాయి. సూర్యగారి ‘అచలుడు’, సుధీర్ బాబుగారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో విభిన్నంగా కనిపిస్తాను. ► లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని చిన్నతనం నుంచి అనుకుంటున్నాను. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనిని స్టార్ట్ చేస్తాను. నా సినిమాల ఫలితాల గురించి నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గానే భావిస్తాను. నా సినిమాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలనే కష్టపడతాను. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను. వివరాలు త్వరలో వెల్లడిస్తాను. ► నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మగారే. నేను చూసిన స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఆమె. నాకు చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలో ఉంటే ఫ్రెండ్షిప్డేని బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. -
తమ్ముడితో పాన్ ఇండియా సినిమా పక్కా.. కథ కుదిరితే బాబాయ్తోనూ..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు’ అనే మాటలను నేను నమ్మను. ఇతర భాషలతో పోలిస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు.. సినిమాలను ప్రేమిస్తారు. కథ బాగుంటే తెలుగు చిత్రాలనే కాదు.. పరభాషా సినిమాలను కూడా ఆదరిస్తారు’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ► వశిష్ఠ్ చెప్పిన ‘బింబిసార’ కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. పైగా సరికొత్త పాయింట్ కావడంతో ఓకే చెప్పేశాను. కథ బాగుండటం, చక్కని టీమ్ కుదరడంతో తను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు వశిష్ఠ్. ► మా తాతగారు (ఎన్టీఆర్), బాబాయ్ (బాలకృష్ణ)లు రాజులుగా చేసి, మెప్పించారు. ఈ చిత్రంలో బింబిసారుడు అనే రాజు పాత్ర అనగానే నేను సెట్ అవుతానా? అనిపించింది. రాజు అంటే ఇలాగే ఉంటాడు అనేలా ఈ తరం నటుల్లో ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. నా లుక్ విషయంలో ముందు కొన్ని అనుకున్నా ఫైనల్‌గా మూవీలోని లుక్ ఫిక్స్ చేశాం. ఈ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ► ‘ఏ కథలో ఏ హీరో నటించాలో రాసిపెట్టి ఉంటుంది. ఏ కథ అయినా ఆ హీరోని వెతుక్కుంటుంది’ అని మా నాన్న (హరికృష్ణ) చెప్పేవారు. ‘అతనొక్కడే’ చిత్రకథ కూడా ఎందరో విన్నా ఫైనల్‌గా నేను చేశా. అలా ‘బింబిసారుడు’ కథ నా కోసం పుట్టింది. ప్రేక్షకుల అంచనాలను వందశాతం రీచ్ అవుతాం. ► కోవిడ్‌కి ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. అప్పుడు ఇతర భాషల్లో చేద్దామనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం సమయం పడుతుంది. అంత టైమ్ మాకు లేదు.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. ఇక్కడ హిట్ అయిన తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. ► తెలుగువాళ్లకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. కుటుంబంతో కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. మనం మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. ఓ సినిమా బాగుందంటే వచ్చే మౌత్ పబ్లిసిటీకి చాలా పెద్ద స్పాన్ ఉంది. నా ‘అతనొక్కడే’ చిత్రం కూడా తొలి ఆట నుంచే మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయింది. ఈ మధ్య రిలీజ్ అయిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల్లో మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ► ఓ నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.. నా దృష్టంతా నటనపైనే ఉంటుంది. ప్రస్తుతం ‘బింబిసార’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటంతో తెలుగులో షూటింగ్‌ల బంద్ విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా విడుదల తర్వాత స్పందిస్తాను. రొమాంటిక్ సినిమాలు నాకు సెట్ అవ్వవు.. అందుకే చేయను (నవ్వుతూ). ‘బింబిసార 2’కి కథ రెడీగా ఉంది. నేను నిర్మాతగా తమ్ముడితో(ఎన్టీఆర్) ఓ పాన్ ఇండియా సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరితే బాబాయ్ (బాలకృష్ణ)తోనూ ఓ సినిమా నిర్మిస్తాను. -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా స్టిల్స్
-
స్క్రీన్ టెస్ట్
1. కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటి ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) రాధ డి) రాధిక 2. ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) రామ్ చరణ్ సి) ఎన్టీఆర్ డి) అల్లు అర్జున్ 3. మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ‘బిందాస్’. ఈ చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో నవ్వులు పండించిన హాస్య నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) శ్రీనివాసరెడ్డి సి) యం.యస్. నారాయణ డి) ‘వెన్నెల’ కిశోర్ 4.‘స్నేహగీతం’ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఓ హీరోగా నటించిన నటుడు ఇప్పుడు దర్శకుడు. ఎవరా దర్శకుడు? ఎ) సందీప్ కిషన్ బి) వెంకీ అట్లూరి సి) రాహుల్ రవీంద్రన్ డి) వరుణ్ సందేశ్ 5. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో దుల్కర్ సరసన నటించిన ఆ బంగారం ఎవరు? ఎ) అదితీరావు బి) తులసీ నాయర్ సి) నిత్యామీనన్ డి) కార్తీకా నాయర్ 6. రామ్ హీరోగా నటించి విజయం సాధించిన ‘నేను ౖÔð లజ’ చిత్రంలో శైలజ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) కీర్తీ సురేశ్ డి) రాశీ ఖన్నా 7. మొదటి సినిమాతోనే పాటల రచయితగా నంది అవార్డు అందుకున్న రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) శ్రీమణి డి) చంద్రబోస్ 8. శర్వానంద్, ‘అల్లరి’ నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గమ్యం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) భాస్కర్ సి) జి. నాగేశ్వర్ రెడ్డి డి) పరశురామ్ 9. ‘ముద్దబంతి పూవులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు...’ ‘అల్లుడుగారు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త ఎవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) కోటి సి) కేవీ మహ దేవన్ డి) మణిశర్మ 10. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్న హీరో పేరు ధ్రువ్. ఆయన ఏ ప్రముఖ నటుని కుమారుడో తెలుసా? ఎ) కార్తీక్ బి) విక్రమ్ సి) మురళీ డి) ప్రభు 11. తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఏ చిత్రంలో హీరోయిన్ సదా నటించారో చూడండి? ఎ) శివాజీ బి) బాయ్స్ సి) అపరిచితుడు డి) రోబో 12.‘నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ అవార్డును సాధించిన నటునికి భారత ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంతో తెలుసా? ఎ) 50000 బి) 100000 సి) 25000 డి) 75000 13. రీమా లంబా ఈ నటి అసలు పేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ స్క్రీన్ పేరేంటి? ఎ) పూజాభట్ బి) రవీనా టాండన్ సి) సోనాలీ బింద్రే డి) మల్లికా శెరావత్ 14. సుధీర్‌బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శ్రుతి’. ఆ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) ప్రణీత బి) రెజీనా సి) క్యాథరిన్ థెరిస్సా డి) లావణ్యా త్రిపాఠి 15. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారవుతున్న నూతన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నితిన్ డి) నాని 16. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌కు ఓనర్స్‌లో ఒకరు సునీల్ గవాస్కర్. మరో ఓనర్ ఈ ప్రముఖ హీరో. ఎవరతను? ఎ) వెంకటేశ్ బి) రానా సి) చిరంజీవి డి) నాగార్జున 17.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘గ్రహణం’. ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన నటి ఎవరు? ఎ) ప్రగతి బి) రేవతి సి) లక్ష్మీ డి) జయలలిత 18.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఓ హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) నివేథా థామస్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 19.ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) కీర్తి చావ్లా బి) గజాలా సి) జెనీలియా డి) అంకిత 20. కింది ఫొటోలోని చిన్నారి ఎవరు? చిన్న క్లూ: తను మలయాళ హీరోయిన్ ఎ) నిత్యామీనన్ బి) సాయి పల్లవి సి) అనుపమ డి) నజ్రియా నజీమ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) ఎ 13) డి 14) బి 15) బి 16) డి 17) డి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
మాస్ అమ్మా... మాస్!
బీట్... ఒక్క బీట్...హార్ట్ బీట్‌ని పెంచేస్తుంది! నోట్... ఒక్క మాస్ నోట్...మనందరి చేత స్టెప్పులేయిస్తుంది!రూరల్ టు సిటీ... సిటీ టు రూరల్....ఏ రూటులోని థియేటర్లోనైనా...ఎంత రేటు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకుడినైనా... వయసెంతైనా...స్టెప్పులేయించగల సత్తా... పాడించగల పట్టు... ఐటమ్ పాటకున్న ప్రత్యేకతలు!! మరి, మూడు గంటల సినిమాలో మూడున్నర నిమిషాల ఐటమ్ పాటలోసందడి చేసే భామలు? చిందేసే చిచ్చుబుడ్డీలు...కనువిందు చేసే కాకర పువ్వొత్తులు...టెన్ థౌజెండ్‌వాలా టపాసులు! సిన్మాలో వీళ్ల వెలుగులు, సౌండులు కాసేపే!కానీ, థియేటర్లను హోరెత్తించే ఈ స్పెషల్ సాంగులు..మాస్ అమ్మా... మాస్! రత్తాలూ... రైట్ రైట్! రత్తాలు రాకతో సంక్రాంతి పండక్కి థియేటర్లలో దీపావళి వచ్చేసింది. చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రత్తాలూ... రత్తాలూ’లో చిరూతో కలసి రాయ్ లక్ష్మీ అంతలా రఫ్ఫాడించేశారు మరి! రాయ్ లక్ష్మీ అంతకు ముందు ఎన్ని ఐటమ్ సాంగులు చేసినా... రత్తాలు మాత్రం ఆమెకు, ప్రేక్షకులకూ స్పెషల్! డ్యాన్సులో చిరు గ్రేసు, సాంగులో చిరూతో రాయ్ లక్ష్మీ వేసిన స్టెప్పులు... పట్టాలు ఎక్కిన రైలు వెళ్లేంత స్పీడులో ప్రేక్షకుల చేత స్టెప్పులేయించాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఇందులో రత్తాలు హాట్ అప్పియరెన్స్‌కి ప్రేక్షకులు రైట్... రైట్... అని ఓటేశారు. స్వింగ్ జరా... సెన్సేషన్రా! దీపావళికి నెల ముందు.. సరిగ్గా దసరా టైమ్‌లో... థియేటర్లలో సాలిడ్ సౌండ్ వినబడింది. ఎవరది? అంత సౌండ్ చేసింది? అని చూస్తే... తమన్నా! ఎన్టీఆర్‌తో స్టెప్పులు కలిపారు. థియేటర్లలో ఎవరి సీటుల్లో వాళ్లు కూర్చుంటే... అందరి చేత ‘స్వింగ్ జరా’ సాంగుతో స్టెప్పులేయించారు. కళ్లల్లో కసి, స్టెప్పుల్లో సెక్సీనెస్, ఎన్టీఆర్ రావణతాండవం... వెరసి సాంగ్ సెన్సేషన్! తెలుగు ప్రేక్షకులకు తమన్నా అందాలు కొత్తేం కాదు. ఎన్టీఆర్‌తో కలసి ఆల్రెడీ ఓ సినిమా చేశారు. కానీ, ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ సూపరో... సూపరు! అందుకే, పాట అంత హిట్టయ్యింది. సూయ... సూయ... స్టైలిష్ అనసూయ! రత్తాలొచ్చిన నెలన్నర తర్వాత థియేటర్లలో నిఖార్సైన నాటు బాంబు పడింది. ఈ నాటు బాంబు పేరు... అనసూయ. రత్తాలు చిరూతో వస్తే... చిరు మేనల్లుడు ‘విన్నర్’ సాయిధరమ్ తేజ్‌తో అనసూయ వచ్చారు. ‘సూయ సూయ అనసూయ’ అని ఆమె పేరుపైనే పాట రాయడం అనసూయకు దక్కిన అరుదైన అదృష్టం. హాట్ యాంకర్ అనసూయ హస్కీ లుక్స్, సెక్సీ స్టెప్పులకు తోడు ప్రముఖ యాంకర్ సుమ పాడడంతో ఈ పాటకు మాంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో బాగానే సౌండ్ చేసిందీ సాంగ్! సిరిమల్లి... హాట్ రెడ్ చిల్లి! లేట్ కాలేదు... నాటు బాంబు వచ్చిన వారం రోజులకు దీవాలి టపాసు వచ్చేసింది. ఈ టపాసు స్టెప్పులకు పోరగాళ్లు ఫుల్ టాస్. ఫుల్ టు బిందాస్! ఈ టపాసు పేరు... హంసా నందిని. అసలే, ఐటమ్ సాంగులకు కేరాఫ్ అడ్రస్ ఈ రెడ్ చిల్లి. ‘మిర్చి’ నుంచి లాస్ట్ ఇయర్ ‘శ్రీరస్తు శుభమస్తు’ వరకు పలు సిన్మాల్లోని ఐటమ్ సాంగుల్లో ఘాటు ఘాటుగా కనిపించారు. ఈ ఏడాది రాజ్‌తరుణ్ ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో ‘నా పేరే సింగపూర్ సిరిమల్లి’ అంటూ చిచ్చుబుడ్డిలా వెలుగులు విరజిమ్మారు. పాటలో చెప్పినట్టు హంసా నందిని అందం హాట్ హాట్ రెడ్ చిల్లీనే. కొంటె కుర్రాళ్ల గుండెల్లో లొల్లి లొల్లీనే! టైమ్ లేదు గురూ... శ్రియ చమక్కులు! ‘టైమ్ లేదు గురూ...’ అంటూ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో కనిపించారు శ్రియ. కానీ, అప్పటికి చాలా టైమైంది... తెలుగు తెరపై ఐటమ్ బాంబు పేలి! ఇటువంటి పాటల్లో శ్రియ చమక్కులు చూపించి! మార్చి మొదట్లో హంస హోయలొలికిస్తే... ఆగస్టు ఫస్టు వీక్‌లో శ్రియ సౌండ్ చేశారు. హీరోయిన్లను అందంగా చూపడంలో స్పెషలిస్ట్ అయిన కృష్ణవంశీ, మోడ్రన్ డ్రస్సుల్లో శ్రియను సెక్సీగా చూపించారు. దాంతో కుర్రకారు హ్యాపీ.ఎ ఫర్ అందగత్తె... సి ఫర్ క్యాథరిన్! ఎ ఫర్ అందగత్తె. బి ఫర్ బాంబ్... ఐటమ్ బాంబ్! ఎవరు? సి ఫర్ క్యాథరిన్. కావాలంటే... ‘జయ జానకి నాయక’లో ‘ఎ ఫర్ యాపిలు... బి ఫర్ బుజ్జులు’ చూడండి. క్యాథరిన్ చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. గట్టిగానే పేలిందీ బాంబ్. బెల్లకొండ శ్రీనివాస్ మంచి డ్యాన్సర్. అతని పక్కన అందంతో, అదరగొట్టే స్టెప్పులతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశారు క్యాథరిన్. స్వీట్ సన్నీ.. ప్యారీ పూజ...రెడీ టు బ్లాస్ట్! జస్ట్... టూ వీక్స్ వెయిట్ చేస్తే చాలు! థియేటర్లలో ఇంకో ఐటమ్ బాంబు పేలుతుంది. మామూలు బాంబ్ కాదిది.. ఇంటర్నేషనల్ బాంబ్! పేరు... సన్నీ లియోన్. ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని శృంగార తార. వచ్చే నెల 3న థియేటర్లలోకి వస్తున్న రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’లో ఐటమ్ సాంగ్ చేశారు. అది ఏ రేంజ్లో పేలబోతుందో... ‘డియో డియో డిసక’ పాట వింటే అర్థమవుతుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన బీట్‌లో మాస్‌ని ఊపేసే ఓ మేజిక్ ఉంది. ఆల్రెడీ నెట్టింట్లో ‘డియో డియో’ ట్యూన్, సన్నీ స్టిల్స్, మేకింగ్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. ఓన్లీ... ఈ ఒక్క పాటకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట! సన్నీ లేడీ 50 లక్షలు తీసుకుంటే... మేకింగ్‌కి మరో 50 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాటను నాలుగు రోజులు తీశారు. ‘‘నా సినిమాల్లో నేను తీసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇది. అందుకే, ‘ది బెస్ట్’ సాంగ్‌ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను’’ అని చిత్రదర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఇక, ఐటమ్ సాంగ్‌తో బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతోన్న మరో బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పటివరకు ఈమె ఏ సినిమాలోనూ ఐటమ్ గాళ్‌గా కనిపించలేదు. రామ్‌చరణ్ ‘రంగస్థలం’తో ఆ లోటు తీర్చేస్తున్నారు. çసుకుమార్ సినిమాల్లో ఐటమ్ బాంబులు ఏ రేంజ్లో పేలాయో? సుక్కు సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత రెచ్చిపోతారో? ప్రత్యేకంగా చెప్పాలా!! సో, ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేయబోయే పాట ఆల్రెడీ హిట్టని ప్రేక్షకులు ఫిక్సయ్యారు! - సత్య పులగం -
రాధ... రాణి నడుమ రాజు
నారీ నారీ నడుమ మురారి... ఆ పాట్లు ఎలా ఉంటాయో పడేవాళ్లకు బాగా తెలుసు. ఆన్ స్క్రీన్‌లో ఇద్దరి భామల మధ్య ఇరుకున పడే పాత్రలను చాలామంది హీరోలు చేశారు. ఇప్పుడు రానా ఇద్దరు భామల మధ్య క్రష్ అవుతున్నారు. తేజ దర్శకత్వంలో నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానాకు ఇద్దరు కథానాయికలు. ఒకరు కాజల్ అగర్వాల్. మరొకరు కేథరిన్ థ్రెసా. ‘నేనే రాధ నేనే భార్య’ అని కాజల్ అంటూంటే, కేథరిన్ ఏమో ‘కాదు నేనే రాణి నేనే భార్య’ అంటున్నారు. మరి... ఈ భామలలో రాజుగారిS అసలు భార్య ఎవరు? అనడిగితే... దర్శకుడు తేజ సమాధానం చెప్పేదాకా ఆగాల్సిందే! ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్లో హిట్టు కళ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడీ రాధా, రాణిల పరిచయంతో ఆ కళ ఇంకాస్త పెరిగిందనే చెప్పొచ్చు. సురేశ్‌బాబు, భరత్ చౌదరి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.