అసలు కారణం... అత్తమామల పోరేనా..? | Amala Paul Divorcing Husband. His Dad Blames Her Career. And This is 2016 | Sakshi
Sakshi News home page

అసలు కారణం... అత్తమామల పోరేనా..?

Published Tue, Aug 2 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

అసలు కారణం... అత్తమామల పోరేనా..?

అసలు కారణం... అత్తమామల పోరేనా..?

గాసిప్


కోడంబాక్కమ్ సినీవర్గాల్లో లేటెస్ట్ టాపిక్ ఏంటో తెలుసా? రెండేళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్న తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్, నటి అమలాపాల్ విడిపోవడం! గాఢంగా ప్రేమించుకొని మరీ పెళ్ళి చేసుకున్న ఈ సినీ జంట అర్ధంతరంగా ఇలా విడిపోతుండడానికి అసలు కారణం ఏంటి? పెళ్ళయిన తర్వాత కూడా అమలాపాల్ సినిమాల్లో నటించడమే కారణమని ప్రచారంలో ఉంది. కానీ, అది అసలు కారణం కాదా? ‘కాదు.. సామీ’ అని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కథలు కథలుగా చెబుతున్నాయి.


ఈ గుసగుసరాయుళ్ళు చెబుతున్న విషయం ఏమిటంటే... పెళ్లి తర్వాత కూడా అమలా పాల్ స్వేచ్ఛగా సినిమాల్లో నటించారు. అప్పుడామెకు భర్త విజయ్ అభ్యంతరం చెప్పలేదు. సరికదా... అండదండగా నిలిచారు. ‘పెళ్లి తర్వాత నటించడం మానేయ్!’ వంటి కండిషన్స్ ఆయన ఎప్పుడూ పెట్టలేదట. షూటింగులకూ, డబ్బింగ్ థియేటర్లకూ ఆయనే దగ్గరుండి మరీ భార్యను తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ‘మరి, అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఇప్పుడిలా విడిపోతుండడానికి అసలు కారణం... ఎన్నప్పా?’ అని అడిగితే, అమలాపాల్ అత్తమామల పోరే అంటున్నారు. సినిమాల్లో నటించడం మానేయమంటూ అమలాపాల్‌పై అత్తమామలు విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారట. ఇంకా, ఇతర సమస్యలు కూడా ఏవేవో ఉన్నాయట. ఇవన్నీ నచ్చని ఈ యువ హీరోయిన్ విడిపోవడానికి మెగ్గు చూపారనే మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకూ విడాకుల విషయమై విజయ్ తరఫు బంధువులు మాత్రమే మీడియాతో మాట్లాడారు. ‘అభినేత్రి’ నిర్మాణానంతర పనుల్లో తలమునకలై ఉన్న విజయ్ నోరు విప్పలేదు. అత్తింటి తరఫు వాళ్ళ మాటలకు అమలాపాల్ స్పందించలేదు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె మౌనంగానే ఉండిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పితేనే కానీ అసలు నిజం బయటపడదు. విజయ్ వెర్షన్ కొంత వచ్చింది కాబట్టి, ఇక నాణేనికి రెండో వైపు చెప్పాల్సింది - అమలాపాలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement