‘నేను రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకోలేదు’ | Amalapaul about her marriage | Sakshi
Sakshi News home page

‘నేను రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకోలేదు’

Nov 26 2016 2:44 AM | Updated on Sep 4 2017 9:06 PM

‘నేను రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకోలేదు’

‘నేను రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకోలేదు’

తాను పెళ్లి చేసుకున్న సమయం సరైనది కాదని నటి అమలాపాల్ పేర్కొన్నారు.

తాను పెళ్లి చేసుకున్న సమయం సరైనది కాదని నటి అమలాపాల్ పేర్కొన్నారు. ఆరంభ దశలోనే తమిళం, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన నటి అమలాపాల్. తమిళంలో మైనా చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న అమలాపాల్‌కు ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. విక్రమ్, విజయ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. నాయకిగా ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే ఏడాది తిరక్కుండానే ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. వీరి వ్యవహారం కోలీవుడ్‌లో పెద్ద సంచలనమే కలిగించింది. అరుుతే ఇది జరిగి చాలా కాలమైన తరువాత అమలాపాల్ ఇటీవల తన వివాహ రద్దు గురించి మనసు విప్పి మాట్లాడారు. అదేమిటో చూద్దాం. ‘నా పెళ్లి జరిగింది రైట్ టైమ్‌లో కాదు. నేను 18 ఏళ్ల వయసులోనే నటించడానికి వచ్చాను. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను.

ఇక 24 ఏళ్లకే విడాకులు తీసుకున్నాను. అందుకే ఒక సాధారణ అమ్మాయిలా ముఖ్యమైన నిర్ణయాలను సరైన సమయంలో తీసుకోలేని పరిస్థితి. నాకు మంచి చెడు గురించి చెప్పేవారు లేరు. అలా తెలియక చేసిన తప్పులకు గణపాఠం నేర్చుకున్నాను. విడాకుల విషయం నాకు చాలా బాధ కలిగించింది. తరువాత చాలా ఏడ్చేశాను. అందుకు ఎవరినీ బాధ్యులను చేయను. ఇవన్నీ నాకు పాఠాలే. ఎవరూ విడిపోవడానికి పెళ్లి చేసుకోరు. అరుుతే కాలం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కాలం గడిచిపోతున్నట్లే, ప్రేమ మనల్ని విడిచిపోతుంది. అరుుతే విజయ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడాన్ని నేను ఎప్పడూ తప్పుగా భావించలేదు. ఆయన్ని నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తాను. అరుుతే నేను పెళ్లి చేసుకున్నది రైట్ టైమ్ కాదు.

ఈ విషయంలో నన్ను నేను అర్థం చేసుకున్నాను. ఇకపోతే భవిష్యత్ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. దాన్ని తలచుకుంటూ డీలా పడిపోను. త్వరలోనే కష్టాలన్నీ సమసి పోతారుు. రేపేమిటో ఎవరీకీ తెలియదు.అందువల్ల ఇతరులకు బాధ కలగకుండా జీవితాన్ని సాగించాలి. ఇక తోటి మహిళలకు నేను చెప్పేదొక్కటే, మీ వివాహ జీవితం సక్రమంగా సాగకపోతే వెంటనే తగిన నిర్ణయం తీసుకోండి’ అంటున్న అమలాపాల్‌ను నటిగా మాత్రం అదృష్టం వరిస్తూనే ఉంది. సాధారణంగా పెళ్లి, పెటాకులు జరిగిన తరువాత వృత్తిపై వ్యక్తిగత జీవిత ప్రభావం పడుతుంది.అరుుతే అమలాపాల్ దాన్ని అధిగమించారనే చెప్పాలి. కథానాయకిగా చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు.

ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహించనున్న చిత్రం వేలై ఇల్లా పట్టాదారి-2లోనూ ధనుష్‌కు ముగ్గురు నారుుకల్లో ఒకరిగా నటించనున్నారు. తిరుట్టు పయలే-2లోనూ అమలాపాల్ నాయకిగా నటిస్తున్నారు. వాటితో పాటు ఒక మలయాళ చిత్రంలో నటిస్తున్న ఈ కేరళా కుట్టికి తాజాగా యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్‌‌స చేసే అవకాశం వరించింది. ముండాసు పట్టి చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement