‘‘నా సినిమాల ఎంపిక రాంగ్ ఛాయిస్ అని అనుకోవడం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడాదే అవుతోంది. ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా? అనే ఆసక్తితో ఉంటాను. ఇలాంటి సమయంలో నాకు షూటింగ్ లేకపోతే అది నా రాంగ్ ఛాయిస్ అవుతుంది’’ అని కృతీశెట్టి అన్నారు. నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఎమ్‌ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు..
► ‘మాచర్ల నియోజకవర్గం’ కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. ఇందులో స్వాతి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్‌లో
విభిన్నమైన షేడ్స్ ఉన్నాయి. ఇది కమర్షియల్ మూవీయే అయినప్పటికీ నా పాత్రకు మచి ప్రాధాన్యం ఉంది. ఓ మంచి ప్యాకేజŒ తో ఆడియన్స్ ఎంటర్‌టైన్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది.
► నితిన్‌గారు తొలి చిత్రం ‘జయం’లో ఎలా ఫ్రెష్‌గా ఉన్నారో ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ అలానే ఉన్నారు. ఆయన నిజాయితీ వల్లే ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అనుకుంటున్నాను. నాకూ ఇలాంటి ప్రయాణం ఉండాలంటూ దీవించమని నితిన్‌గారిని అడిగాను(నవ్వుతూ). రాజశేఖర్‌గారికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించారు.
► విలక్షణ నటిగా ప్రేక్షకులు నన్ను గుర్తించాలని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. అందుకే ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’లో మోడ్రన్‌గాళ్‌గా చేశా. ‘ఉప్పెన’ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిగారితో కలిసి నటించాను. నటనలో విలక్షణ పాత్రలు చేయాలనే స్ఫూర్తి ఆయన వల్లే నాలో కలిగిందేమో!. వినోదం, వైవిధ్యం.. రెండూ బ్యాలెన్స్ చేసేలా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాను. కానీ నేను నటించిన కమర్షియల్ చిత్రాలు ఈ మధ్య వరుసగా విడుదల అయ్యాయి. సూర్యగారి ‘అచలుడు’, సుధీర్ బాబుగారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో విభిన్నంగా కనిపిస్తాను.
► లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని చిన్నతనం నుంచి అనుకుంటున్నాను. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనిని స్టార్ట్ చేస్తాను. నా సినిమాల ఫలితాల గురించి నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గానే భావిస్తాను. నా సినిమాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవ్వాలనే కష్టపడతాను. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను. వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
► నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మగారే. నేను చూసిన స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఆమె. నాకు చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలో ఉంటే ఫ్రెండ్‌షిప్‌డేని బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని.
Krithi Shetty-Macherla Niyojakavargam: స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభిస్తా
Published Sun, Aug 7 2022 4:02 AM | Last Updated on Sun, Aug 7 2022 8:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment