బంపర్‌ ఆఫర్‌ | Amala Paul joins the cast of Mani Ratnam's Ponniyin Selvan | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌

May 10 2019 3:53 AM | Updated on May 10 2019 3:53 AM

Amala Paul joins the cast of Mani Ratnam's Ponniyin Selvan - Sakshi

అమలాపాల్‌

అవునా.. అమలాపాల్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారా? అని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మరి.. మణిలాంటి దర్శకుడి సినిమాలో అంటే రత్నంలాంటి అవకాశమే కదా. యస్‌.. మీరు ఊహిస్తున్నది నిజమే. మణిరత్నం తీయబోతున్న భారీ మల్టీస్టారర్‌లో అమలా పాల్‌ నటించనున్నారట. మణిరత్నం సినిమాల్లో ఎంతమంది స్టార్స్‌ ఉన్నప్పటికీ ఎవరి పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత వాళ్లకు ఉంటుంది. గత ఏడాది అరవింద్‌సామి, శింబు, విజయ్‌ సేతుపతి, జ్యోతికలతో ‘చెక్క›చివంద వానమ్‌’ (తెలుగులో ‘నవాబ్‌’) తీశారు.

లేటెస్ట్‌గా ఆయన తమిళ ఫేమస్‌ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను  తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, కీర్తీ సురేశ్, నయనతార నటించనున్నారని సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌లో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్‌ అయితే బావుంటుందని చిత్రబృందం భావించిందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతోందట.  ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించాలి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రిలయన్స్‌ సంస్థ నిర్మించనుందని తెలిసింది. ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement