తిరుట్టుపయలే సీక్వెల్‌లో అమలాపాల్ ? | Amalapal in Tiruttupayale sequel ? | Sakshi
Sakshi News home page

తిరుట్టుపయలే సీక్వెల్‌లో అమలాపాల్ ?

Published Tue, Nov 1 2016 4:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

తిరుట్టుపయలే సీక్వెల్‌లో అమలాపాల్ ?

తిరుట్టుపయలే సీక్వెల్‌లో అమలాపాల్ ?

తిరుట్టుపయలే చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం తిరుట్టుపయలే. అక్రమ సంబంధాలు, చిల్లర దొంగతనాలు అంటూ చర్చనీయాంశ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. సుశీగణేశన్ దర్శకత్వం వహించిన ఇందులో జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్, మాళవిక ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టెరుున్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడం, హింది భాషలలోనూ రీమేక్ అరయిందన్నది గమనార్హం. కాగా అలాంటి చిత్రానికి సీక్వెల్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.

తిరుట్టుపయలే చిత్ర దర్శక నిర్మాతలే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో జీవన్ పాత్రను నటుడు బాబీసింహా, అబ్బాస్ పాత్రను నటుడు ప్రసన్న పోషించనున్నారు. ఇక నటి సోనియా అగర్వాల్ పాత్రకు అమలాపాల్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలిసింది. చర్చనీయాంశ కథా చిత్రంలో నటి అమలాపాల్ ఎలా నటించడానికి అంగీకరించారన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే ప్రారంభ దశలోనే ఈ భామ సింధూసమవెళి అనే చిత్రంలో భర్తతో కాపురం చేస్తూ మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకునే యువతి పాత్రలో నటించి సంచలనం కలిగించారన్నది గుర్తుంచుకోవాలి. భర్త విజయ్ నుంచి విడిపోరుు ప్రస్తుతం నటనపైనే దృష్ట సారిస్తున్న అమలాపాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడైయచెన్నై చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement