నటుడు విజయ్ నుంచి నేర్చుకున్నానంటోంది అమలాపాల్
నటుడు విజయ్ నుంచి నేర్చుకున్నానంటోంది అమలాపాల్
Published Sun, Aug 25 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
నటుడు విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో క్రేజీ హీరోయిన్‌గా ప్రకాశిస్తోంది. కోలీవుడ్‌లో విజయ్‌తో జతకట్టిన తలైవా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జయంరవికి జంటగా నిమిర్న్‌ందు నిల్ చిత్రంలో, ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో, మలయాళంలో ఒక్కో చిత్రంలో చేస్తోంది. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్ సరసన నటించాలన్న కోరిక తలైవా చిత్రంతో నెరవేరిందని తెలిపింది.
తలైవా చిత్రంలో హీరోయిన్‌గా దర్శకుడు విజయ్ తనను ఎంపిక చేసినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనంది. తన జీవితంలో ఊహించని సంఘటనలు చాలా జరిగాయని పేర్కొంది. తాను స్నేహానికి చాలా విలువనిస్తానని తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు ప్రాముఖ్యం ఉండదని పేర్కొంది. అయితే తలైవాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని వివరించింది. ఈ పాత్రలో నటించడం చాలెంజింగ్‌గా ఉందని పేర్కొంది. ఈ పాత్ర పోషణలో హీరో విజయ్ తనకు చాలా సహకరించారని చెప్పింది. వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తి విజయ్ అని పొడగ్తలు కురిపించింది.
Advertisement